HYD: జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సప్తశతి పారాయణం, దేవతాహవనాలు, రుద్రాభిషేకం, దేవీ భాగవత పారాయణం, సాయంత్రం శ్రీ పెద్దమ్మతల్లి పల్లకీ సేవ తదితర పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి శాకంబరీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.
Locations: Hyderabad
-
రెస్టారెంట్ నిర్వాహకులకు గుడ్ న్యూస్
HYD: హోటల్స్, ఫుడ్ బిజినెస్ నిర్వాహకులకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 9న ఫుడ్ లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్ వ్యాపారులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో మేళా ఉంటుందన్నారు. వివరాలకు 7331189774 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
-
‘వైద్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు’
మేడ్చల్: అనారోగ్యంతో బాధపడే వారు వైద్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సకాలంలో మెరుగైన చికిత్స తీసుకోవాలని, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గంలోని 27 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.9.10లక్షల విలువైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది వైద్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నారు.
-
‘సమావేశాన్ని విజయవంతం చేయాలి’
మేడ్చల్: ఎల్బీ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని మాజీమంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం మూసాపేట్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో పార్టీ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
వీరమల్లు ట్రైలర్ రిలీజ్ వేడుకలో నేతలు
మేడ్చల్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ వేడుకలలో జనసేన కూకట్‌పల్లి ఇంఛార్జ్ ప్రేమ కుమార్ పాల్గొన్నారు. గురువారం బాలానగర్ విమల్ థియేటర్‌లో హరిహర వీరమల్లు ట్రైలర్‌ను ప్రదర్శించారు. కార్యక్రమమానికి ఆయనతో పాటుగా జనసేన నాయకులు భారీగా హాజరయ్యారు.
-
స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
మేడ్చల్: మల్కాజ్గిరి నియోజకవర్గంలో మూడు గుళ్ళ వద్ద, అంబేద్కర్ భవన్, దినకర్ నగర్, హరిజనా బస్తి, హిల్ టాప్ కాలనీలలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై బురద, మట్టి, చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేశారు. కార్యక్రమంలో AMOH మంజుల, SFAలు బాలమణి, గిరి, శ్రీశైలం, AE నవీన్, బీజేపీ నాయకులు నందు, మురళి, మాధవ్, జహంగీర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అధికారులతో కార్పొరేటర్ సమావేశం
మేడ్చల్: సైనికపూరి TGSPCDL డీఈ అన్వార్ పాషాతో శివపురిలో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సమావేశం నిర్వహించారు. 3 ఫేస్ లైన్ కన్వర్షన్, పాడైన పోల్స్ మరమ్మతు, 33Kv హైటెన్షన్ లైన్ షిఫ్టింగ్, చెట్ల కొమ్మల తొలగింపు, శానిటేషన్ సమస్యలపై చర్చించారు. అధికారులు నిధుల మంజూరుతో పనులు త్వరితంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. -
‘ఆయన నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం’
HYD: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావును గురువారం తార్నాకలోని ఆయన నివాసంలో బీజేపీ మహిళా నాయకురాలు ఉప్పల రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉప్పల రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. రామచంద్రుని నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో మోడీ రామరాజ్యం రాబోతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
-
లేట్ ఫీజు పేరిట దోపిడి..
HYD: ఫీజు కట్టడం లేట్ అయ్యిందని రూ. 3 వేలను కోటి వెళ్లే దారిలో బడిచౌడిలోని అవినాష్ కళాశాల పెనాల్టీ వసూలు చేసింది. దీంతో విసిగిపోయిన విద్యార్థి తండ్రి మీడియా ముందు తన గోడును వెల్లబోసుకున్నాడు. రెండురోజులు ఆలస్యమైందని పెనాల్టీగా రూ.3వేలు అధికంగా ఫీజు వసూలు చేశారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆలస్యం పేరిట ఈ అధిక ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
-
‘రేపటిలోగా DNA పరీక్షలు పూర్తి చేస్తాం’
TG: పాశమైలారం పేలుడు కేసులో DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 మంది మృతుల DNA గుర్తించారు. రేపటిలోగా DNA పరీక్షలు పూర్తి చేసి, మృత దేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమవారి మృత దేహాలను అప్పగించాలని బాధిత కుటుంబ సభ్యులు సిగాచి కంపెనీ ఎదుట ఆందోళన చేస్తున్నారు.