TG: హైదరాబాద్‌లో బోనాల సందడి మొదలైంది. ఆషాఢంలో తొలి ఆదివారం కావడంతో మహిళలు బోనాలతో వచ్చి.. మొక్కులు చెల్లించుకోగా శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
Locations: Hyderabad
-
ఆగస్టు 3న బోడుప్పల్‌లో బోనాల జాతర
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బంగారమైసమ్మ దేవాలయంలో గ్రామ పెద్దలు సమావేశమై ఆగస్టు 3న బోనాల జాతర, ఆగస్టు 4న బలిగంప, రంగం కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,బోడుప్పల్‌నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ పోగుల నర్సింహారెడ్డి,మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, కార్పొరేషన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
పూర్ణచందర్‌ను చెప్పుతో కొట్టాలి: స్వేచ్ఛ కుమార్తె
HYD: తన తల్లి సూసైడ్‌కు కారణమైన పూర్ణచందర్‌ను చంపేయాలని యాంకర్ స్వేచ్ఛ కూతురు అన్నారు. చంపేముందు తన చెప్పుతో, తన తల్లి చెప్పుతో పూర్ణచందర్‌ను కొట్టాలని ఉందని తెలిపారు. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన తల్లికి మధ్య మాటలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తాను ఎంతో మానసిక వేధన అనుభవించానని పేర్కొన్నారు.
-
ఇంటింటికి సీపీఐ పార్టీ కార్యక్రమం
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) రాష్ట్ర 4వ మహాసభలకు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఇంటింటికీ తిరిగి, పార్టీ పోరాటాలను ప్రజలకు వివరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు రచ్చ కిషన్, జె.లక్ష్మి, మండల సహాయ కార్యదర్శులు సిహెచ్.మాధవి, జి.నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతలు చేపట్టిన మంత్రికి అభినందనలు
HYD: కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి వివేక్ వెంకటస్వామికి పలువురు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ సోమజిగూడా లో ఆయనను ఎన్ఎస్ పటేల్ ఏజెన్సీస్ డైరెక్టర్స్ జస్మత్ పటేల్, రామ్ కృష్ణ పటేల్, ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ ఛైర్మెన్ ఆర్కే జైన్, మహేందర్ జైన్‌లు కలిసి శాలువా, పులా బుకేలతో ఘనంగా సన్మానించారు. -
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉపయోగకరం
మేడ్చల్: నాగారం మున్సిపల్ పరిధిలో కోమటివాని కుంట నుంచి చర్లపల్లి చెరువు వరకు నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ 18 కాలనీల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వర్షపు నీటి ముంపు సమస్యలు తొలగుతాయని నాగారం మాజీ ఛైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కౌకుట్ల ఆనంతరెడ్డి, తదితరుల ఆధ్వర్యంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. -
రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
మేడ్చల్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏసిపి కార్యాలయం సమీపంలో మెట్రో పిల్లర్ నంబర్ 838 వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పడిగా సురేష్(25) అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సురేష్‌పై ఏదైనా వాహనం ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందా లేక వాహనం అదుపు తప్పి ప్రమాదం సంభవించిందా అనే కోణంలో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రెండో స్థానంలో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ డిమాండ్
HYD: డీఎస్సీ-2024 పరీక్షల్లో ఉత్తీర్ణులై 1:3 నిష్పత్తిలో తుది జాబితాలో ఉన్న అభ్యర్థులు ప్రథమ స్థానంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినవారికి బదులు తమకు ఉపాధ్యాయ పోస్టులు కల్పించాలని విద్యాశాఖను కోరారు.హైదరాబాద్ జిల్లాలో ఎస్‌జీటీ పోస్టులకు ఎంపికైన 34 మంది అనర్హులని గుర్తించిన అధికారులు వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు.కలెక్టర్ హరిచందనను ప్రజావాణిలో కలిసిన అభ్యర్థులు పోలీస్ విచారణ నివేదిక ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీఇచ్చారు.
-
యాంకర్ ‘స్వేచ్ఛ’ సూసైడ్.. పూర్ణచందర్‌పై పోక్సో కేసు
HYD: తెలుగు యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో నిందితుడైన పూర్ణచందర్‌పై చిక్కడపల్లి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గతంలో తమ ఇంటికి వచ్చినప్పుడు పూర్ణచందర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ స్వేచ్ఛ కూతురు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఈమేరకు కేసు ఫైల్ చేశారు. అలాగే నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలపై 69 BNS, 108 BNS సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
-
ప్రత్యేక అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ
ఆషాడ మాసం తొలి ఆదివారం కావడంతో బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మలను పూలతో అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 2గంటల సమయం పడుతున్నట్లు భక్తులు తెలిపారు. మరో 2 రోజులో ఎల్లమ్మ కళ్యాణం జరగనుంది.