Locations: Hyderabad

  • శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంప్

    HYD: బోయిన్‌పల్లిలోని పెన్షన్ లైన్ వాలీబాల్ గ్రౌండ్‌లో ఈ నెల 30న  శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్‌క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. మారేడ్‌పల్లి లయన్స్ క్లబ్ సహకారంతో జరిగే ఈ క్యాంప్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ, కంటిపరీక్షలు, అవసరమైన ఆపరేషన్లు ఉంటాయని, ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్‌కు విరాళం అందజేశారు.

  • టాక్స్ ఫైల్లింగ్ ఇండియాకు ‘ఐకాన్ ఎక్స్‌లెన్స్ అవార్డ్’

    HYD: పన్నుల చెల్లింపు విధానాన్ని సులభతరం చేస్తూ ప్రజలకు, వ్యాపార సంస్థలకు పారదర్శకమైన సేవలు అందిస్తున్న టాక్స్ ఫైల్లింగ్ ఇండియా సంస్థకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో ఆర్థిక నిబద్దతను ప్రోత్సహించే దిశగా సంస్థ సీఈఓ చల్లూరి శ్రీనివాస్‌ చేస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన ఐకాన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ -2025 ప్రదానోత్సవాల్లో శ్రీనివాస్‌కు ‘హైయెస్ట్ టాక్స్ ఫైలర్స్ అవార్డు’ బహుకరించారు.

  • “సిమ్ లయన్” ఫిట్నెస్ జిమ్‌ను ప్రారంభించిన మాజీమేయర్

    మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో “సిమ్ లయన్” ఫిట్నెస్ జిమ్‌ను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహా రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బొమ్మక్ కళ్యాణ్, మోదుగు శేఖర్ రెడ్డి, మోదుగు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • ‘నైపుణ్యాలు పెంచుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు’

    HYD: అవకాశాల కోసం నైపుణ్యాలను పెంచుకోవాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు సూచించారు. బంజారాహిల్స్‌లో నేషనల్ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. హెచ్‌ఆర్‌ నిపుణులకు డిమాండ్‌ ఉందని, ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కీలకమని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌డీఎన్‌ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ 58 చాప్టర్లు, 21 వేల మంది సభ్యులున్నట్లు పేర్కొన్నారు.

  • న్యాయమూర్తుల బదిలీ.. సన్మాన కార్యక్రమం

    మేడ్చల్: మల్కాజ్గిరి కోర్టు నుంచి మిర్యాలగూడకు బదిలీ అయిన మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వీ.అరుణ్ తేజ్, కూకట్‌పల్లి నుంచి మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా వచ్చిన తిరుపతి, కరీంనగర్ నుంచి మూడవ అదనపు జూనియర్ జడ్జిగా వచ్చిన సరళ రేఖలను జిల్లా బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి, మహిళా న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

  • ‘చిన్న, మధ్యతరహ పరిశ్రమలకు ప్రత్యేక చర్యలు’

    మేడ్చల్: తెలంగాణలో చిన్న, మధ్యతరహ ప్లాస్టిక్ రంగ పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. చర్లపల్లి సిపెట్‌లో నిర్వహించిన రైజింగ్ ఎక్సెలరేటింగ్ MSME ప్రోగ్రామ్ అవగాహన సదస్సులో జాయింట్ డైరెక్టర్ మధుకర్‌బాబుతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రం సాంకేతిక పరిజ్ఞానం, ప్రోత్సాహకాలతో పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని, ప్లాస్టిక్‌రంగ అభివృద్ధికి సూచనలు అందించారన్నారు.

  • బీజేపీ కార్పొరేటర్లు TGSPCDL సీఎండీకి వినతిపత్రం

    మేడ్చల్: బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి, మహేందర్ TGSPCDL సీఎండీ ముషరాఫ్ ఫరూకిని కలిసి ఆరు గ్యారంటీల అమలు, సీజీజీ సాఫ్ట్‌వేర్ లోపాలు, టెక్నికల్ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 3 ఫేస్ కన్వర్షన్, కొత్త కరెంటు పోల్స్ కోసం నిధులు, GHMC-TGSPCDL సమన్వయ లోపంతో చెట్ల కొమ్మలు, గ్రీన్ వేస్ట్ తొలగింపు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఫెన్సింగ్ డిమాండ్ చేశారు.సీఎండీ స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు.

  • సీసీ రోడ్డు ప్యాచ్ పనుల ప్రారంభం

    మేడ్చల్: ఓల్డ్ మల్కాజ్గిరిలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులను కార్పొరేటర్ శ్రవణ్ అధికారులు, స్థానికులతో కలిసి ప్రారంభించారు. 80లక్షల రూపాయలతో ఓల్డ్ మల్కాజ్గిరి నుండి సర్దార్ పటేల్ నగర్ వరకు పనులు చేపడతామని, నాణ్యత పాటించాలని అధికారులను కోరారు. MRT సిబ్బందిని హైడ్రాకు అప్పగించడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. భవానీనగర్‌లో ఎంపీ లాడ్స్ బోర్‌వెల్ పూర్తయిందని తెలిపారు.

  • శ్రీ ప్రత్యంగిరాదేవి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

    రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్‌లోని శ్రీ ప్రత్యంగిరా దేవి ఆలయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలను సమీక్షించారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెతో పాటు ఆర్కేపురం డివిజన్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • న్యూస్ ఛానల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. స్పందించిన కేటీఆర్

    TG: మహా న్యూస్ ఛానల్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఎన్నటికీ ఆస్కారం ఉండకూడదని కేటీఆర్ అన్నారు. ‘‘అలానే….అబద్ధాలకు, అసందర్భ ప్రేలాపనలకు, మీడియా ముసుగులో చేసే నీచపు రాజకీయాలకు కూడా అస్సలు తావు ఉండకూడదు’’ అని ట్వీట్ చేశారు.