Locations: Hyderabad

  • ఆకట్టుకున్న సృజనాత్మక చిత్రాలు

    HYD: మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు తరలివచ్చారు. వేదిక ప్రాంగణంలో పలువురు గురువులు రూపొందించిన సృజనాత్మక చిత్రాలు అకట్టుకున్నాయి.

  • HYDలో అంబరాన్నంటిన నిమజ్జనోత్సవాలు

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు అంబరాన్నంటాయి. ట్యాంక్‌బండ్‌పై భారీగా గణనాథులు చేరుకుంటుండటంతో హుస్సేన్ సాగర్ పరిసరాలు సందడిగా మారాయి. నిమజ్జన ఉత్సవాలను తిలకించడానికి నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీంతో నగరంలో ఎటుచూసినా పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది పటిష్టమైన ఏర్పాట్లతో భక్తులు, ప్రజలు నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా వీక్షిస్తున్నారు.

  • వైభవంగా ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

    గణేశ్‌ ఉత్సవాలకు ముగింపు పలుకుతూ HYDలో నిమజ్జనోత్సవం ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా భక్తుల కోలాహలం, డప్పుల మోత, ప్రత్యేక నృత్యాల మధ్య   ఖైరతాబాద్ మహా గణపతి భారీ శోభాయాత్ర  వైభవంగా సాగుతోంది. నిమజ్జనంలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో నాలుగో నంబరు స్టాండులో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు.

     

     

  • బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు వరుస ఆటంకాలు.. ఒరిగిన వాహనం

    HYD: ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఊరేగింపులో వరుస ఆటంకాలు  ఏర్పడుతున్నాయి. మండపం నుంచి బయలుదేరిన గణేష్ వాహనం ఒక్కసారిగా ఒకవైపు ఒరిగిపోవడంతో ఇరుకైన వీధుల్లో ముందుకు కదలడం కష్టంగా మారింది. రోడ్డుపై ఉన్న మెట్లు, ర్యాంపులను తొలగించేందుకు సిబ్బంది గంటపాటు తీవ్రంగా శ్రమించారు. ఈసమస్యను అధిగమించి వాహనాన్ని ముందుకు కదిలించగలిగారు. మొదటిసారి రేకులషెడ్డు అడ్డువచ్చి ఆటంకం కలుగగా..శోభాయాత్ర ఇప్పుడు నెమ్మదిగా కొనసాగుతోంది.

  • వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించిన గణపయ్య

    HYD : ఈ ఏడాది గణపయ్య.. వ్యాపారులకు కోట్ల వర్షం కురిపించారు. చిన్న, పెద్ద వ్యాపారాలకు ఈ గణపతి ఉత్సవాల వల్ల భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అయితే నగరంలోని ధూల్‌పేటలో సుమారుగా రూ.50 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. వినాయకుడి తయారీకి కావాల్సిన వస్తువుల నుంచి నిమజ్జనం వరకు అన్నింటి వరకు రూ.650 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం.

  • బాలాపూర్ లడ్డూ వేలంలో 38 మంది

    HYD: బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటలో ఈసారి 38 మంది సభ్యులు పాల్గొననున్నారు. గతంలో లడ్డూను దక్కించుకున్న 31 మందితో పాటు మరో ఏడుగురు ఈ వేలంలో చేరారు. వేలంలో పాల్గొనే ప్రతి సభ్యుడు రూ.30,01,000తో పాటు రూ.5,000 నాన్ రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేలంపాటలో లడ్డూను దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

     

  • ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర డ్రోన్ వీడియో

    HYD: ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్ల మధ్య గణనాథుడిని గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు. భక్తులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గణేశ్ విగ్రహం తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు చేరుకోనుంది.

  • ఫోన్‌లో బ్యాలెన్స్‌ లేదన్నందుకు దాడి.. చివరకు!

    HYD: బంజారాహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌ ఇవ్వనందుకు వాచ్‌మన్‌ వెంకటయ్యపై శ్రీధర్‌(30) చేయి చేసుకున్నాడు. దీంతో వెంకటయ్య తన కుమారులు హరికృష్ణ, తరుణ్‌లను పిలిచి శ్రీధర్‌ను తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఇంటికి వచ్చిన శ్రీధర్ స్పృహ కోల్పోయి మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు  ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

  • ఖైరతాబాద్ గణేషుడి లడ్డూను ఎందుకు వేలం వేయరంటే?

    HYD: ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కొన్ని సంప్రదాయాలను పాటిస్తుంది. అందులో లడ్డూను వేలం వేయకూడదనే నియమం కూడా ఉంది. ఇక్కడ లడ్డూను ప్రసాదంగా భావిస్తారు. దానిని వ్యాపార వస్తువుగా పరిగణించకుండా అందరికీ పంచిపెట్టడం ద్వారా దాని పవిత్రతను కాపాడాలని భావిస్తారు. లడ్డూ కోసం వేలంపాట పెట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కమిటీ భావిస్తుంది. ఎందుకంటే లడ్డూను ప్రసాదంగా స్వీకరించాలని భక్తులు కోరుకుంటారు.

  • బాలాపూర్ గణేశుడి ఊరేగింపులో ఆటంకం

    బాలాపూర్ గణేశుడి ఊరేగింపులో ఆటంకం ఎదురైంది.  రేకుల షెడ్డు అడ్డు రావడంతో  గణేశుడి ఊరేగింపు వాహనం వీధిలో 30 నిమిషాల పాటు ఇరుక్కుపోయింది. దీంతో అడ్డుగా ఉన్న రేకుల షెడ్డుని   సిబ్బంది తొలగించారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొంచెం ఆలస్యమయ్యే అవకాశముంది. కాగా, గతేడాది రూ. 30,01,000 పలికి బాలాపూర్ లడ్డూ ఈ సారి ఏ రికార్డు సృష్టిస్తుందోనన్న ఉత్కంఠ భక్తులో నెలకొంది.