Locations: Hyderabad

  • బీజేపీ నాయకుల సన్మానం

    మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావుని మేడ్చల్ బీజేపీ నాయకులు కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన అధ్యక్షుడికి మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు, ఎల్లంపేట్ మాజీ సర్పంచ్ జగన్‌గౌడ్ ఎల్లంపేట్ గ్రామంలోని మరకత శివలింగం ప్రతిమను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సప్ల బీజేపీ అద్యక్షులు శ్రీశైలం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
  • విమల్ థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ సందడి

    హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌ వద్ద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. పవన్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌ను ఆ థియేటర్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే థియేటర్ వద్దకు ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. దీంతో బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియిర్ చేశారు.

  • పేలిన రిఫ్రిజిరేటర్‌.. సామాగ్రి దగ్ధం

    HYD: సనత్‌నగర్‌ రాజరాజేశ్వరి నగర్‌లోని ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్రిజ్‌ పేలుడుతో మంటలు చెలరేగి ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

    .

  • 34 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

    HYD: భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ నుంచి హైదరాబాద్​కు రూ. 17 లక్షల విలువైన 34 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని డీటీఎఫ్​ పోలీసులు పట్టుకున్నారు. బీహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన రమేశ్​ కుమార్‌‌‌‌‌‌‌‌, చందన్‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ మూడు బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను తీసుకొని భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్​లో హైదరాబాద్​ వచ్చారు. జేబీఎస్‌‌‌‌‌‌‌‌‌కు చేరుకొని అక్కడ గుర్తుతెలియని వ్యక్తికి ఇచ్చేందుకు వేచి చేస్తున్నారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ డీటీఎప్‌‌‌‌‌‌‌‌ సీఐ సావిత్రి,సిబ్బంది కలిసి నిందితులను పట్టుకున్నారు.
  • హైదరాబాద్‌లో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం..

    HYD: నైజీరియన్ నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెంబడించి, శైక్‌పేట్ అపార్ట్‌మెంట్‌లో ఆసిఫ్‌నగర్‌లో ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫ్లాట్‌లో సోదాలు నిర్వహించి, భారీ మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ద్రవ్యాలను టెస్టింగ్‌కు పంపగా.. లోతైన దర్యాప్తు జరుగుతోంది. మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.

  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు

    HYD: హైదరాబాద్‌లో బంగారం ధరలు మూడో రోజూ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 440 పెరిగి రూ.99,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 400 పెరిగి రూ.91,050కు పలుకుతుంది. కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,21,000గా ఉంది. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

  • నేడు హైదరాబాద్‌కు మల్లికార్జున ఖర్గే

    TG: ఇవాళ హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రానున్నారు. ఆయనకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ వీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆహ్వానం పలకనున్నారు. రాత్రి హోటల్ తాజ్‌కృష్ణలో ఖర్గే బస చేస్తారు.  రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న పలు కార్యక్రమాల్లో ఖర్గే పాల్గొననున్నారు.

  • ‘సంస్కృతి, జీవన విధానంపై పరిశోధనలు జరగాలి ‘

    HYD: తెలంగాణ సంస్కృతి, జీవనవిధానంపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పరిశోధనల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తమ శాఖ ద్వారా రూ.కోటి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘ఆర్ట్స్ అండ్​ సోషల్ సైన్సెస్​లో విభిన్న అంశాల సంవాదం, సంభాషణ’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.

  • కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం

    HYD: బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి రథోత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది. కళ్యాణం తర్వాత జరిగిన ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అలంకరించిన రథంలో ఎల్లమ్మ తల్లి, జమదగ్ని మహార్షి పురవీధుల్లో ఊరేగగా, వివిధ వేషధారణలు, శివసత్తులు, ఒగ్గు, గుస్సాడి కళాకారులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రథోత్సవాన్ని మిస్ అయినవారి కోసం స్పెషల్ వీడియో అందుబాటులో ఉన్నాయి.

  • ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

    మేడ్చల్: భద్రాచలం రామావరంలో డ్రైవర్‌గా పనిచేసే ప్రేమ్ కుమార్ (25) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.