Locations: Hyderabad

  • పూర్ణచందర్ అమ్మాయిల పిచ్చోడు: స్వేచ్ఛ తండ్రి

    తెలుగు యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌పై స్వేచ్ఛ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పూర్ణచందర్ చాలా దుర్మార్గుడు, అమ్మాయిల పిచ్చోడు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. నా మనవరాలిని సైతం వేధించాడు. ఈ విషయాన్ని తన తల్లి స్వేచ్ఛతో కూడా నా మవవరాలు చెప్పుకోలేకపోయింది’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

  • ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం

    HYD: నగర శివారులోని కనకమామిడి రెవెన్యూ సర్వే నెంబర్ 510లో రూ.15 కోట్ల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఇబ్రహీం అనే వ్యక్తి కబ్జా చేసేందుకు యత్నించాడు. జేసీబీతో భూమిని చదును చేసి ఫ్రీకాస్ట్ వాల్ నిర్మించాడు. మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్ పోలీసులతో కలిసి కబ్జాను అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్, వాల్‌ను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. 

  • బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌

    రంగారెడ్డి: షెడ్యూల్‌ కులాల, గిరిజన సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు డ్రా పద్ధ తిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు అదనపు కలెక్టర్‌ ఎం.సుధీర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల ఎంపిక కోసం డ్రా తీశారు. గిరిజన సంక్షేమ శాఖలో 3, 5, 8వ తరగతులకు 22 మందిని తల్లిదండ్రుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

  • నేటి నుంచి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు

    HYD: సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బోనాల జాతరకు 15 రోజుల ముందు (ఘటోత్సవం) ఘటాల ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఘటాలకు సంబంధించిన సామగ్రిని కర్బలా మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి ఘటాన్ని ముస్తాబు చేస్తారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని డప్పుల దరువులతో దేవాలయానికి తీసుకువస్తారు.

  • నేటితో ముగియనున్న పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

    HYD: తెలంగాణ పాలిటెక్నిక్ ఫేజ్-1 కౌన్సెలింగ్ నేటితో ముగియనుంది. రామంతాపూర్‌లో జూన్ 24 నుంచి కౌన్సెలింగ్ బుకింగ్ ఉండి హాజరుకాలేని విద్యార్థులు ఈరోజు హాజరు కావచ్చని Sr. లెక్చరర్ అజయ్ తెలిపారు. ఏదైనా డాక్యుమెంట్ కోసం ఆగిపోయిన వారు ఒకసారి రామంతాపూర్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సంప్రదించాలని సూచించారు. పాలిటెక్నిక్ చేయాలనుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

  • అక్రమ నిర్మాణాలపై చర్యలకు వినతి

    మేడ్చల్: గౌతమ్ నగర్ డివిజన్‌లో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్మాణాల తొలగింపుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేకల రాము యాదవ్, బైరు అనిల్, సూర్య ప్రకాష్, హబీబ్, సిద్ధులు పాల్గొన్నారు.
  • ఒకే పేరుతో మూడు హాస్పిటల్స్

    మేడ్చల్: కీసరలో కేసరి హాస్పిటల్ నిర్వహణలో తీవ్ర అవకతవకలు బయటపడ్డాయి. ముగ్గురు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో నమోదైన ఈ హాస్పిటల్ పేరును ఉపయోగించి, నాగారంలో రెండు క్లినిక్స్, కీసరలో ఒక పోలీక్లినిక్ నడుపుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. డాక్టర్ సి.ఉమాగౌరీ ఆకస్మిక తనిఖీలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఒకేపేరుతో బహుళ హాస్పిటల్స్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
  • పోలీసుల స్పెషల్ డ్రైవ్

    HYD: రాచకొండ కమిషనరేట్‌లోని మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్నవారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలు, బాక్స్ క్రికెట్ పేరుతో రాత్రి ఒంటిగంట తర్వాత బయట తిరుగుతున్న 120 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్పా అర్ధరాత్రుల్లు బయటుకు రావొద్దని సూచించారు.
  • HYDలో అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

    పశ్చిమ దిశనుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఈక్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రివరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.9 డిగ్రీలు, గాలిలో తేమ 44 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 24గంటల్లో గ్రేటర్‌లోని పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు.

  • హైదరాబాద్​లో పెరుగుతున్న కూరగాయల ధరలు

    TG: హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రైతు బజార్లలోనూ వాటి నాణ్యతను బట్టి కిలో రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో కూరగాయల లభ్యత తక్కువగా ఉందని, ఈ కారణంతోనే ధరలు పెరిగినట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇదే పరిస్థితి మరి కొంతకాలం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.