HYD: తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కామ్ కార్డు ద్వారా 40 పెద్ద సినిమాలను కిరణ్ పైరసీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సినీ పరిశ్రమకు రూ.3700 కోట్ల నష్టం వచ్చింది. నిందితుడి పై 1957 కాపీ రైట్ యాక్ట్, ఐటీ యాక్ట్‌లతో పాటు పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.
Locations: Hyderabad
-
విషాదం… వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
హైదరాబాద్: మలక్‌పేట్ ఏరియాలో విషాద ఘటన కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నెమలిక అనే గర్భిణి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా రక్తం అవసరమైంది. అయితే ఆసుపత్రిలో అందుబాటులో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ఆమెను బ్లడ్ కోసం కోఠి మెటర్నిటి ఆసుపత్రికి బాలింతను తరలించిన సకాలంలో వైద్యం అందక మృతి చెందిన్నట్టు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు.
-
నేడు ఇండియన్ క్రిస్టియన్ డే ఉత్సవాలు
HYD: దేశవ్యాప్తంగా ఇండియన్ క్రిస్టియన్ డే ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. రెజిమెంటల్‌బజార్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ నేషనల్ అంబాసిడర్ శ్యామ్యూల్ దేవరాజ్ పెరుమాళ్, తెలుగు క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ డిప్యూటీ సెక్రటరీ పాద రారాజు అలెక్స్ తదితరులు మాట్లాడారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
-
‘సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి’
HYD: రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా ఈ సమ్మేళనంలో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సన్నహకంగా సమావేశం నిర్వహించారు. మల్లికార్జున ఖర్గే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని అనిల్ యాదవ్ అన్నారు.
-
నేరాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన
HYD: నేరాల నియంత్రణపై న్యూబోయిన్‌పల్లి బాపూజీనగర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ప్రిన్సిపల్ లాలూనాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల పలు అనర్థాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ తిరుపతిరాజు తదితరులు మాట్లాడారు.
-
అదనపు కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్ కమిషనర్
మేడ్చల్: తూంకుంట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎంఎన్ఆర్ జ్యోతి గురువారం మేడ్చల్ అదనపు కలెక్టర్‌లను కలిశారు. తూంకుంట మున్సిపల్ అంతాయిపల్లిలో గల జిల్లా సమీకృత కార్యాలయంలో అదనపు కలెక్టర్‌లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.
-
సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న నిపుణుల కమిటీ
TG: పాశమైలారం పేలుడు ఘటనపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకుంది. కార్మికుల భద్రత కోసం యాజమాన్యం సరైన చర్యలు తీసుకుందా? లేదా? అన్న అంశంపై కమిటీ విచారణ చేసింది. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
-
పాండురంగ విఠలేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు
HYD: సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌లోని పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాల నిర్వహణఖు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అల్లాడి గౌరీశంకర్, ఈవో సత్యనారాయణ తెలిపారు. ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి వారు మాట్లాడారు. అనంతరం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను కలిసిన వారు బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు.
-
అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణ
HYD: రహమత్ నగర్ డివిజన్‌లో అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మత్తు, ఆధునికీకరణ కోసం రూ. 17.5లక్షల ఎస్టిమేట్‌ను కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహమత్ నగర్ డివిజన్‌లోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణ కోసం ఈ ఎస్టిమేట్ సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. -
బాలానగర్ ‘విమల్’ వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి
మేడ్చల్: బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదల సందర్భంగా ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. అభిమానులు థియేటర్‌కు పోటెత్తడంతో పోలీసులకు నియంత్రణ సవాల్‌గా మారింది.