Locations: Hyderabad

  • ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు ఘన సన్మానం

    HYD: కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఏడాది పూర్తి చేసిన సందర్భంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రోటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో బొల్లారంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్‌కు సన్మానం జరిగింది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యమని గణేష్ తెలిపారు.
  • రక్తదాన శిబిరం

     HYD: చిన్నారి తలసేమియ బాధితుల సహాయార్థం సికింద్రాబాద్ జోన్ వైశ్య ఫెడరేషన్ బౌద్దనగర్ గాంధీ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించింది. ముఖ్య అతిథులుగా గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా హాజరై, రక్త దాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. డా. బాలు, నాగమళ్ళ సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
  • పదోన్నతి సన్మానం

    మేడ్చల్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ నుంచి ASIగా T. మహిపాల్, ASI నుంచి SIగా T. మహేందర్ పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ పి. పరుష్ రామ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ J. Srinivas వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. ఎస్సైలు B. ప్రభాకర్ రెడ్డి, M. సాయికుమార్, K. శ్రీనివాస్, పిఎస్ సిబ్బంది పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.
  • ఘటాల ఊరేగింపు ప్రారంభం

     HYD: సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బోనాల ఉత్సవంలో భాగంగా ఘటాల ఎదుర్కోళ్ళ సందర్భంగా అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఘటాలకు ఆభరణాలు అందజేశారు. ఆలయ EO మనోహర్ రెడ్డి, ట్రస్టీ కామేష్, BRS నాయకులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.
  • అభివృద్ధి పనులు ప్రారంభం

    HYD: కంటోన్మెంట్ వార్డు 6లోని చందులాల్ బౌలి కాలనీలో ఎమ్మెల్యే శ్రీగణేష్ రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆదివారం ప్రారంభించారు. వర్షాకాలం దృష్ట్యా పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. స్థానికులు ఎమ్మెల్యేను సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు, నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద, స్థానికులు హాజరయ్యారు.
  • ఫలించిన 60 ఏళ్ల పోరాటం.. పార్క్‌ ఆక్రమణలు తొలగించిన హైడ్రా

    HYD: మధురానగర్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్క్‌ ఆక్రమణలను ఆదివారం హైడ్రా సిబ్బంది తొలగించారు. 1961 నుంచి ఉన్న ఆక్రమణలను తొలగించడంతో 1533 గజాల విస్తీర్ణంలోని పార్క్‌ అందుబాటులోకి వచ్చింది. సాయి సారధినగర్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. 60 ఏళ్ల పోరాటం ఫలించిందని స్థానికులు హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

  • పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

     HYD:మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హోటల్ యజమాని లక్కం శెట్టి ఆదినారాయణ (52) రెంటు వివాదంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరు నెలలుగా రెంటు చెల్లించని ఆదినారాయణ, శుక్రవారం ల్యాండ్ ఓనర్‌తో వాగ్వాదం తర్వాత ఈ చర్యకు పాల్పడ్డాడు. 40% కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  • మౌలిక సదుపాయాల కొరత

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుందిగల్ మున్సిపాలిటీ, డి.పోచంపల్లి పరిధిలోని మల్లికార్జున నగర్‌లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డికి తెలపగా, ఆయన కాలనీని సందర్శించారు. డ్రైనేజీ, సీసీ రోడ్ల మంజూరుకు అధికారులతో చర్చించారు. బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, రాము గౌడ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
  • ఓపెన్ జిమ్ ప్రారంభం

    మేడ్చల్: జీడిమెట్ల డివిజన్‌లోని బృందావన్ కాలనీలో రూ.91 లక్షలతో నిర్మించిన GHMC పార్క్, ఓపెన్ జిమ్‌ను ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి ప్రారంభించారు. బీజేపీ నాయకులు, కాలనీ అధ్యక్షులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
  • నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

    మేడ్చల్: గాజులరామారంలోని సత్యగౌరి కన్వెన్షన్‌లో కుత్బుల్లాపూర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, కార్యవర్గాన్ని అభినందించారు. 2010లో జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘానికి 2000 గజాల ప్రభుత్వ స్థలం ఇప్పించినట్లు గుర్తు చేశారు. నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు వాస శ్రీనివాసులు గుప్త పాల్గొన్నారు.