HYD: ప్రభుత్వ విద్యను విధ్వంసం చేసే విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొ.జి.హరగోపాల్ పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం 10 శాతం, రాష్ట్ర సర్కారు 20 శాతం నిధులను విద్యకు కేటాయించాలి. విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించొద్దు అన్నారు.
Locations: Hyderabad
-
ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు
HYD: హైదరాబాద్ నగరంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వేడివేడి భోజనం అందించేందుకు 150 ఇందిరమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. శిథిలావస్థలో ఉన్న రూ.5 భోజన కేంద్రాలను తొలగించి, రూ.10.7 కోట్లతో కొత్త క్యాంటీన్లను నిర్మించేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. మూడు నెలల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభమవుతాయని కమిషనర్ కర్ణన్ తెలిపారు. -
కత్తిదాడిలో యువకుడు మృతి
HYD: బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతబస్తి కిషన్‌బాగ్ ఎన్‌ఎంగూడలో జరిగిన కత్తిదాడి ఘటనలో జహీర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం యువకుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నపాటి వాగ్వివాదం ఈ దాడికి కారణమైంది. పోలీసులు ఈ ప్రాంతములో పెట్రొలింగ్ పెంచాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు. -
నకిలీ బంగారం ముఠా అరెస్ట్
మేడ్చల్: కుషాయిగూడ పీఎస్ పరిధిలోని చక్రిపురంలో అంతరాష్ట్ర నకిలీ బంగారం ముఠా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చక్రిపురంలోని ప్రియా దంత వైద్యశాలకు చికిత్స కోసం వచ్చిన ముఠా డబ్బులు లేవని ఒక కిలో బంగారాన్ని రూ.4లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు.అనుమానం వచ్చిన డాక్టర్ ప్రియా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా బంగారం నకిలీదని తేలింది. -
పిల్లలను బడికి పంపే బాధ్యత అందరిదీ
HYD: మారేడ్‌పల్లిలోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సీఆర్‌పీఎఫ్, తల్లుల సంఘం, ఎంవీ ఫౌండేషన్ మండల సమావేశం నిర్వహించాయి. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో 289 బాల కార్మికులు బడికి దూరంగా ఉన్నారని, వారిని పాఠశాలకు పంపే బాధ్యత అందరిదీనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్య అందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. -
జీహెచ్ఎంసీ ZCకి సమ్మె నోటీసు
HYD: జులై 9న జాతీయ కార్మిక సంఘాలు చేపట్టనున్న సార్వత్రిక సమ్మె నేపథ్యంలో రాష్ట్ర కార్మిక సంఘాల ప్రతినిధులు జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, బేగంపేట్ డిప్యూటీ కమిషనర్‌డాకు నాయక్‌లకు సమ్మె నోటీసు అందచేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో నగర సీఐటీయూ నాయకులు ఏం.దశరథ్, ఏం.అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
మేడ్చల్: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అశోక్‌నగర్‌లో నివసిస్తున్న తెలంగాణ జాగృతి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షఫీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడంలో ఎంతగానో కృషి చేశారు. షఫీ పుట్టినరోజు సందర్భంగా కవిత స్వయంగా వారి ఇంటికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఫ్యాన్సీ నంబర్ల జోరు.. రవాణాశాఖకు కాసుల వర్షం
TG: తెలంగాణ రవాణాశాఖకు ఫ్యాన్సీ నంబర్ల ద్వారా భారీ ఆదాయం లభించింది. ఒక్క రోజే ఖైరతాబాద్ రవాణాశాఖకు రూ.42,10,844 ఆదాయం సమకూరింది. అత్యధికంగా TG09F 9999 నంబర్‌ను రూ.12,00,0000కి కీ స్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. TG09G 0001 నంబర్‌ను రూ.5,66,111కి ఎన్.స్పిరా మేనేజ్‌మెంట్ సర్వీసెస్, TG09G 0009 నంబర్‌ను రూ.5,25,000లకు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్, TG09G 0006 నంబర్‌ను రూ.3,92,000లకు సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ కైవసం చేసుకుంది.
-
సికింద్రాబాద్ ఎలివేటర్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్
TG: హైదరాబాద్లోని సికింద్రాబాద్ ఎలివేటర్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ డిఫెన్స్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరగనుంది. ఒప్పందం ప్రకారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి బోయిన్‌పల్లి వరకు కారిడార్ నిర్మాణం జరగనుంది. సికింద్రాబాద్ ఎలివేటర్ కారిడార్ కోసం డిఫెన్స్ ల్యాండ్స్‌ను అధికారులు కేటాయించారు.
-
నేడు కొత్త ఫ్లై ఓవర్ ప్రారంభం
HYD: ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన PJR ఫ్లైఓవర్ను నేడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఊరట లభించనుంది. ORR నుంచి కొండాపూర్ వరకు 1.2 కి.మీ పొడవున్న ఈ అత్యాధునిక మల్టీ-లెవల్ ఫ్లైఓవర్‌ను రూ.182.72కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 24 మీటర్ల వెడల్పుతో ఆరులేన్లతో ఉంటుంది.