Locations: Hyderabad

  • అంగట్లో పెట్టి అమ్మేస్తున్న అధికారులు

    HYD: ఇంటి నంబర్లను అధికారులు అంగట్లో పెట్టి అమ్మేస్తున్నారు. అడిగినంత ఇస్తే ఖాళీ స్థలానికి కూడా ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయం బరితెగింపే ఇందుకు నిదర్శనం. చట్టవిరుద్ధంగా జారీ చేసిన నంబర్లు భూ ఆక్రమణకు దారితీస్తాయి.  భూ ఆక్రమణలకు ఊతమివ్వటం, కబ్జాదారులకు వెన్నుదన్నుగా నిలుస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

  • పోలీసులకు లొంగిపోయిన పూర్ణచందర్ నాయక్

    HYD: తెలుగు యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ నాయక్ పోలీసులకు లొంగిపోయారు. నిన్న రాత్రి 11గంటల సమయంలో తన లాయర్‌ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అతడిపై పోలీసులు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కాగా తమ కుమార్తె సూసైడ్‌కు పూర్ణచందరే కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • విస్తృతంగా పెరుగుతున్న ఈ-కామర్స్‌ కొనుగోళ్లు

    HYD: ఈ-కామర్స్‌ కొనుగోళ్లు విస్తృతంగా పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు కొత్త దందా మొదలుపెట్టారు. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థల పేరుతో లక్కీ డ్రా, స్క్రాచ్‌ కార్డు అంటూ రూ.లక్షలు కొట్టేస్తున్నారు. లక్కీడ్రాలో భాగంగా తాము చెప్పినట్లుచేస్తే నగదు, కారు,విదేశీ విహారయాత్రలకు ఎంపికవుతారంటూ మోసగిస్తున్నారు.నగరంలో కొద్దిరోజులుగా ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోంది.  ఈ-కామర్స్‌ సంస్థల వినియోగదారుల డేటా కొట్టేస్తున్న నేరగాళ్లు ప్రజల్ని సంప్రదిస్తూ డబ్బు కొల్లగొడుతున్నారు.

  • నగరంలో చేపట్టనున్న ఎలివేటెడ్‌ కారిడార్ల పనులు

    HYD: నగరంలో చేపట్టనున్న రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల పనులు ఇక చకచకా ముందుకు సాగనున్నాయి. వీటి నిర్మాణంలో కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ కమాండర్‌లో హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ రవీందర్,రక్షణశాఖ నుంచి తెలంగాణ,ఆంధ్ర సబ్‌ ఏరియా బ్రిగేడియర్‌ ఎస్‌.రాజీవ్‌ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశారు. శామీర్‌పేట్‌ వైపు కారిడార్‌ పనులు కూడా మొదలు కానున్నాయి.

  • ఘనంగా ఉజ్జయిని మహాకాళి బోనాలకు ఏర్పాట్లు

    HYD: ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు, రంగం నిర్వహణకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌ అధికారులకు ఆదేశించారు. జూలై 13, 14 తేదీల్లో ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలు, రంగం నిర్వహణ ఏర్పాట్లపై దేవాదాయ కమిషనర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్, జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరితో కలిసి ఆలయం వద్ద సమీక్ష నిర్వహించారు.

  • డిగ్రీలో మరో 85వేల మందికి సీట్లు

    HYD: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) మూడో విడత సీట్లను కేటాయించారు. ఇందులో డిగ్రీ ఫస్టియర్‌లో మరో 85,680 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన, దోస్త్‌-25 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ..  దోస్త్‌ మూడు విడతల్లో సీట్లు పొందినవారంతా జూలై 1లోగా కాలేజీలో నేరుగా రిపోర్ట్‌ చేయాలని, లేకపోతే సీటు కోల్పోయినట్టేనని స్పష్టంచేశారు.

  • విద్యార్థి ఆత్మహత్య

    HYD: గోల్కొండ పీఎస్ పరిధిలోని షేక్‌పేట సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలలో హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక ప్రభాస్(18) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జహీరాబాద్‌కు చెందిన మహిపాల్ కుమారుడైన ప్రభాస్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో చేరాడు. ముభావంగా ఉంటూ ఇంటికి వెళ్లాలని ప్రిన్సిపల్‌కు చెప్పగా తండ్రికి సమాచారం అందించాడు. తండ్రి రాకముందే ప్రభాస్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • ‘వర్షాల సమాచారానికి హైడ్రా స్పెషల్ టీం’

    TG: వర్షాలకు సంబంధించి సరైన సమాచారం ఇచ్చేందుకు హైడ్రా స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. హైడ్రా, IMD, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్, TG స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, IIT హైదరాబాద్‌తో కలిసి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఈ విభాగాలు వర్షాన్ని అంచనా వేసి, యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తాయని తెలిపారు.

  • ఇండికా కారులో మంటలు

    HYD: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి ఇండికా కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో కోసం CLICK HERE

  • గిడ్డంగుల స్థలాలకు డిమాండ్‌ పెరుగుదల

    మేడ్చల్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాలకు డిమాండ్‌ పెరిగింది. 2024లో 51 లక్షల చ.అ.వేర్‌హౌస్‌ లావాదేవీలు జరిగాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, లాస్ట్‌మైల్‌ డెలివరీలతో డిమాండ్‌ పెరిగింది. మ్యానుఫాక్చరింగ్‌ విభాగం 39% వాటాతో అగ్రస్థానంలో ఉంది. మేడ్చల్‌ క్లస్టర్‌లో 61% లావాదేవీలు జరిగాయి. గ్రేడ్‌-ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.19-21, గ్రేడ్‌-బీ రూ.16-19గా ఉంది. PLI స్కీమ్‌ కారణంగా సెల్‌ఫోన్‌, ఆటోరంగాల వల్ల డిమాండ్‌ పెరిగింది.