HYD: బహదూర్‌పురా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద జూన్ 29, 2025న ఫ్యాషన్ డిజైనర్ ఇస్మాయిల్(38)ను అతని స్నేహితుడు మొహ్సిన్ (24) హత్య చేశాడు. మద్యం సేవిస్తూ గత గొడవలకు ప్రతీకారంగా మొహ్సిన్, ఇస్మాయిల్‌ను నికెల్ పంచ్, కట్టెలతో దాడి చేసి హతమార్చాడు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో జరిగిన ఈ హత్యను పోలీసులు 48 గంటల్లో చేధించి, నిందితుడిని అరెస్టు చేశారు.
Locations: Hyderabad
-
అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు
TG: ఫార్ములా-ఈ రేస్ కేసులో దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా సినీయర్ IAS అధికారి అర్వింద్ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అర్వింద్ కుమార్ విదేశాల్లో ఉన్నందున దర్యాప్తు వాయిదా పడింది. తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకు పిలిచారు.
-
హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై కేంద్రం నిర్లక్ష్యం: విజయశాంతి
TG: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై కేంద్రం నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఎక్స్‌లో తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనే కారణంతోనే కేంద్రం మెట్రో విస్తరణను ఆలస్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పదేపదే విన్నవించినా ఫలితం లేదన్నారు. జీహెచ్ఎంసీలో BJP కార్పొరేటర్లు మెట్రో విస్తరణకు చొరవ చూపాలని విజయశాంతి కోరారు.
-
సీఎం రేవంత్ రెడ్డితో TJS నేతల భేటీ
TG: TJS నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రజా సమస్యలు, రాష్ట్రంలో తాజా రాజకీయాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను TJS నేతలు సీఎం దృష్టికి తెచ్చారు. ప్రజా సమస్యల విషయంలో జనసమితి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో TJS పార్టీ అధ్యక్షుడు, MLC కోదండరాం సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
-
జైలు జీవితం పగవాళ్లకు కూడా వద్దు: కవిత
TG: తన జైలు జీవితాన్ని MLC కవిత గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జైళ్లో చాలా బాధను అనుభవించినట్లు తెలిపారు. జైలు జీవితం పగ వాళ్లకు కూడా రాకూడదన్నారు. ‘‘ నన్ను అరెస్ట్ చేస్తారని నా తండ్రి KCR జనవరిలోనే చెప్పారు. దాంతో పదవికి రాజీనామా చేయాలా? అని నేను అడిగితే అవసరం లేదన్నారు. నా తప్పేమీ లేదని లీగల్‌గా కొట్లాడదామని ధైర్యం చెప్పారు’’ అని కవిత వివరించారు.
-
సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
HYD: కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రాకు చెందిన కిరణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో విడదలైన సినిమాలను మొదటి రోజే పైరసీ చేశాడు. అలా ఇప్పటి వరకు65 సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
-
నార్సింగిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
HYD: నార్సింగిలో రూ.1.5 కోట్ల విలువైన 650 గ్రాముల హెరాయిన్‌ను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఓ వ్యక్తిని బ్యాగ్‌తో అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు తరలించిన గోధుమ రంగు హెరాయిన్‌ను గుర్తించారు. నిందితుడు హెరాయిన్ వినియోగిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సంధ్య థియేటర్‌లో HHVM ట్రైలర్ స్క్రీనింగ్ రద్దు
పవన్ కల్యాణ్ మూవీ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ స్క్రీనింగ్‌ను సంధ్య థియేటర్ యాజమాన్యం రద్దు చేసింది. ట్రైలర్ ప్రత్యేక స్క్రీనింగ్‌కు సంబంధించి పాస్‌లను థియేటర్ యాజమాన్యం ఈ రోజు అందజేసింది. భారీగా మెగా అభిమానులు రావడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని నియంత్రించాల్సి వచ్చింది. అది చూసి.. ‘‘పాస్‌ల కోసమే ఇలా ఉంటే.. రేపు ఎలా ఉంటుందో’’ అని భయంతో స్క్రీనింగ్‌ను రద్దు చేసింది.
-
పాశమైలారం ఘటనపై సిగాచి యాజమాన్యం స్పందన
TG: పాశమైలారం ప్రమాదంపై సిగాచి యాజమాన్యం స్పందించింది. ప్రమాదానికి బాయిలర్ పేలుడు కారణం కాదని తెలిపింది. పరిశ్రమలో పరికరాలు కాలం చెల్లినవి అనడంలో అర్థం లేదని, ఎక్విప్మెంట్ మొత్తం అధునాతనమైనదని సిగాచి కంపెనీ ప్రతినిధి అమిత్ రాజ్ సింహ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో 90 మంది కార్మికులు లోపల ఉన్నట్లు వివరించారు. ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, క్షతగాత్రులకు వైద్యం అందుతోందన్నారు.
-
రామ చంద్రరావును కలిసిన నేతలు
మేడ్చల్: నూతనంగా ఎన్నుకోబడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భరత సింహారెడ్డి, సీనియర్ నాయకులు బొక్క ప్రభాకర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.