Locations: Hyderabad

  • కారు చక్రాల కిందపడి ఏడేళ్ల బాలుడు మృతి

    HYD: ముజాహిద్ నగర్‌లో ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడు ఖయ్యూం కారు చక్రాల కింద నలిగి మృతి చెందాడు. ప్రముఖ ఫుడ్ వ్యాపారి తనయుడు నిర్లక్ష్యంగా కారు నడిపిన ఈ ఘటనలో డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించగా..బాలుగు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును సెటిల్ చేసేందుకు డ్రైవర్‌ను తప్పించే యత్నం జరుగుతున్నట్లు సమాచారం.

  • షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

    HYD: చైతన్యపురి పీఎస్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో శ్రీనివాస్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, రూ.2 లక్షల విలువైన గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ప్రణవ్(22) అనే యువకుడు గాయపడి, ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహ గుప్త సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

  • క్రమంగా తగ్గుతున్న బంగారం ధరలు

    HYD: బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 160 తగ్గి రూ.97,260కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 150 తగ్గి రూ.89,150 పలుకుతోంది. కేజీ వెండిపై రూ. 100 తగ్గి రూ.1,17,700గా ఉంది. కాగా వారం రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ.3,490 తగ్గడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

  • శ్రీ వరసిద్ధి వినాయక యాగశాల ప్రారంభోత్సవం

    మేడ్చల్: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గౌతమ్ నగర్ డివిజన్‌లోని గోపాల్ నగర్‌లో శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ యాగశాల ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్‌తో పాల్గొన్నారు. 5 ఎంఎల్‌డీ వాటర్ రిజర్వాయర్, ఆర్‌యూబీ నిర్మాణం, దేవాదాయ భూములకు స్టే ఆర్డర్ వంటి అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ఆలయానికి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

  • బోనాల వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

    HYD: తెలంగాణ సంస్కృతి ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలను సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి దేవాలయంలో వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఎదుర్కోలు కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఫిషరీస్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌తో కలిసి పాల్గొని, ఘటం వస్తువులు, ఆభరణాలు అందజేశారు. దేవాదాయ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, రవాణా, వైద్యశాఖలు భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాయన్నారు.

  • పూర్ణచందర్ భార్య సంచలన వీడియో

    TG: తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న పూర్ణచందర్ భార్య స్వప్న ఓ వీడియో విడుదల చేశారు. ‘‘స్వేచ్చ కూతురు మా ఆయనపై నిందలు వేస్తోంది. స్వేచ్చ నన్ను చాలా టార్చర్ పెట్టింది. స్వేచ్చ కూతురికి అలా చెప్పమని ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. మా ఆయన చెడ్డోడు కాదు, న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు.

  • రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

    మేడ్చల్: బాలానగర్ పీఎస్ పరిధిలో తెల్లవారుజామున అతివేగంతో వచ్చిన కారు ఉషా ఫ్యాన్ కంపెనీ ముందు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురిలో ముస్తాక్(19) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • సున్నం చెరువులో హైడ్రా ఆక్రమణల తొలగింపు

    రంగారెడ్డి: మాదాపూర్‌ పరిధిలోని 32 ఎకరాల సున్నం చెరువులో హైడ్రా అక్రమ ఆక్రమణలను తొలగించింది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించిన అక్రమ గుడిసెలను కూల్చివేసి, బోరు మోటార్లను తొలగించారు. చెరువు సమీపంలో ఏళ్ల తరబడి సాగుతున్న అక్రమ నీటి వ్యాపారాన్ని అడ్డుకుంటూ.. భూగర్భ జలాల వినియోగాన్ని నిషేధించారు. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్‌ ట్యాంకర్లను హైడ్రా సీజ్‌ చేసింది.

  • కూకట్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

    మేడ్చల్: కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యువకుడు సయ్యద్ షాహేద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దేవ్ ఇస్తానా హోమ్స్ వెనక ఉన్న ఖాళీ ప్రదేశంలో హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీకి తరలించారు.మృతుడు బోరబండ ప్రాంతానికి చెందిన వాహిద్ పైల్వాన్ కుమారుడిగా గుర్తించారు. పాత కక్షలు నేపథ్యంలో ఈహత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

     

  • ఓఆర్‌ఆర్‌పై ఒకదానికొకటి ఢీకొన్న 9 కార్లు..

    HYD: సోమవారం తెల్లవారుజామున ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)  రాజేంద్రనగర్‌ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బ్రేక్‌ వేయడంతో.. వెనుక వస్తున్న తొమ్మిది కార్లు వరుసగా ఢీకొన్నాయి. దీంతో రోడ్డుపై అడ్డంగా ఆగిన వాహనాలతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పోలీసులు, ఓఆర్‌ఆర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కార్లను తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.