మేడ్చల్: యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగా భానుచందర్ (30) చర్లపల్లి ఐజీ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెయింటింగ్ కాంట్రాక్టర్ అయిన తన బావ కూతురితో సన్నిహితంగా ఉన్న విషయం బయటపడిందనే భయంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రి, భానుచందర్ భార్య మందలించారు. పంచాయితీకి హాజరు కావాలని చెప్పగా.. భార్య స్నానానికి వెళ్లిన సమయంలో భానుచందర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Locations: Hyderabad
-
ఔటర్‌లో అడ్రస్ ఉంటేనే ఆటో
HYD: తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 65,000 ఎకో-ఫ్రెండ్లీ ఆటో పర్మిట్లను విడుదల చేసింది. ఇందులో 20,000 ఎలక్ట్రిక్, 10,000 ఎల్పీజీ, 10,000 సీఎన్‌జీ, 25,000 రిట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్నాయి. రవాణా కమిషనర్ కే.సురేంద్రమోహన్ విధి విధానాలు జారీచేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రెండుఅడ్రస్ ధ్రువీకరణ పత్రాలతో డీలర్లను సంప్రదించాలి. 24 గంటల్లో అనుమతులు జారీఅయ్యాక 60రోజుల్లో ఆటో కొనుగోలు చేయవచ్చని, పాతపర్మిట్‌లపై కొనుగోలుకు వీలులేదని పేర్కొన్నారు.
-
మహా టీవీ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి
HYD: మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో KTR పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని మహాటీవీ ఆఫీస్‌పై కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఈ దాడిలో కార్యాలయ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
-
కార్మిక సమస్యలపై చర్చ
మేడ్చల్: హైదరాబాద్ మల్లాపూర్‌లోని జొప్లా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు, కార్మిక యూనియన్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి ఎంప్లాయిస్ యూనియన్ సమస్యలపై కంపెనీ ఎండీ శ్రీనివాస్‌తో చర్చించారు. INTUC జెండా ఆవిష్కరణ, అగ్రిమెంట్, ఇంక్రిమెంట్‌పై చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కార్మికుల అభివృద్ధికి నిరంతరం పోరాడతానని శ్రీశైలం హామీ ఇచ్చారు.
-
ఆలయాల అభివృద్ధికి కార్పొరేటర్ కృషి
మేడ్చల్: చర్లపల్లి డివిజన్‌లో దేవాలయాల అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతుశ్రీదేవి యాదవ్, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం సమర్పించారు.కుషాయిగూడ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం, పెద్దచర్లపల్లి రామాలయం షెడ్ నిర్మాణం, చిన్నచర్లపల్లి మహంకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి నిధుల కేటాయింపు కోరారు. మంత్రి సురేఖ స్పందించి.. త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీఇచ్చారు.
-
“సిమ్ లయన్” ఫిట్నెస్ జిమ్‌ను ప్రారంభించిన ఇంఛార్జ్
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో “సిమ్ లయన్” ఫిట్నెస్ జిమ్‌ను మేడ్చల్ నియోజకవర్గం ఇంఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, పుల్లకండ్ల జంగారెడ్డి, హరినాథ్ రెడ్డి, దాన గళ్ళ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
-
రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతిని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలింపు
TG: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో రైల్వే ట్రాక్‌పై కారు నడిపి హల్‌చల్ చేసిన యువతిని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల ఆమె 7 కిలోమీటర్లు ట్రాక్‌పై కారు నడిపినట్లు అధికారులు గుర్తించారు. అదుపులోకి తీసుకునే సమయంలో ఆమె పోలీసులపై రాళ్ల దాడి చేసింది. ఈ సంఘటనల ఆధారంగా శంకర్‌పల్లి పోలీసులతో పాటు రైల్వే పోలీసులు కూడా ఒక కేసు నమోదు చేశారు.
-
కాలనీ సమస్యలు తప్పక పరిష్కరిస్తా
మేడ్చల్: తన దృష్టికి వచ్చిన కాలనీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. సైనిక్‌పూరిలోని తన నివాసంలో కాప్రా డివిజన్‌లోని సిల్వర్ క్రెస్ట్, జనప్రియ సితారా, లోకనాథ్ ఎన్‌క్లేవ్, శాలివాహన, తిరుమల శివపురి, ఒరాంజ్ ప్రతిష్ట కాలనీల నివాసితులు ఆయనను కలిసి, నేతాజీ నగర్-కట్ట మైసమ్మ రోడ్-జనప్రియ-ఎల్లారెడ్డిగూడలో రోడ్ల ప్యాచ్ వర్క్ సమస్యలను చర్చించారు. -
సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తా
మేడ్చల్: ఉప్పల్ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్‌లో రెడ్డికాలనీ, భగవాన్‌కాలనీ, కృష్ణనగర్, MRR కాలనీలలో సరైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో నీరు బయటికి పోక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జైళ్ల డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రాను కలిసి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఆమె స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
MP లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
HYD: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న అశావహుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లుగా బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తామని చెప్పారు. కొత్తసారథి నేతృత్వంలోనే తాము స్థానిక ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.