Locations: Hyderabad

  • పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా

    మేడ్చల్: బోడుప్పల్‌లోని నారాయణ పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహించారు. అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు, పెన్నులు, షూ, టై అక్రమంగా అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా నడిపిస్తున్నారని మండిపడ్డారు. డీఈఓ, ఏంఈఓకి సమాచారం ఇచ్చిన స్పందించలేదని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జిల్లాలో నారాయణ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవస్థను నడుపుతున్నాయని.

  • ‘దక్కన్ సేవలు అభినందనీయం’

    HYD: మహంకాళి అమ్మవారి జాతరలో భక్తులకు దక్కన్ మానవ సేవాసమితి అందించే సేవలు అభినందనీయమని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్‌మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో దక్కన్ మానవ సేవాసమితి నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్పారు.

  • డ్రైనేజీ పనుల పరిశీలన

    మేడ్చల్: పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్ సాయి హిల్స్ కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ పనులను మాజీ మేయర్ అమర్ సింగ్ పరిశీలించారు. మాజీ మేయర్ అమర్ సింగ్ మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీరితో పాటు మాజీ కార్పొరేటర్స్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

  • గుర్తు తెలియని మృతదేహం లభ్యం

    HYD: పాతబస్తీలోని బహదూర్ పురా బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. మృతదేహనికి ముఖంపై గాయాలు ఉండటంతో మర్డర్ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సమాచారము అందుకున్న పొలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ప్రస్తుతం అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • మంత్రి శ్రీధర్ బాబుకు సన్మానం

    మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం నుంచి రోడ్డు, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులకు రూ.34.95 కోట్ల నిధులు మంజూరుకు సహకరించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ దుద్ధిళ్ల శ్రీధర్ బాబును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  • శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్

    మేడ్చల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం మహోతర కార్యక్రమానికి  ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ పలువురు నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాకు అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ పాల్గొన్నారు.

  • తిమ్మాయిగూడలో దారుణ హత్య

    మేడ్చల్: నాగోల్ పీఎస్ పరిధిలోని తిమ్మాయిగూడ శివారులో కాచిగూడకు చెందిన అశోక్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యాడు. కాచిగూడలో జ్యూస్ షాపు నిర్వహిస్తున్న అశోక్‌ను నిర్మానుష్య ప్రాంతంలో బండరాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.

  • మితిమీరుతున్న హిజ్రాల ఆగడాలు.. బలవంతపు వసూళ్లతో పరేషాన్‌

    TG: హైదరాబాద్‌లో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితిమిరిపోతున్నాయి. బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రావిర్యాల ORR సర్వీస్ రోడ్డులో వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.  హిజ్రాల బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

     

  • కాలేజీల్లో అడ్మిషన్ ఫీజులపై ABVP ధర్నా

    HYD: మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి వద్ద ఏబీవీపీ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు. దోస్త్ అప్లికేషన్ ద్వారా జరిగిన అడ్మిషన్లలో ప్రభుత్వ కాలేజీలు డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ కాలేజీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని విద్యార్థి నేతలు స్పష్టం చేశారు.

  • ‘షెల్టర్’​ ఇస్తేనే వారంతా సేఫ్

    TG: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 5 వేల మందికి పైగా ఏ ఆధారం లేనివారు గూడు లేకుండా నివసిస్తున్నారు. నగరంలో ప్రస్తుతానికి పురుషులకు 8, స్త్రీలకు 3 షెల్టర్‌ జోన్లు ఉన్నాయి. వీటిలో 380 మంది వరకు నివసిస్తున్నారు. మిగతా వారికి తలదాచుకునే నీడ లేకుండాపోయింది. దీంతో హైదరాబాద్‌ పరిధిలోనే సుమారు 60 నిరాశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి.