Locations: Hyderabad

  • విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు

    హైదరాబాద్‌లో వాతావరణ మార్పుల కారణంగా వైరల్‌ జ్వరాలు పెరిగాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నారాయణగూడలోని ఒక డయాగ్నోస్టిక్ కేంద్రంలో రోజుకు 15-20 డెంగీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, కాచిచల్లార్చిన నీటిని తాగడం, వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

     

  • అట్టహాసంగా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర షురూ

    HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అట్టహాసంగా మొదలైంది. వేలాది మంది భక్తులు, మేళ తాళాల మధ్య వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు తరలిస్తున్నారు. యాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రోడ్లపైన నిలిచిపోయారు. నగరంలోని ప్రధాన మార్గాలన్నీ ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో మారుమోగుతున్నాయి. సాంకేతిక కారణాల వల్ల శోభాయాత్ర రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.

  • గణేశ్ నిమజ్జనానికి 26 ప్రత్యేక కుంటలు

    HYD: గణేశ్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 26 ప్రత్యేక కుంటలను సిద్ధం చేసింది. వీటిలో పది బేబీపాండ్స్, ఎనిమిది పోర్టబుల్ ట్యాంకులు, ఎనిమిది తవ్విన కుంటలు ఉన్నాయి. బేబీపాండ్స్‌లో జైపాల్ రెడ్డి స్పూర్తి స్థలి, సంజీవయ్య పార్క్,ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి. చిన్నవిగ్రహాల నిమజ్జనం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు నిమజ్జన ప్రక్రియను సులభతరం చేస్తాయని అధికారులు తెలిపారు.

     

     

  • క్రేన్ నుంచి పడిపోయిన గణనాథుడు

    HYD: సరూర్ నగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో క్రేన్ సిబ్బంది నిర్లక్ష్యంతో గణనాథుడి విగ్రహం ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిమజ్జనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. పోలీసులు అప్రమత్తమై.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

  • బ్యాటరీ వీల్‌ఛైర్‌తో మెట్రోలో ప్రయాణానికి నిరాకరణ

    హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించేందుకు బ్యాటరీ వీల్‌ఛైర్‌కు అనుమతి నిరాకరించడంతో దివ్యాంగుడైన మిట్టపల్లి శివకుమార్ ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెట్రో సిబ్బంది తనను అవమానించారని, నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే ఉండిపోయేలా చేశారని ఆయన మెట్రో ఎండీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మెట్రో సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

     

  • 1000 కెమెరాలతో పర్యవేక్షణ.. ఆకతాయిలు తస్మాత్ జాగ్రత్త!

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ట్యాంక్‌బండ్ వైపు భారీ సంఖ్యలో గణపతి విగ్రహాలు తరలివస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌తో పాటు భారీ సంఖ్యలో మఫ్టీ పోలీసులు నిఘా పెట్టారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

     

     

     

  • రేపు సాయంత్రం చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

    హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

  • హైదరాబాద్‌లో సందడిగా గణేశ్‌ నిమజ్జనాలు

    TG: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సుమారు 40 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. హుస్సేన్‌ సాగర్‌లో మొత్తం 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా చేస్తున్నారు. 30 వేలకు మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్  పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.  నిమజ్జనం సమయంలో ఆర్టీసీ బస్సులు దారి మళ్లిసున్నారు.   సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్-ప్యారడైజ్ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.

     

  • గణేశ్​ నిమజ్జనం.. హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే

    TG: హైదరాబాద్​లో అంగరంగ వైభవంగా గణేశ్​ నిమజ్జనం సాగుతోంది. . ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకుంటున్నారు.   భారీ సంఖ్యలో గణపతులు ట్యాంక్​బండ్​కు వస్తున్నాయి.  నిమజ్జనం వేళ  ఏవైనా సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు 040-27852482, 9010203626, 8712660600 నంబర్లను సంప్రదించవచ్చు.

     

  • రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్‌

    HYD: రానున్న దసరా, దీపావళి, ఛట్‌ పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ప్లాట్‌ ఫాం 10 వైపు 200 కార్ల పార్కింగ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అదనపు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని, టికెట్‌ కౌంటర్లు, ఆటోమేటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.