
Locations: Hyderabad
-
ఉప్పల్‌లో ఉద్యమకారుల శాంతియుత దీక్ష
మేడ్చల్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని ఈసీఐఎల్ చౌరస్తాలో శాంతియుత దీక్ష జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీల అమలు కోసం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంఘీభావంగా పాల్గొన్నారు. 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 పెన్షన్, గుర్తింపు కార్డు, 20% కోటా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
మెగా హెల్త్ క్యాంపు
HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ జన్మదినం సందర్భంగా న్యూ బోయిన్‌పల్లిలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. లయన్స్ ఐ హాస్పిటల్‌కు రూ.2 లక్షల విరాళం అందజేశారు. సేవా కార్యక్రమాల బాధ్యతను ముకుల్ చేపడతాడని ఎమ్మెల్యే ప్రకటించగా, తండ్రి ఆదర్శంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని ముకుల్ తెలిపారు. -
బాపు రెడ్డికి ఘన సన్మానం
మేడ్చల్: కుషాయిగూడ పాఠశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన MEO జి. బాపు రెడ్డి రిటైర్మెంట్ సందర్భంగా నాగారం శివ సాయి గార్డెన్‌లో ఘనంగా సన్మానించారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, BRS నాయకులు పాల్గొన్నారు. -
నాగారంలో ఉద్యమకారుల శాంతియుత దీక్ష
మేడ్చల్: తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలు కోసం TUF రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాగారం మున్సిపాలిటీలో ఉద్యమకారులు శాంతియుత దీక్ష చేపట్టారు. మాజీ ఛైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీనివాస్ గౌడ్, నక్క కిషోర్ గౌడ్, రవీందర్ రెడ్డి సంఘీభావం తెలిపి, డిమాండ్లు నెరవేరే వరకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
‘నిధుల మంజూరుకు కృషి’
మేడ్చల్: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో పెరుగుతున్న రైళ్ల రాకపోకల నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ల విస్తరణ, వీధిదీపాల ఏర్పాటుకు నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు, తద్వారా ప్రయాణికుల భారాన్ని తట్టుకునేందుకు స్టేషన్ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు. -
ముషీరాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించిన మంత్రి పొన్నం
HYD: ముషీరాబాద్ ఆర్టీసీ డిపోను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించి, డిజిటల్ పేమెంట్స్ అమలును పరిశీలించారు. ఆర్టీసీ అధికారులతో ఐటీ విభాగం, ప్రయాణికుల వివరాలు, హెడ్ ఆఫీస్ కనెక్టివిటీపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కేవీపీఎస్ రాజకీయ శిక్షణ తరగతులు
మేడ్చల్: హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలో కెవిపిఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి. కెవిపిఎస్ నాయకులు స్కైలాబ్ బాబు, కృపా సాగర్ మాట్లాడుతూ.. కుల వ్యవస్థ చాతుర్వర్ణ్యానికి దారితీసి అసమానతలు సృష్టించిందని, శాస్త్రీయ అభివృద్ధి ఉన్నప్పటికీ కుల జడత్వం తొలగలేదని తెలిపారు. -
కట్నం వేధింపులకు మహిళ బలి
HYD: బేగంపేట్, కుందన్‌బాగ్‌లో కిరణ్మయి (30) అనే మహిళ కట్నం వేధింపులకు బలైంది. ఏడాదిన్నర క్రితం శరత్‌తో వివాహమైంది. రూ.3 లక్షల నగదు, బంగారం ఇచ్చారు. బైక్, అదనపు కట్నం కోసం శరత్ ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించాడు. గుండెనొప్పితో నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మొబైల్ షోరూంలో చోరీ
HYD: మలక్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధి దిల్‌సఖ్ నగర్ – కోఠి ప్రధాన రహదారి వెంట ఉన్న బిగ్ సీ మొబైల్ స్టోర్‌లో నిన్న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి స్టోరులోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి సుమారు రూ.5 లక్షల విలువైన మొబైల్స్‌ను చోరీ చేసిన్నట్టు స్టోర్ యజమాని తెలిపారు. చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలలో నిక్షిప్తం అయ్యాయి. అయితే ఘటనకు సంబందించి పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.
-
అమ్మాయిలకు అలర్ట్ : మీ ‘ఫాలోవర్స్’లో అలాంటి వారున్నారు జాగ్రత్త!
మహిళల పేరుతో ఖాతాలు సృష్టిస్తున్న నేరగాళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తున్నారు. పొరపాటున స్నేహితుల జాబితాలో చేరిస్తే అసలు మోసం మొదలుపెడుతున్నారు. యువతులు నిజమేనని వ్యక్తిగత ఫొటోలు పంపినప్పుడు వాటిని నగ్నంగా మార్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తుల్ని స్నేహితులుగా చేర్చుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.