HYD: ఆషాఢ బోనాల సంబరాల్లో జేబు దొంగలు, ఆకతాయిలు భక్తులను ఇబ్బంది పెడుతున్నారు. బల్కంపేట, గోల్కొండ, మహంకాళి ఆలయాల్లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తూ.. మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. నగర సీపీ ఆదేశాలతో పోలీసులు మఫ్టీ బృందాలతో జేబు దొంగలు, ఆకతాయిలను పట్టించేందుకు అప్రమత్తమయ్యారు. మహిళా భద్రత కోసం 14 షీటీమ్ బృందాలు పనిచేస్తున్నాయి.
Locations: Hyderabad
-
శివరాంపల్లిలో 23.5 మి.మీ. వర్షం
HYD: నగరంలో మంగళవారం ద్రోణి ప్రభావంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసింది. శివరాంపల్లిలో 23.5 మి.మీ., రాజేంద్రనగర్‌లో 19.8, బహదూర్‌పురలో 19.5, లంగర్‌హౌస్‌లో 17.0 మి.మీ. వర్షం నమోదైంది. బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
-
3 జిల్లాల్లో 100 శాతానికిపైగా ‘రేషన్ పోర్టబిలిటీ’
TG: జూన్ నెల బియ్యం పంపిణీలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ పోర్టబిలిటీ 104-116శాతం నమోదైంది. ఆయా జిల్లాల్లో ఉన్న రేషన్‌కార్డుల సంఖ్యతో పోలిస్తే ఎక్కువమంది లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో అత్యధిక రేషన్ పోర్టబిలిటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 116.52శాతంగా నమోదైంది. మూడు నెలలకు కలిపి రేషన్ సరఫరా నేపథ్యంలో జూన్‌లో రికార్డు స్థాయిలో బియ్యం పంపిణీ జరిగింది.
-
నేడు బల్కంపేటలో ధూంధాం
HYD: నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడిలో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం కనుల పండువగా జరిగింది.నేడు ఎల్లమ్మ తల్లికి లక్షలాది భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయ పరిసరాల్లో ఘటాల ఊరేగింపు జరుగనుంది.
-
బంగారం గొలుసు చోరీ చేసిన దుండగులు
మేడ్చల్: మేడిపల్లి పీఎస్ పరిధిలోని పీర్జాదిగూడ గాయత్రి నగర్‌లో చందన అనే మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దోచుకున్నారు. గాయత్రి నగర్ నుంచి కృష్ణ సాయి నగర్‌లోని సాయిబాబా గుడికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఎఫ్‌జెడ్ బైక్‌పై వచ్చిన దుండగులు గొలుసును స్నాచ్ చేసి పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
-
నేడు ‘మంత్రులతో ముఖాముఖి’కి వాకిటి
TG : గాంధీభవన్‌లో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. సమస్యలపై ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వినతులను మంత్రి స్వీకరించనున్నారు.
-
జూనియర్ అడ్వకేట్ ఆత్మహత్య
మేడ్చల్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని విజయపురి కాలనీలో జూనియర్ అడ్వకేట్ కల్లూరి సాయినాథ్(30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన సాయినాథ్, రంగారెడ్డి కోర్టులో పనిచేస్తూ సూర్యనగర్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. స్నేహితుల అద్దె గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
-
వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు!
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో రాష్ట్రంలో వచ్చే నాలుగురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృత్తమై ఉంది. 3, 4 తేదీల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది.
-
HYDలో ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలను తనిఖీ చేయాలని కమిషనర్ ఆదేశాలు
HYD: గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలను ఇన్‌స్పెక్షన్ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ కర్నాన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫ్లైఓవర్ల స్థితిగతులు, జాయింట్లు, పటిష్టతను పరిశీలించి రిపోర్టు ఇవ్వాలని ప్రాజెక్ట్ అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో కమిషనర్ స్వయంగా పరిశీలన చేశారు.
-
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
HYD: ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సైబర్ కమ్యూనిటీలో జరిగింది. భర్త నీలేష్‌తో కలిసి నివసిస్తున్న మహారాష్ట్రకు చెందిన అరుణ శివాజీ పాటిల్ (30) ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ రోజు సీలింగ్‌ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.