Locations: Hyderabad

  • ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన అసిస్టెంట్ సునీత

    మేడ్చల్: కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ 23 మూసాపేట్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. టాక్స్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ సునీతను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుంచి రూ.80 వేలు లంచం డిమాండ్ చేయగా, రూ.30 వేలను ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 
  • రేపటి నుంచి శాకంబరిగా పెద్దమ్మతల్లి

    HYD: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 2వ తేదీ బుధవారం నుంచి 4వ తేదీ శుక్రవారం వరకు శాకంబరీ ఉత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని పండ్లు, కూరగాయలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొట్టిన కారు

    HYD: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేకువజామున 3 గంటల సమయంలో ఉషా ఫ్యాన్ కంపెనీ ముందు ఉన్న స్తంభాన్ని అతివేగంతో వచ్చిన కారు స్తంభాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని ముస్తాక్ (19) అనే యువకుడిగా గుర్తుంచారు. 
  • ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు

    HYD: జలమండలి ప్రజావాణికి ఆరు ఫిర్యాదులు వచ్చాయి. హఫీజ్‌పేట్‌లోని జల మండలి కార్యాలయంలో 15, 17 డివిజన్లకి చెందిన జీఎంలు రమావత్ కృష్ణ, శ్రీని వాసరెడ్డి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పాపి రెడ్డికాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కార్పొరేటర్ నాగేందర్యాదవ్ అధికారుల దృష్టికి తెచ్చారు. మణికొండ, హల్ కాలనీల్లో తాగునీటి సమస్య, నల్లగండ్ల, మయూరినగర్లో డ్రైనేజీ, మక్తాలో కలుషిత నీటి ఇబ్బందులపై వినతిపత్రాలు అందాయి.

  • కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే

    మేడ్చల్: నాగోల్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప కాలనీలో వాటర్‌వర్క్స్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులచే కలిసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు డ్రైనేజీ, రోడ్ల సమస్యల గురించి ఎమ్మెల్యేకి వివరించారు. ఇండ్లలోకి డ్రైన్స్ నీరు రావడం జరుగుతున్న నేపథ్యంలో నూతన డ్రైన్స్ నిర్మాణ పనుల్లో సరైన ఎత్తుపల్లాలు చూసుకొని నూతన డ్రైన్స్ నిర్మాణం చేపట్టలని ఆదేశించారు.

  • ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు

    మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో ఆల్కలాయిడ్ బయో యాక్టివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షాపూర్‌కు చెందిన మూల శ్రీనివాస్ రెడ్డి (12 ఏళ్లుగా కంపెనీలో కార్మికుడు) తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికులు ఆయనను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తులిపారు.
  • ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

    మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో జమదగ్ని మహాముని, రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో సోమయ్య,మహేష్, తిరుమలేష్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.

  • బ్రేకులు ఫెయిల్ పల్టీ కొట్టిన లారీ..

    HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని లోటస్‌పాండ్ వద్ద తెల్లవారుజామున ఇసుక లోడుతో ఉన్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కరెంటు స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ఘటనతో స్థానికంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని పక్కకు తప్పించారు. ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

  • చారిటబుల్ ట్రస్ట్‌తో పేద విద్యార్థులకు చేయూత

    మేడ్చల్: మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్ ప్రభుత్వ పాఠశాలలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత కార్యక్రమం జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ట్రస్ట్ ఛైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి నోటు పుస్తకాలు,స్టడీ మెటీరియల్స్, ఇతర వస్తులు పంపిణీ చేశారు. గత 26 ఏళ్లుగా ట్రస్ట్ పేద విద్యార్థులకు సహాయం అందిస్తోందని,భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.
  • నిర్మాణ పనులు ప్రారంభం

    మేడ్చల్: మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని ఇంద్రనగర్, మంగాపురం, తిరుమలనగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. అంతరం ఎమ్మెల్యే మట్లాడుతూ..అభివృద్ధి విషయంలో అవసరమైన సహకారం అందిస్తూ,నిత్యం మీకు అందుబాటులో ఉంటానని, ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్,మాజీ కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.