HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బీహార్ వెళ్లేందుకు కుటుంబసభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చిన మైనర్ బాలిక.. వాటర్ బాటిల్ కొనుగోలు చేసేందుకు వెళ్లింది. ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Locations: Hyderabad
-
హైదరాబాద్‌లో రెండు గంటలు వర్షం పడితే ఇలా
ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు గంటల పాటు వర్షం పడితే ఒక మీటరు ఎత్తున నీరు చెరువుల్లో చేరుతోందని, అంతే మొత్తం వాటర్ బయటకు వెళ్లాలంటే వారం రోజులు పడుతోందని హైడ్రా తేల్చింది. వరద కాలువలు ఎక్కడైనా కుంచించుకుపోయినా, పూడుకుపోయినా ఆ సమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని హైడ్రా పేర్కొంది. సికింద్రాబాద్ ప్యాట్నీ, చికోటీ గార్డెన్స్, చింతలబస్తీల మీదుగా సాగే వరద కాలువలను విస్తరిస్తున్నామని వివరించింది.
-
పెరుగుతున్న వరకట్న వేధింపు కేసులు
TG: రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వరకట్న వేధింపు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్నకట వేధింపుల కారణంగా కొందరు కన్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కుమార్తె నుంచి ఫోన్ వస్తే వారు ఉలిక్కిపడుతున్నారని పోలీసు అధికారి చెప్పారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. అయితే, ఉన్నత విద్యావంతులు, ఆర్థికంగా లోటులేని వారి నుంచే వరకట్న వేధింపుల ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసు అధికారులు చెప్పటం గమనార్హం.
-
గోల్కొండ అమ్మవారి హుండీ ఆదాయం ఏంతంటే?
HYD: గోల్కొండ జగదాంబిక మహంకాళి దేవాలయంలో హుండీ లెక్కింపు చేపట్టగా.. ఆషాఢమాస బోనాల మొదటి, రెండు పూజలకు రూ.3,29,262 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO వసంత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చంటి బాబు, అధికారులు నరేశ్, నర్సింగ్ రావు, చంద్రశేఖర్, శంకర్, వృత్తి పనివారి సంఘం అధ్యక్షుడు తంగడపల్లి శివశంకర్, రవి తదితరులు పాల్గొన్నారు.
-
మూడు నెలల సన్న బియ్యం పంపిణీ పూర్తి
HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు నెలల సన్న బియ్యం పంపిణీ పూర్తయినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. నగరంలో 6,47,282 రేషన్ కార్డులకు 4,732 టన్నులు, మేడ్చల్‌లో 4,024 టన్నులు, రంగారెడ్డిలో 4,078 టన్నుల బియ్యం పంపిణీ చేశారు. మొదట్లో సాంకేతిక సమస్యలతో బయోమెట్రిక్ తీసుకోవడానికి 15-25 నిమిషాలు పట్టింది. కొన్నిచోట్ల రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
-
మొదలైన వర్షాలు.. నగరంలో మాన్ సూన్’ టీమ్స్ రెడీ
HYD: నగరంలో వర్షాకాలం కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా హైడ్రా 4100 మంది సిబ్బందితో సిద్ధమైంది. 150 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, 51 డీఆర్ఎఫ్ బృందాలు, 21 ఎమర్జెన్సీ బైక్ టీమ్‌లు, 30 మార్షల్స్‌తో నీటి నిల్వ, చెట్ల పడటం, చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నారు. నీటి పంపులు, కటింగ్ మెషిన్లు, వాహనాలు సిద్ధం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ 24 గంటల అప్రమత్తత, నాలాల పరిశీలనకు ఆదేశించారు.
-
గోడ దూకేందుకు యత్నం.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్
HYD: గోల్కొండ రాణా పరిధి షేక్‌పేట్ సత్యా కాలనీలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థి సయ్యద్ అయాన్ (చాంద్రాయణగుట్ట) హాస్టల్ గోడ దూకి బయటకు వెళ్లేందుకు యత్నించాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలి 30% కాలిన గాయాలతో తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాల యాజమాన్యం అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
మేడ్చల్: చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ లైన్ మరమ్మతుల కారణంగా బుధవారం ఉప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఎం.నిఖిల్ తెలిపారు. ఘట్‌కేసర్ ఫీడర్ పరిధిలో అన్నపూర్ణ కాలనీ, బీరప్పగడ్డ, భరత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, చిల్కానగర్ ఫీడర్‌లో గణేష్‌నగర్, సెవెన్‌హిల్స్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కరెంటు ఉండదని తెలిపారు.
-
నొప్పి నివారణ కేంద్రానికి శంకుస్థాపన
HYD: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో నొప్పి నివారణ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. పూర్వ విద్యార్థులు రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలు అందించగా.. మరో రూ.50 లక్షల పరికరాలు త్వరలో వస్తాయి. క్యాన్సర్, నరాలు, స్పాండిలైటిస్ వంటి దీర్ఘకాలిక నొప్పులకు చికిత్స అందిస్తారు. వారంలో మూడు రోజులు ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ఫిజియోథెరపీ నిపుణులు అందుబాటులో ఉంటారు. ఆరోగ్యశ్రీలో చికిత్సలు చేర్చాలని అధికారులకు వినతి.
-
KPHBలో యువతి అదృశ్యం
మేడ్చల్: కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో 20 ఏళ్ల యువతి సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుంది. ఇంటి విధులకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరి వెళ్లింది.. కానీ డ్యూటీకి హాజరు కాలేదు. ఆమె తల్లి ఆరా తీయగా..యువతి దుకాణం నుంచి రూ.5వేలు అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలిసింది. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.