Locations: Hyderabad

  • ఉజ్జయిని టెంపుల్‌లో చీరల తయారీ

    HYD: సికింద్రాబాద్ మహంకాళి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో మగ్గంపై చీరల తయారీని ప్రారంభించారు. జులై 13న జాతరలో అమ్మవారికి పోచంపల్లి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • పాశమైలారం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

    HYD: పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి మదీనాగూడలోని ప్రణమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో పాటుగా పలువురు కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

  • బస్తీ వాసులకు ఎమ్మెల్యే హామీ

    రంగారెడ్డి: బైరామల్‌గూడ చెరువు ప్రక్కన నివసిస్తున్న పలువురు బస్తీవాసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కలిశారు. 30-40 ఏళ్లుగా అక్కడ నివాసముంటున్న తమ ఇళ్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వారు తెలిపారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బాక్స్ డ్రైన్స్ నిర్మాణం ఇప్పటికే జరిగిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ఒక్క ఇల్లూ తొలగించకుండా అధికారులతో మాట్లాడి నష్టం రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
  • బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

    మేడ్చల్: రామంతపూర్ డివిజన్‌లో అభివృద్ధి పనుల్లో భాగంగా ఏడిఆర్‌యం హాస్పిటల్ నుంచి కార్డినల్ గ్రేసెస్ స్కూల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.3కోట్లతో శంకుస్థాపన జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బస్తీ పెద్దలు బాలరాజు, కాపర్తి మోహన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
  • నగరంలో వాహనాల కాలుష్యం

    HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో లక్షలాది కాలం చెల్లిన వాహనాలు కాలుష్య కారకాలతో రహదారులపై సంచరిస్తూ ప్రజారోగ్యాన్ని హాని చేస్తున్నాయి. 15 ఏళ్ల కాలపరిమితి దాటిన వాహనాలపై అమలులో ఉన్న స్వచ్ఛంద తుక్కు విధానం (వెహికల్ స్క్రాపింగ్ పాలసీ) విఫలమవుతోంది. ఈ వాహనాలు వాతావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయని, వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
  • డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

    మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ డివిజన్‌లోని భవానినగర్ కమాన్ వద్ద డ్రైనేజీ అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.90 లక్షల నిధులతో ఈ పనులు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని లక్ష్మారెడ్డి, నీటి నిల్వ సమస్య తీరుతుందని శిరీష తెలిపారు.

  • బీబీ కా అలవాను సందర్శించిన బిజేపి నాయకురాలు

    HYD: బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవి లతా మొహర్రం సందర్భంగా పాతబస్తీ డబీర్‌పురాలోని బీబీ కా అలవాను సందర్శించారు. సందర్భంగా ఆమె స్థానిక షియా సమాజ నాయకులతో సమావేశమై, మొహర్రం ఆచారాల గురించి తెలుసుకున్నారు. బీబీ కా అలవా వద్ద జరిగే ఆశురా ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సమాజ ప్రముఖులు పాల్గొన్నారు.

     

  • 12% GST శ్లాబ్ ఎత్తివేత..?

    HYD: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 12% GST శ్లాబ్ ఎత్తివేసే అవకాశముంది. చాలా వస్తువులను 5శాతం శ్లాబ్‌లోకి తీసుకొస్తారని సమాచారం. టూత్ పేస్ట్, గొడుగులు, కిచెన్ సామగ్రి, కుట్టు మెషిన్లు,సైకిళ్లు, రూ.వెయ్యిపైన ఉండే రెడీమేడ్ దుస్తులు, రూ.500-రూ. వెయ్యి మధ్య ఉండే చెప్పులు, స్టేషనరీ, అగ్రికల్చర్ టూల్స్, వ్యాకిన్స్‌పై ధరలు తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

     

     

  • ‘డాక్టర్లు అందరూ నెలరోజులు అలా చేయాలి’

    TG: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఏఐజీ ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం హెల్త్‌ టూరిజం హబ్‌గా మారింది. దేశంలో తయారయ్యే బల్క్‌డ్రగ్‌లో 35శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతోంది. జినోమ్‌ వ్యాలీ హైదరాబాద్‌కు చాలా కీలకం.  సామాజిక బాధ్యతగా.. ఏడాదిలో ఒక్క నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

  • రియల్ ఎస్టేట్ యజమాని మోసం

    మేడ్చల్: పోచారం మున్సిపాలిటీ కోర్రేముల ఏకశిల నగర్‌లో విగ్నేశ్వర రియల్ ఎస్టేట్ యజమాని నీలి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండకు చెందిన కడియం వినోద్ కుమార్‌ను మోసం చేశాడని ఆరోపణ. వివాదాస్పద సర్వే నెం.744లోని ప్లాట్ నెం.1358ను రూ.30.5 లక్షలకు అమ్మేందుకు రూ.7.62లక్షల అడ్వాన్స్ తీసుకున్నాడు. కాంపౌండ్ కూల్చివేతపై అడిగినప్పుడు కులంపేరిట దూషించి, వినోద్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు.పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.