Locations: Hyderabad

  • ‘ఉద్యమ కళాకారులను ఆదుకోవాలి’

    రంగారెడ్డి: తెలంగాణ ఉద్యమంలో కళాకారులు ముందుండి పోరాటం చేశారని, వారికి తగిన గుర్తింపు ఇచ్చి ఆదుకోవాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, జిల్లా ఇన్‌చార్జి ముత్యాల యాదిరెడ్డి అన్నారు. కుంట్లూరు రావినారాయణరెడ్డి కాలనీలోని పార్టీకార్యాలయంలో జరిగిన ప్రజానాట్యమండలి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం సమగ్ర సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలని, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. యువకులకు తీవ్ర గాయాలు

    మేడ్చల్: జీడిమెట్ల పీఎస్ ముందు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీడిమెట్ల డీపోకి చెందిన ఆర్టీసీ బస్సు పీఎస్ వద్ద యుటర్న్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు యువకులు శివ(19),భాను(22) బైక్ అతివేగంతో వచ్చి బస్సును ఢీకోన్నారు. దీంతో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్‌ను గమనించిన సీఐ, పోలీస్ సిబ్బంది గాయపడ్డ యువకులను స్థానిక రామ్ రాజ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
  • వారంలో రూ.3,330 తగ్గిన బంగారం ధర

    HYD: గతవారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.600 తగ్గి రూ.97,420కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.550 తగ్గి రూ.89,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,17,800గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. వారం రోజుల్లో 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్‌పై రూ.3,330 తగ్గడం విశేషం.

  • పోలీసులకు థ్యాంక్స్ చెప్పిన రాజాసింగ్.. కారణమిదే!

    నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవతలను రాతి దేవుళ్లని అభివర్ణించారు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఎవరైనా హిందూ దేవుళ్లపై కామెంట్స్ చేస్తే.. వారిని అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించారు. అలాంటి వారికి స్పాట్ బెయిల్ రాకుండా శిక్షపడేలా చూడాలని కోరారు.

  • మాజీ ప్రధానికి ఘన నివాళి

    HYD: మాజీ ప్రధానమంత్రి, భారత రత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ పీవీ కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత ఐ స్క్రీనింగ్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పీవీ నరసింహారావు దేశానికి ఆర్థిక, విద్యా సంస్కరణల ద్వారా అమూల్యమైన కృషి చేశారని కొనియాడారు.
  • ప్రకృతి ఒడి.. ఉజ్జయిని గుడి

    HYD: లష్కర్ బోనాలు అనగానే గుర్తొచ్చేది సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి దేవాలయం. ఈ ఆలయం లోపల ఆవహించిన వేపచెట్టు అమ్మవారితో పాటుగా పూజలు అందుకుంటోంది. మహావృక్షంగా ఎదిగే క్రమంలో గర్భగుడి మీదుగా పైఅంతస్తులోకి వెళ్లిన చెట్టు ఏకంగా గుడి మొత్తానికి నీడనిస్తోంది. ప్రకృతి నడుమ అమ్మవారు కొలువుదీరడం విశేషం.

     

     

  • ఇందిరా క్యాంటీన్ పేరు మార్పుపై ఆందోళన

    HYD: అన్నపూర్ణ క్యాంటిన్ బదులు ఇందిరా క్యాంటిన్‌లుగా పేరు మార్చడాన్ని నిరసిస్తూ లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు భారసా కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు. భారీగా మోహరించిన పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో గేటు వద్ద ఆందోళన నిర్వహించారు.

  • సొసైటీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

    HYD: హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ నాయర్ సేవ సొసైటీ అధ్యక్షుడు సురేంద్రన్, ప్రధాన కార్యదర్శి శశి కుమార్, ట్రెజరర్ సేతుమాధవన్‌లతో కలిసి సొసైటీ ఆవిర్భావ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 100 సంవత్సరాల క్రితం మన్నతు పద్మనాభన్ స్థాపించిన నాయర్ సేవ సొసైటీ దేశవ్యాప్తంగా 8 వేల శాఖలతో సేవలు అందిస్తోందని సురేంద్రన్ తెలిపారు. 
  • కోట్ల బకాయిలపై విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

    HYD: నగరంలో సామాన్యులు కరెంట్‌ బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్‌ కట్‌ చేసే విద్యుత్‌ అధికారులు రూ.కోట్లలో బకాయి పడ్డా వారి జోలికి వెళ్ల డం లేదు. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించని సంస్థలు అధికారులను ‘కడతాం’ అంటూ తిప్పి పంపుతున్నాయి. ఫలితంగా బకాయిలు రూ.529.22 కోట్లకు చేరాయి. ఈ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

    HYD: ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఖైతలాపూర్ నుంచి బ్యాంకు కాలనీకి వచ్చే పైవంతెన సమీప ఇన్విరాన్ ఇన్‌క్లివ్, ఎస్‌బీఐ కాలనీ, ఆర్ఆర్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్, చందానాయక్ తాండాలోని కొంత భాగం వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని అల్లాపూర్ సెక్షన్ ఏఈ ఓ ప్రకటనలో తెలిపారు.