Locations: Hyderabad

  • ‘గ్రేడర్‌’‌లో గతేడాది 3,058 రోడ్డు ప్రమాదాలు

    HYD: గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్లలో 2024లో 3,058 రోడ్డు ప్రమాదాలు జరిగాయని ‘రోడ్‌ సేఫ్టీ నెట్‌వర్క్‌’ తెలిపింది.వీటిలో 286 మంది మరణించగా.. 3,393 మంది గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 25,934 ప్రమాదాల్లో 7,773 మరణాలు సంభవించాయి. అతివేగం, అపసవ్య దిశలో వాహన నడుపుడు ప్రధాన కారణాలు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, పాదచారుల సదుపాయాల కొరత కూడా ప్రమాదాలకు కారణమని, 2024లో 22 లక్షల చలానా, రూ.111 కోట్ల జరిమానా వసూలు చేశారు.

  • జన్మదిన వేడుకలకు ఆహ్వానించి హత్య

    మేడ్చల్: కూకట్‌పల్లి ఠాణా పరిధిలో అల్లాపూర్‌కు చెందిన రౌడీషీటర్‌ సయ్యద్‌ షాహీద్‌(23)ను మిత్రులు పథకం ప్రకారం హత్య చేశారు. పవన్‌ పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించి, వడ్డేపల్లి ఎన్‌క్లేవ్‌ వద్ద మద్యం తాగారు.వాగ్వాదంతో సాజీద్, పవన్, మున్నా, సమీర్‌లు మద్యం సీసాలతో షాహీద్‌ గొంతును పొడిచి, బండరాళ్లతో తలపై కొట్టిచంపారు. డబ్బు డిమాండ్‌ బెదిరింపులే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు.ఇద్దరు నిందితులు అదుపులో ఉన్నారు.

     

  • రూ.79 లక్షల స్టాక్‌ ట్రేడింగ్‌ మోసం

    HYD: నిజాంపేట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి అవేష్ట ప్రైవేటు వెల్త్‌ స్టాక్‌ ట్రేడింగ్‌ పేరిట రూ.79లక్షలు కోల్పోయాడు. అతని వాట్సాప్‌ నంబర్‌ను అవేష్ట స్టడీ గ్రూప్‌-డబ్ల్యూలో చేర్చారు.ఆశివర్య అనే మహిళ 3-6 నెలల్లో 890% లాభాలు వస్తాయని నమ్మించింది. రూ.3లక్షలు పెట్టుబడి పెట్టిన బాధితుడు, దశలవారీగా రూ.79లక్షలు పెట్టాడు.యాప్‌లో లాభాలు చూపించినా ఉపసంహరణకు అవకాశం ఇవ్వక,మరింత డబ్బుచెల్లించమని ఒత్తిడి చేయడంతో సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • హైదరాబాద్‌లో భారీ వర్షం.. అప్రమత్తమైన GHMC

    HYD: నగరంలో వర్షాల కారణంగా GHMC అప్రమత్తమైంది. మేయర్ విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111కు కాల్ చేయాలని మేయర్ సూచించారు.

  • ‘పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలి’

    HYD: ఆషాఢమాసం సందర్భంగా అడ్డగుట్ట బోనాల పండుగకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు తుకారాంగేట్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ డివిజన్ కార్యదర్శి సాయన్న మాట్లాడుతూ.. అన్ని ఆలయాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఐని కోరినట్లు తెలిపారు. శివప్రసాద్, శివాజీ, రాజు, ఉదయ్ పాల్గొన్నారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

    మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు నిర్లక్ష్యంతో స్కూటీ (TG 30 3606)ని ఢీకొట్టడంతో బీబీనగర్ మండలం జియ్యపల్లికి చెందిన బానోత్ కళ్యాణ్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొకరు తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కల్యాణ్ బీబీనగర్ మండలం జియ్యపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • హైదరాబాద్‌లో కుండపోత వాన..

    HYD: నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌‌లోని అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, మల్కాజిగిరి, నేరేడుమెట్లు, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షంకురిసింది. అలాగే వికారాబాద్‌లో శంషాబాద్ పరిసరాలు, అత్తాపూర్, బండ్లగూడ, నార్సింగీ, ఆరాంఘర్ ప్రాంతాలు ఓ మోస్తరు వర్షం కురిసింది. షాద్‌నగర్, జీడిమెట్లలో ఓ మాదిరిగా వర్షం పడుతోంది.

  • సీఎంను కలిసిన సీపీఐ నేతలు

    HYD: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ నాయకులు కలిశారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, ఆర్టీసీతో పాటు పలు ప్రజాసమస్యలను సీఎం దృష్టికి నేతలు తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం స్పష్టంచేశారు.

  • ఒకే రూట్‌లో వెళ్లేవారికి ప్రత్యేక బస్సులు: పొన్నం

    TG: ఒకే రూట్‌లో వెళ్లేవారికి ప్రత్యేక బస్సులు నడిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నగరంలో కొత్తకాలనీలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా కొత్త రూట్లలో ప్రయాణికుల సౌకర్యాలు పెంచేలా ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నామన్నారు. ఒకే రూట్‌లో వెళ్లే వారుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, వారికి ప్రత్యేక బస్సులు వేస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ అమలు చేస్తోన్న డిజిటల్‌ పేమెంట్స్‌ అమలును పొన్నం పరిశీలించారు.

  • అప్రమత్తంగా ఉండండి: మేయర్

    హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూం నంబర్ 040-21111111కు కాల్ చేయాలని సూచించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.