Locations: Hyderabad

  • ఘనంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం

    HYD: రామకృష్ణాపురం డివిజన్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ ప్రభు, నర్సింగరావు ప్రభు నేతృత్వంలో జగన్నాథ రథయాత్రను శ్రీ దత్తేశ్వరా నంద భారతీ స్వామి ప్రారంభించారు. గత నాలుగేళ్లుగా వేలాది భక్తులతో కాలనీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలతో ఆధ్యాత్మిక శోభతో యాత్ర జరుగుతోంది. యువజన కాంగ్రెస్ నాయకుడు చిలక ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దైవభక్తి మానసిక ప్రశాంతతకు కీలకమని, ఇష్టదైవాలను పూజించాలని పేర్కొన్నారు.

  • ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

    HYD: నగరంలోని శ్రీకృష్ణ నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న యువకుడుని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • న్యూస్ ఛానల్ దాడి కేసు.. గెల్లు శ్రీనివాస్‌కు బెయిల్

    TG: హైదరాబాద్‌లోని మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి కేసులో BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో సహా అందరికీ నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 28, 2025న జరిగిన ఈ దాడిలో శ్రీనివాస్‌తో పాటు 12 మందిపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదయ్యాయి. రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది.

  • వివాహిత ఆత్మహత్య

    HYD: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పాపిరెడ్డి కాలనీ ఆరంభ్ టౌన్‌షిప్‌లో పాలకొండ కుమారి (33) అనే వివాహిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మానసిక అనారోగ్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. మూడేళ్లుగా చికిత్స పొందుతున్న కుమారికి బురద ప్రసాద్ రావుతో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. చందానగర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడలు

    మేడ్చల్: మేడ్చల్‌లోని తెలంగాణ క్రీడా పాఠశాలలో అండర్ 10, 12, 14 బాలబాలికల జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ కూరపాటి రాజశేఖర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయన్నారు. విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు.
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు

    మేడ్చల్: ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మకు మేడ్చల్ మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి బోనం సమర్పించారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి మొక్కను చెల్లించుకున్నారు. మొక్కు చెల్లించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

  • మహాకాళి ఘటోత్సవాలు .. మంత్రి పొన్నం పూజలు

    HYD: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.  ఘటం ఎదుర్కోలు కోసం ఆభరణాలకు పూజలు చేసి నిర్వాహకులకు అందించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 26 న గోల్కొండ బోనాలతో ఆషాఢ మాస బోనాలు ప్రారంభమయ్యాయన్నారు. జులై 1 న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరుగుతుందన్నారు.

  • విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ పంపిణీ

    HYD: సికింద్రాబాద్ మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో టీమ్ వి ఫర్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ చైర్మన్ సుంకరి భానుమతి, ప్రధాన కార్యదర్శి సుంకర రామ్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు నోటుబుక్స్ అందజేశారు. ముఖ్య అతిథులుగా గంప చంద్రమోహన్, లింగేశెట్టి హనుమంతరావు హాజరయ్యారు.
  • నూతన కమిటీ ప్రకటన

    HYD: సీపీఎం సికింద్రాబాద్ జోన్ నూతన కన్వీనర్‌గా ఆర్. మల్లేష్ నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు అండగా నిలిచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. జనరల్ బాడీ సమావేశంలో ఎం అజయ్ బాబు, ఎం గోపాల్, మధు, ఎల్లయ్య, శారద, అంజమ్మ, ప్రభాకర్‌లతో కమిటీ ఏర్పాటైంది. నగర కార్యదర్శి ఎం వెంకటేష్, ఎం శ్రీనివాస్ ప్రకటించారు.
  • జ్యువెలరీ షోరూమ్‌ ప్రారంభం

    HYD: దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంద్రియ ఆదిత్య బిర్లా జ్యువెలరీ షోరూమ్‌ను తెలంగాణ రిటైల్ హెడ్ అమిత్ ధారప్ ప్రారంభించారు. మల్కాజ్‌గిరి ఎంపీ రాజేందర్, కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లో నాలుగో బ్రాంచ్, దేశవ్యాప్తంగా 25 షోరూమ్‌లు ఏర్పాటు చేసినట్లు అమిత్ ధారప్ తెలిపారు. 5,000కి పైగా ప్రత్యేక డిజైన్ ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.