Locations: Hyderabad

  • మిఠాయి భండార్‌లో అగ్నిప్రమాదం

    మేడ్చల్: ఓల్డ్ సఫిల్‌గూడలోని గణేష్ మిఠాయి భండార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు వ్యాపించి దుకాణం పూర్తిగా దగ్ధమై, సుమారు రూ.15లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. దుకాణం మూసివుండటంతో ప్రాణనష్టం తప్పింది. నేరేడ్‌మేట్ పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసి, పక్క దుకాణాలకు వ్యాపించకుండా అరికట్టారు. పోలీసులు కేసు నమోదుచేసి విద్యుత్ లోపాలపై దర్యాప్తు చేపట్టారు.
  • చీకట్లు అలుముకుంటున్న నగర శివార్లు

     HYD: చినుకు పడితే చాలు నగర శివార్లలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్తు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.  కొన్నిసార్లు ఆయా ప్రాంతవాసులు రాత్రిళ్లూ జాగారం చేయడమే దిక్కవుతోంది.   క్షేత్రస్థాయి సిబ్బంది సరిపడా లేకపోవడం ఉన్నా స్తంభాలు ఎక్కేందుకు ముందుకురాకపోవడం, ఒక్కో ఫీడర్‌ కిలోమీటర్ల పొడవు ఉండటంతో సమస్య ఎక్కడ తలెత్తిందో గుర్తించడంలో జాప్యం జరుగుతోంది.

     

  • ఇక రోడ్లపై విద్యుత్ తీగలు, స్తంభాలు కనిపించవు!

     దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నగరాల్లో భూగర్భ విద్యుత్తు వ్యవస్థలను రూపొందించారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూగర్భ విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భూగర్భ విద్యుత్తు వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.   నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో మొత్తంగా 12 కి.మీల భూగర్భ విద్యుత్తు వ్యవస్థలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

  • నూతన కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

    మేడ్చల్: తూంకుంట పురపాలక సంఘం నూతన కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతికి మున్సిపాలిటీ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ‘మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి’

    మేడ్చల్: మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని అందిస్తుందని కాప్రా తహసీల్దార్ సుచరిత అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్, దమరపల్లి నర్సింహరెడ్డిలు మొక్క అందజేశారు. పర్యావరణ కాలుష్యం అనర్థాలకు దారితీస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

  • ‘సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి’

    మేడ్చల్: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చర్లపల్లిలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను అమలు చేస్తోందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 20 సమ్మెను జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో జూలై 9కి వాయిదా వేసినట్లు తెలిపారు.

  • నాలా స్లాబ్ నిర్మాణం.. కాలనీ వాసుల ఆందోళన

    మేడ్చల్: మల్కాజిగిరి డివిజన్‌ సర్దార్ పటేల్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 2లో నాలా స్లాబ్ తొలగించి 40 ఫీట్ల వెడల్పుతో కొత్త స్లాబ్ నిర్మిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగి స్ట్రీట్ నెంబర్ 1, 2, 3లోని 100-150 ఇళ్లలోకి మురుగునీరు చేరే ప్రమాదం ఉంది.గతంలో కార్పొరేటర్ జగదీష్ గౌడ్ సమస్యను పరిష్కరించగా.. ప్రస్తుత కార్పొరేటర్ శ్రవణ్ చేపట్టిన నిర్మాణం కాలనీ వాసులకు నష్టం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

  • పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ

    మేడ్చల్: జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ముందుకొస్తున్నాయి. వారి పిల్లల స్కూల్ ఫీజులో రాయితీ ఇచ్చేందుకు అంగీకరించాయి. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యూజేఎఫ్) మల్కాజ్‌గిరి కమిటీ విద్యా సంస్థల నిర్వాహకులతో సమావేశమై రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం 50% ఫీజు రాయితీ అమలు చేయాలని కోరింది. స్కూళ్లు సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చాయి.
  • 11 మంది ఆచూకీ దొరకాలి: మంత్రి

    TG: పాశమైలారంలోని రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మరణించారని.. ఇంకా 11 మంది ఆచూకీ దొరకడం లేదని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పేలుడు సంభవించిన స్థలాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువ అని పేర్కొన్నారు. 18 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

  • ఇన్‌స్పెక్టర్ తీరుతో ఇబ్బంది

    HYD: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మేడ్చల్‌ జోన్‌లోని ఓ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ కింది స్థాయి సిబ్బందిని కించపరిచేలా మాట్లాడుతూ.. మానసిక వేదనకు గురిచేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానిస్టేబుళ్లను అవమానకరంగా మాట్లాడటంతో కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లారని,ఒకరు సూసైడ్‌ ఆలోచన చేసినట్లు సమాచారం. అవినీతి ఆరోపణలతో పాటు, అధికార పార్టీ అండతో ఫిర్యాదులు అడ్డుకుంటున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇలానే వ్యవహరిస్తే నిరసనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.