
Locations: Hyderabad
-
మాజీ మంత్రికి ఘన నివాళి
HYD: గచ్చిబౌలి ఫ్లైఓవర్ అవుటర్ రింగ్ రోడ్‌కు సీఎల్పీ నాయకుడు, మాజీ మంత్రి పీ జనార్దన్ రెడ్డి పేరు పెట్టిన సందర్భంగా ఆదివారం బాలానగర్‌లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, పీజేఆర్ విగ్రహానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
ఘనంగా కల్యాణోత్సవం
మేడ్చల్: కీపీహెచ్‌బీ కాలనీ సెవెంత్ ఫేస్ (కైతలాపూర్) వద్ద రేణుక ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించి, అమ్మవారి కల్యాణాన్ని తిలకించారు. పెద్దమ్మ తల్లి బోనాలు కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. -
భక్తిశ్రద్ధలతో నవ చండీ యాగం
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని కేఎంపీ ఫుడ్ పరిశ్రమలో ఆదివారం నవ చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. కిరణ్ కుమార్ పంతులు ఆధ్వర్యంలో 30 మంది వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రెండు రోజులుగా జరిగిన యాగం పూర్ణాహుతితో ముగిసింది. కంపెనీ ఈడి కొత్తపల్లి శిరీష్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, మంచి వర్షాల కోసం యాగం నిర్వహించామన్నారు. -
‘సీఎంఆర్ఆఫ్ నిరుపేదలకు వరం’
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శ్రీ చిత్తరమ్మ దేవస్థానంలో ఐదుగురు నిరుపేదలకు సీఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ప్రజల సమస్యలను తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. సీఎంఆర్ఆఫ్ ఆర్థిక సహాయం నిరుపేదలకు వరంగా మారిందని, తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. -
కొండారెడ్డి గూడలో అగ్నిప్రమాదం
HYD: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగిన ఘటన బహదూర్ పురా పొలీసు స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ కొండారెడ్డి గూడలో చోటుచేసుకుంది. ఘటన స్థాలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
-
ఉప్పల్‌లోని పోచమ్మకు కుమ్మరుల తొలి బోనం
మేడ్చల్: ఉప్పల్‌లో బోనాల సందడి ఆదివారం ప్రారంభమైంది. కుమ్మరులు పోచమ్మకు తొలి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, కుమ్మరి పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుమిడెల్లి నారాయణ, యాదయ్య, మల్లేష్, భాస్కర్, బుల్లెట్ కృష్ణ, పొట్లూరి కృష్ణ, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి’
మేడ్చల్: బోనాలు, మొహర్రం పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏసీపీ శంకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. పండుగలను సామరస్యపూర్వక వాతావరణంలో జరుపుకొని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో తోడ్పాటున అందించాలని కోరారు. ఎవరైనా చెడగొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హే చ్చరించారు. హిందూ, ముస్లిం పండుగలను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
-
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మేడ్చల్: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1 వ వార్డులో రూ.80 లక్షలతో చేపట్టిన నాలా పనులకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ గౌడ్, పాల్గొన్నారు.
-
ఘనంగా ప్రారంభమైన ఆషాడమాస బోనాలు
మేడ్చల్: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన బోనాల పండుగ ఆదివారం మేడ్చల్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది. ఆషాడ మాసంలో తెలంగాణలో బోనాల ఉత్సవం జరగడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా విష్ణుశౌర్య ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. పట్టణంలోని సూర్యనగర్ నుంచి డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో ఊరేగింపుగా బోనాలను తీసుకెళ్లి, ఏడుగుళ్ల వద్ద అమ్మవారికి సమర్పించారు. బోనాలతో పాటు ఒడి బియ్యాన్ని సమర్పించారు.
-
కాలనీలో సమస్యలపై చర్చ
మేడ్చల్: నాగారం మున్సిపల్ పరిధి 6వ వార్డు వికాస్ నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సుర్వి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.సమస్యల పరిష్కారానికి, కాలనీ మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.