Locations: Hyderabad

  • రేపు రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరణ!

    TG: బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్. రామచందర్‌రావు శనివారం (జులై 5) బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం, రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

  • నేడు మాజీ సీఎం రోశయ్య విగ్రహావిష్కరణ

    TG: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహ ఏర్పాటు పనులు లక్డీకపూల్‌లో పూర్తయ్యాయి. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.50 లక్షల వ్యయంతో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

     

  • హరిహర వీరమల్లు రిలీజ్‌ను అడ్డుకుంటాం: బీసీ సంఘాలు

    TG: పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘హరిహర వీరమల్లు’కు పెద్ద షాక్ తగిలింది. ఈ సినిమాలో పవన్ పాత్ర తెలంగాణ పోరాటయోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రని.. కల్పిత కథగా మార్చేసి ఇష్టం వచ్చినట్లు తీశారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. సినిమా విడుదలను కచ్చితంగా అడ్డుకుంటామని ఓ ప్రకటన కూడా విడుదల చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది.

  • బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

    HYD: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

     

     

  • రేపు హైదరాబాద్‌కు రానున్న రాజ్‌నాథ్ సింగ్

    TG: రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.

  • ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి: మల్‌రెడ్డి

    TG: AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఇబ్రహింపట్నం MLA మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. రాష్ట్ర జనాభాలో సగం జనాభా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి ఇవ్వాలన్నారు. మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు తిరస్కరించినట్లు సమాచారం.

  • ‘బోనాల జాతరలో డీజేలకు అనుమతి లేదు’

    HYD: ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో గురువారం డీసీపీ కార్యాలయంలో డీసీపీ రష్మీ పెరుమాళ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా డీజేలకు అనుమతి లేదని, ఫలహరం బండ్లు ఊరేగించేవారు తమను సంప్రదిస్తే వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

  • ‘ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య’

    మేడ్చల్: గుండ్లపోచంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.46 లక్షలతో తరగతి గదులు, భోజనశాల, వేదిక షేడ్‌లు నిర్మించినట్లు ఐక్లిన్ కంపెనీ ఛైర్మన్ కాటమనేని గోపి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు కష్టపడి చదివి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కంపెనీ ఎండి ఓకేజిమ్, బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
  • ‘సామాజిక తెలంగాణ కోసం కృషి’

    మేడ్చల్: మేడ్చల్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నూతన కమిటీలు ఏర్పాటయ్యాయి. పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్‌ మాదిగ, జులై 7న ఎమ్మార్పీఎస్‌ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బహుజన యువత సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాలని కోరారు.
  • రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

    HYD: మతిస్థిమితం లేని ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌ రైల్వే పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చీర సాయి ప్రకాశ్‌ (22) బిటెక్‌ చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతడు మానసికంగా బాధపడుతున్నా డు. జీవితంపై విరక్తి చెంది, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.