Locations: Hyderabad

  • ‘సామాజిక సమస్యలు త్వరగా పరిష్కరించాలి’

    HYD: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సామాజిక సమస్యలపై ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఆమె 71 వినతులు స్వీకరించి, పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. ఆరు జోనల్ కార్యాలయాలకు 107 ఫిర్యాదులు వచ్చాయి. టౌన్‌ప్లానింగ్ సమస్యలు అధికంగా ఉన్నాయని, అనధికార భవనాలపై క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, రఘుప్రసాద్, సీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

  • ప్రాణం తీసిన కారు సరదా..

    మేడ్చల్: బాలానగర్‌లో అర్ధరాత్రి కారు డ్రైవ్ సరదా ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆస్‌బెస్టాస్ కాలనీకి చెందిన మహమ్మద్ ముస్తక్(19), స్నేహితులు ప్రదీప్, ముస్తఫా, హుస్సేన్‌లతో కారులో జేఎన్‌టీయూ వెళ్లి తిరిగి వస్తుండగా.. ముస్తక్ సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టే ప్రయత్నంలో కారు అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ డోర్ తెరుచుకోకపోవడంతో ముస్తక్ కారులోనే చిక్కుకొని, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో మృతిచెందాడు.

  • టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యుడిగా విజయ్‌రావు

    HYD: రాష్ట్రంలోని ప్రమాదకర కర్మాగారాల్లో మహిళా కార్మికుల ఆరోగ్యం, పని గంటలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర కర్మాగారాల శాఖ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఎన్‌ఎఫ్‌సీ విశ్రాంత అధికారి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌రావు కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. మహిళల ఆరోగ్య సమస్యలు, నష్టపరిహారం, పని గంటలపై 15 రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్లు డా.విజయ్‌రావు తెలిపారు.

  • హైదరాబాద్‌ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు

    HYD: జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన యూఐటీపీ 2025 పురస్కారాల్లో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీ ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) ‘ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్’ ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు పొందింది.రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) సహకారంతో డేటా ఆధారిత, శక్తిసామర్థ్య విధానాల ద్వారా రాబడి పెంపొందించినందుకు ఈఅవార్డు దక్కింది.500ఎంట్రీల నుంచి ‘ఆపరేషనల్ ఎక్సలెన్స్’ కేటగిరిలో టాప్-5లో నిలిచిందని ఎండీ కేవీబీరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

  • నకిలీ వైద్యులపై టీజీఎంసీ దాడులు.. ఏడుగురు అరెస్ట్

    HYD: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) షాబాద్, హైతాబాద్‌లో నకిలీ దవాఖానలపై దాడులు నిర్వహించి, అర్హతలేని ఏడుగురు నకిలీ వైద్యులను పట్టుకున్నారు. ఓంసాయి, శ్రవణ్, శ్రీ సాయి,జంజం క్లినిక్‌లలో లింగాచారి, బాలరాజు, భాగ్యశ్రీ, ముస్తఫా, వెంకటేశ్, అంజయ్య, మహమ్మద్ గౌస్ అంజద్‌లు అల్లోపతి చికిత్స చేస్తున్నారు.వీరివద్ద డైక్లోఫెన్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ ఇంజక్షన్లు స్వాధీనం చేశారు.కేసు నమోదు చేసి ఏడాది జైలు,రూ.5లక్షల జరిమానా విధించనున్నారు.

  • ఉన్నత విద్యా మండలికి సమాచార కమిషన్‌ నోటీసులు

    HYD: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో యాజమాన్య కోటా(B కేటగిరీ) కింద పేమెంట్‌ విధానంలో భర్తీ చేసిన సీట్ల వివరాలు ఇచ్చేందుకు పది ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు నిరాకరించాయని, వాటి నుంచి సమాచారం ఎందుకు తీసుకోలేకపోయారని రాష్ట్ర ఉన్నత విద్యామండలిని సమాచార కమిషన్‌ నిలదీసింది. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది. సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత సదరు కళాశాలల ప్రిన్సిపాళ్లపైనా ఉందని గుర్తుచేసింది.

  • నిషేధిత సిగరెట్ల గోదాంపై దాడి

    HYD: సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, చాదర్‌ఘాట్‌ పోలీసులు సంయుక్తంగా అక్బర్‌బాగ్‌లోని గోదాంపై దాడిచేసి, నిషేధిత విదేశీ సిగరెట్ల వ్యాపారి మహమ్మద్‌ ఫైజల్‌(31)ను అరెస్ట్‌ చేశారు. నాంపల్లి ట్రూప్‌బజార్‌కు చెందిన ఫైజల్‌, సైదాబాద్‌ ఫరా కాలనీలో నివసిస్తూ,ఢిల్లీ నుంచి రాహుల్‌ ద్వారా సిగరెట్లను తెప్పించి పాన్‌ షాపులు, కిరాణా దుకాణాలకు విక్రయిస్తున్నాడు. పోలీసులు వారి నుంచి రూ.10.70లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

  • GHMC పరిధిలో ఎంత వర్షం పడిందంటే?

    HYD: GHMC పరిధిలో గత రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అత్యధికంగా లింగంపల్లి, BHELలో 27.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టోలీచౌకీలో 26.3శాతం, బంజారాహిల్స్‌లో 26.0, మహాదేవపురంలో 25.5, గచ్చిబౌలిలో 25.0, బోరబండలో 24.8 శాతంగా వర్షం పడింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • నేడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

    HYD: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారిని పెళ్లికుమార్తెగా అలంకరించారు. రాత్రి 7 గంటలకు గణపతి పూజ జరిగింది. ఎల్లమ్మ దేవస్థానం నుంచి సంజీవరెడ్డినగర్‌లోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ కుమార్‌గౌడ్, ఈవో నరేందర్‌రెడ్డి, అర్చకుడు వేణుగోపాలాచార్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. నేడు ఉదయం 11:51 గంటలకు కళ్యాణోత్సవం జరుగనుంది.

  • భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం

    HYD: గత రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో పంజాగుట్ట, లక్డీకపూల్, మలక్‌పేట, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, ఖాజాగూడ, మణికొండ, మేడ్చల్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, నారాయణగూడలో రోడ్లు వరద నీటితో నిండాయి. లక్డీకాపూల్‌ ద్వారకా హోటల్‌ కూడలిలో నీటిని హైడ్రా సిబ్బంది మ్యాన్‌హోళ్లలోకి మళ్లింపు చర్యలు చేపట్టారు. మణికొండ, అత్తాపూర్‌లో ఈదురుగాలులతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.