Locations: Hyderabad

  • ’24 గంటల్లో అరెస్ట్ చేయాలి’

    HYD: పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి ఫిర్యాదు చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని ఫిర్యాదులో తెలిపారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను డిస్మిస్ చేసి, ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని కోరారు. పాతబడిన మిషనరీ వాడటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆయన ఆరోపించారు.

  • మీర్జా అలీ బేగ్‌కు జాతీయ బాక్సింగ్‌లో కాంస్యం

    HYD: హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన బాక్సర్‌ మీర్జా అలీ బేగ్‌ జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. ఆయన విసిరిన పంచ్‌లు తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్నాయి. 6వ జూనియర్‌ (అండర్‌-17) బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 52-54 కేజీల విభాగంలో అలీ బేగ్‌ కాంస్యం గెలుచుకున్నాడు. ఈ విజయంతో తెలంగాణ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్నాడు. 
  • కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్

    మేడ్చల్: బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజాంపేట్‌కి చెందిన సీహెచ్. శ్రీనివాసా రావు గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతండగా వారికి మంజూరైన ఎల్‌ఓసీ చెక్కును కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కుల మల్లేష్ యాదవ్, పద్మ రావు, గోపాల్ యాదవ్, సంజీవ రెడ్డి, పాల్గొన్నారు.

  • ‘లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి’

    మేడ్చల్: జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యాలయము ఎదుట పోస్టర్ ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ.. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

  • సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

    మేడ్చల్: మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఓ వినియోగదారుడి నుంచి డబుల్ డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సునీతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

  • సమావేశంలో పాల్గొన్న మాజీ ఛైర్‌పర్సన్

    మేడ్చల్: ఘట్కేసర్ ఎమ్‌ఆర్‌ఓ కార్యాలయంలో ఆర్‌డీఓ ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ పాల్గొన్నారు. రైల్వేవంతెన నిర్మాణంలో కోర్టుకు ఆశ్రయించిన 11 మందిని పిలిచి, ప్రభుత్వ యాక్ట్ ప్రకారం రైల్వే వంతెన నిర్మాణానికి కృషి చేయాలని కోరగా, లబ్ధిదారులు సానుకూలంగా స్పందిస్తూ మాకు కొద్ది రోజులు ఆలోచన చేసుకోవడానికి సమయం కావాలని కోరారు.

     

  • ‘సమ్మె జయప్రదం చేయాలి’

    మేడ్చల్: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ దమ్మాయిగూడ మున్సిపల్ ఆఫీసు వద్ద జూలై 9 సమ్మె వాల్ పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ నాయకులు, కీసర మండల నేత బంగారు నర్సింగరావు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలన్నారు.

  • పార్కులు, నాలాల ఆక్రమణలపై చర్యలు

    HYD: కాలనీ పార్కులు, నాలాలు ఆక్రమణకు గురవుతున్నాయంటూ సికింద్రాబాద్ బుద్దభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 49 ఫిర్యాదులు అందాయి. హైడ్రా అదనపు సంచాలకుడు వర్ల పాపయ్య పౌరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.లేఅవుట్ల చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీలను తొలగించాలని, లేఅవుట్లలోని ఖాళీ స్థలాల ఆక్ర మణలు అడ్డుకోవాలని,సామాజిక అవసరాల కోసం కేటా యించిన స్థలాలను రక్షించాలని ఫిర్యాదుదారులు కోరారు.

  • ‘అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తా’

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారి కార్యాచరణలో భాగంగా పలు సమస్యలతో వచ్చిన నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినతిపత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ద్యేయంగా ముందుకెళ్తానన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలిపారు.

  • మేడ్చల్‌ పారిశ్రామికవాడలో పేలిన బాయిలర్‌

    TG: మేడ్చల్‌ పారిశ్రామికవాడలో బాయిలర్‌ పేలింది. ఆల్కలైడ్స్‌ బయో యాక్టివ్స్‌ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో సంస్థ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.