Locations: Hyderabad

  • కమిషనర్‌కు ఫిర్యాదు

    మేడ్చల్: గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బీజేపీ నాయకుడు కృష్ణ గౌడ్ గురువారం మున్సిపల్ కమిషనర్ స్వామికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పరిధిలోని శుభం హోటల్‌పై అక్రమంగా షెడ్ నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షెడ్డు నిర్మాణం వల్ల వర్ష కాలంలో సామాన్య ప్రజలపై పడే అవకాశం ఉందని, వెంటనే షెడ్డు నిర్మాణాన్ని తొలగించాలని కోరారు.

  • ‘నా స్థలం కాపాడండి’

    మేడ్చల్: అలియాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని లాల్‌గడి మలక్‌పేటలోని సర్వే నెంబర్‌ 641లో సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మిస్తున్న భవన నిర్మాణాన్ని అడ్డుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ చంద్ర శేఖర్‌కు అలియాబాద్‌ గ్రామస్తుడు బి. శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రోడ్డు, నిర్మాణ స్థలం మధ్య తనకు చెందిన 80 గజాల స్థలం ఉందని, దానిని కాపాడాలని కోరారు.
  • ‘సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

    మేడ్చల్: మీర్‌పేట్ మండలంలోని లక్ష్మాపూర్ శివాలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంలో షామీర్‌పేట్ సీఐ శ్రీనాథ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు నేరస్తుల గుర్తింపులో కీలకమని తెలిపారు. దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ కమిటీ, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
  • గోవుల కళేబరాల వాహనంపై దాడి

    మేడ్చల్: మేడిపల్లి పీఎస్ పరిధిలోని నారపల్లి నందనవనం వద్ద గోవుల కళేబరాలను తరలిస్తున్న డీసీఎం వాహనం టైర్ పంక్చర్ కావడంతో ఆగింది. దుర్వాసనతో తనిఖీ చేసిన హిందూ సంఘం సభ్యులు కళేబరాలను గుర్తించి, వాహనం, డ్రైవర్‌పై దాడి చేశారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయిల్ తయారీ కోసం కళేబరాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసుల అనుమానం. ఈ ఘటనతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.
  • దుండిగల్‌లో బీఎల్ఓలకు ఓటర్ నమోదు శిక్షణ

    మేడ్చల్: దుండిగల్ మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో గండిమైసమ్మ మండలంలోని బీఎల్ఓలకు ఓటర్ నమోదు కార్యక్రమంపై శిక్షణ ఇవ్వబడింది. ఫారం 6, 6A, 7, 8, 8Aలను బీఎల్ఓ యాప్‌లో నమోదు, వెరిఫికేషన్ ప్రక్రియను వివరించారు. 18 ఏళ్లు నిండినవారందరికీ ఓటు నమోదు తప్పనిసరని తెలిపారు. ఈ కార్యక్రమం జులై 3 నుండి 17 వరకు జరుగుతుందని ERO నరసింహులు తెలిపారు.
  • హైదరాబాద్‌లో మొదలైన వర్షం

    TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. మాదాపూర్, పంజాగుట్ట, లక్డీకపూల్, మలక్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఖాజాగూడ, మణికొండ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం ఉద్ధృతంగా కురిసే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.

  • మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం

    TG: హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

  • ‘నేషనల్‌ ట్రైనింగ్‌ ఫ్రోగ్రామ్‌ను బీఎల్‌వోలు సద్వినియోగం చేసుకోవాలి’

    మేడ్చల్: బీఎల్‌వోలు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కీసర ఆర్‌డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపల్‌ పరిధిలో బీఎల్‌వోలకు వారం రోజుల నేషనల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆర్‌డీవో మాట్లాడుతూ.. ఓటరు జాబితా, ఓటు నమోదు వంటి అంశాలను సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తారన్నారు.

  • నల్లపోచమ్మ దేవాలయంలో ఘనంగా మండల పూజలు

    HYD: అత్తాపూర్‌ డివిజన్‌ హైదర్‌గూడ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం మండల పూజ మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. బాబు జగ్జీవన్‌రామ్‌ యూత్‌ అసోసియేషన్, ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన యంత్ర ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన చేసుకోని 41 రోజులు పూర్తయిన సందర్భంగా అమ్మవారి శిఖరానికి కుంబాభిషేకం, హోమం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

  • ‘అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి’

    HYD: అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత కాలంలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తీలో కొనసాగుతున్న కచ్చామోరీ (స్ట్రాం ) వాటర్ పనులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, అధికారులతో కలిసి పరిశీలించారు.