HYD: నగరంలో స్థిరాస్తి మార్కెట్ పుంజుకుంటోంది. గత ఆరునెలల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు గణనీయంగా పెరిగాయి.2023లో 878 అనుమతులతో రూ.395 కోట్ల ఆదాయం రాగా.. 2024లో 922 అనుమతులతో రూ.519 కోట్లు సమకూరాయి.కొత్త ‘బిల్డ్‌నౌ’ విధానం, జీప్లస్ సాఫ్ట్‌వేర్‌తో అనుమతుల ప్రక్రియ వేగవంతమైంది. ఈ ఏడాది చివరికి రూ.1000 కోట్ల ఆదాయం సాధించే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు.
Locations: Hyderabad
-
నిధుల కొరత.. నిలిచిన నాలాలు
HYD: గ్రేటర్‌లో నాలాల నిర్మాణం నిధుల కొరత, ఇంజినీర్ల నిర్లక్ష్యంతో అటకెక్కింది. నాలుగేళ్ల క్రితం మొదలైన పనులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ రూ.500 కోట్లు ఖర్చు చేసినా, కేంద్రం ఇచ్చిన రూ.250 కోట్లు అందలేదు. బిల్లులు పేరుకుపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపేశారు. ఖైరతాబాద్ పెద్ద గణపతి నుంచి మింట్ కాంపౌండ్ రోడ్డు, సైఫాబాద్ వరకు నాలా పనులు ట్రాఫిక్ సమస్యలను తెచ్చిపెట్టాయి.
-
పెట్టుబడులపై అధిక లాభాలంటూ దంపతుల మోసం
HYD: నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన పాణెం మహేశ్-ఉజ్వల దంపతులు కేపీహెచ్‌బీలో ఎం/ఎస్ క్రైస్ట్ ప్రాపర్టీస్ పేరుతో సంస్థ స్థాపించారు. విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని.. 2% వడ్డీ లాభాలు హామీ ఇచ్చి 5 నుంచి రూ.2.11కోట్లు వసూలు చేశారు. ప్రామిసరీ నోట్, చెక్కులు ఇచ్చి నమ్మించారు. కొన్ని నెలలు వడ్డీ చెల్లించి ఉడాయించారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఉజ్వలను కందుకూరులో,మహేశ్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు.
-
ట్రాఫిక్ సమస్య.. పరిష్కారాలకు అన్వేషణ
HYD: నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా వారాంతాలు, వర్షం సమయంలో వాహనదారులకు గమ్యం చేరడం సవాల్‌గా మారింది. ట్రాఫిక్ అంతరాయాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్లపై గుంతలు, మలుపుల్లో ఆటోస్టాండ్లు, డివైడర్లు ప్రధాన కారణాలుగా గుర్తించారు. పరిష్కార మార్గాలు అన్వేషించి అమలు చేస్తామని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
-
ఘనంగా పెద్దమ్మ గుడిలో బోనాల పండుగ
HYD: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో నేడు (శుక్రవారం) బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 4వ బోనం సమర్పించబడుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ నుంచి భక్తులు తరలిరానుండగా.. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
-
రైలు కిందపడి యువకుడి మృతి
HYD: ఘట్‌కేసర్, బీబీ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సాయి ప్రకాష్ అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. మహబూబాబాద్‌కి చెందిన శ్రీనివాస్ తనయుడైన సాయి ప్రకాష్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. సికింద్రాబాద్ జీఆర్పీ సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ ఆదేశాలతో కానిస్టేబుల్ పండరీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పండరీ తెలిపారు.
-
నేడు కాంగ్రెస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాలు
HYD : PCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన శుక్రవారం PCC రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC), PCC విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వీటికి ముఖ్యఅతిథిగా AICC అధ్యక్షుడు ఖర్గే హాజరుకానున్నారు. CM రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం తదితర అంశాలపై చర్చిస్తారు.
-
మేడ్చల్‌లో మహిళ అదృశ్యం
మేడ్చల్: పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన వడ్డె యాదమ్మ(35) జూన్ 12 నుంచి అదృశ్యమైంది. ఆమె భర్త యాదగిరి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మధ్య గొడవలు జరిగేవని.. గతంలో యాదమ్మ గొడవల తర్వాత ఇంటి నుంచి వెళ్లి 10-15 రోజులకు తిరిగి వచ్చేదని యాదగిరి చెప్పాడు. ఈ సారి తిరిగి రావకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
-
హోటళ్ల వల్ల ట్రాఫిక్ జామ్.. స్థానికుల ఆగ్రహం
HYD: నగరంలోని విజయనగర్ కాలనీలోని ప్రధాన రహదారిపై హోటళ్ల వల్ల ప్రతిరోజు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. హోటల్ యాజమాన్యాలు వాహనాలను రోడ్లపై ఇష్టారాజ్యంగా పార్కు చేయడంతో వాహనదారులు.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
-
నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ
HYD: సామాజిక న్యాయ సమర భేరి పేరిట TPCC తలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని LB స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న సభకు TPCC అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 40 వేలమంది పైగా నేతలు, కార్యకర్తలు సభకు హాజరు కానున్నారు. ముఖ్య అతిథిగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, CM రేవంత్, తదితర నేతలు మాట్లాడనున్నారు.