Locations: Hyderabad

  • అభివృద్ధి పనుల పరిశీలన

    మేడ్చల్: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాలతో కాప్రా డివిజన్ పరిధిలోని సాకేత్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను బైరి నవీన్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సాకేత్ కాలనీ అధ్యక్షులు జిఎస్.రావు, సెక్రటరీ సురేష్, జాయింట్ సెక్రెటరీ ఎం రవీందర్, కాప్రా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • ‘సమ్మెను విజయవంతం చేయాలి’

    HYD: జూలై 9 అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ, రాష్ట్ర నాయకుల పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జులై9న రైతు, కార్మిక వ్యతిరేక సార్వత్రిక సమ్మెను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర్‌ రావు అన్నారు. మోదీ అనుసరిస్తున్న మూడు నల్లచట్టాలను విధానాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి

    TG: KCR అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చ జరుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. KTR, హరీశ్ రావులతో సంబంధం లేదన్నారు. హరీశ్ రావు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదని, కేవలం MLA అని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న KCR అసెంబ్లీకి రావాలని.. వచ్చి ప్రభుత్వ తప్పు ఒప్పులను చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు.

  • ‘లేబర్ కోడ్స్ రద్దు చేయాలి’

    మేడ్చల్: మల్కాజిగిరి పీహెచ్‌సీలో సమ్మె నోటీసు ఇస్తూ.. పోస్టర్‌ను యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏ.హేమలత గురువారం విడుదల చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తుందని మండిపడ్డారు. కార్మిక వర్గం ఎన్నోత్యాగాలతో సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మికులకు హాని కలిగించే లేబర్ కోడ్స్ అమల్లోకి తెచ్చింది. వెంటనే లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

  • KCRకు చెప్పే ఫోన్ ట్యాపింగ్ చేశారు: మంత్రి కోమటిరెడ్డి

    TG: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది KTR, హరీశ్ రావులేనని ఆరోపించారు. KCRకు చెప్పే వారు ట్యాపింగ్‌కు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పదుల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్‌ ఫోన్ సైతం ట్యాప్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

  • ‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’

    హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం ఆర్‌కే పురం డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీలోని ఐరా గ్లోబల్‌స్కూల్ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా పచ్చదనం పెంపొందించడానికి చెట్లను నాటడం కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిలుక మధుర ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని.. పకృతివనం, పచ్చదనంపై చిన్నారులకు అవగాహన కల్పిస్తూ చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.

  • రామచంద్రరావుకు అభినందనలు

    మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావును గురువారం రామంతాపూర్‌కి చెందిన బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండారు వెంకట్ రావు, ముత్తినేని జగదీష్, నరసింహ, కామేశ్వరరావు, ఉలుగొండ నారాయణదాసు, వేముల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

  • సినిమా పైరసీ కేసు.. వెలుగులోకి నిందితుడు కిరణ్ బాగోతం!

    HYD: సినిమాలను పైరసీ చేసి అరెస్టయిన కిరణ్ కుమార్‌పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న కిరణ్‌.. 2019 నుంచి ఇప్పటి వరకు 65 సినిమాలను పైరసీ చేశాడు. వాటిని పలు సైట్లకు విక్రయించాడు. ఒక్కో సినిమాకు రూ.40వేల నుంచి రూ.80వేల వరకు చెల్లింపులు జరిగాయి. కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో కమీషన్‌ వచ్చేది. ఇటీవల #సింగిల్‌ సినిమానూ పైరసీ చేశాడు.

  • పెట్రోల్ బంక్ వద్ద కారులో మంటలు..

    రంగారెడ్డి: మైలర్‌దేవ్‌పల్లి పీఎస్ పక్కన భారత్ పెట్రోల్ బంక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. షాద్‌నగర్ నుంచి దిల్‌సుఖ్ నగర్ వెళ్తున్న సుదర్శన్ అనే వ్యక్తి క్విడ్ కారు పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న క్రమంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఈ విషయాన్ని గమనించిన పెట్రోల్ పంపు సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

  • ‘అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి’

    మేడ్చల్: అల్వాల్ పరిధిలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని యూఎస్ ఎఫ్ఐ డిమాండ్ చేసింది. దీంతో ఆ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేశ్ నాయకత్వంలో అల్వాల్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ..నిబంధనలు ఉల్లం ఘిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఖుషి, వినయ్, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.