Locations: Hyderabad

  • మంజీరా డ్యాంకు పగుళ్ల వార్తలు అవాస్తవం : రాహుల్ బొజ్జా

    TG: మంజీరా ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చాయనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా స్వయంగా ఆయనే మంజీరా డ్యామ్‌కు వెళ్ళి పరిశీలించారు. డ్యాంకు ఎలాంటి పగుళ్లు లేవని, ప్రాజెక్టు ఆప్రాన్ మాత్రమే కొట్టుకుపోయిందని, అది సాధారణ విషయం అన్నారు. చిన్నచిన్న మరమ్మత్తులు తప్పా ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

  • టీవీ యాంకర్ సూసైడ్

    TG: ప్రముఖ టీవీ యాంకర్ సూసైడ్ చేసుకుంది. టీ న్యూస్‌లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ జవహర్ నగర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చిక్కడపల్లి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె బాడీని పోలీసులు గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్ నగర్‌లో నివాసం ఉండేది. స్వేచ్ఛ గత 18 ఏళ్లుగా న్యూస్ ఛానెల్స్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది.

  • హెల్మెట్ అవగాహన ర్యాలీ

    రంగారెడ్డి: మహేశ్వరం ట్రాఫీక్ ఏసీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ సాగర్ రహదారిపై హెల్మెట్ ఆవగాహన ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల్లో ప్రాణనష్టం జరుగుతోందని, హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. హెల్మెట్ లేని వాహనదారులకు ఫైన్ విధించకుండా హెల్మెట్లు అందజేశారు.కార్యక్రమంలో సీఐ గురు నాయుడు, ఎస్ఐ సాయినాథ్ గౌడ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

  • 14 ఏళ్ల బాలుడు అదృశ్యం

    మేడ్చల్: ఘట్‌కేసర్ పీఎస్ పరిధిలోని కొండాపూర్‌లో 9వ తరగతి విద్యార్థి దినేష్ రెడ్డి(14) తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమయ్యాడు. చదవమని తల్లి మందలించిన తర్వాత ఆమె పనికి వెళ్లగా.. ఇంటికి తిరిగి వచ్చేసరికి దినేష్ కనిపించలేదు. తండ్రి మల్లారెడ్డికి సమాచారం అందించగా.. ఆచూకీ తెలియకపోవడంతో ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
  • పార్క్ కబ్జా నివారణకు హైడ్రా సత్వర చర్యలు

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్‌లోని రుక్మిణి ఎస్టేట్ సర్వే నంబర్లు 218 & 214/Aలో హుడా లేఔట్ పార్క్ స్థలం అక్రమ కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వేగంగా స్పందించారు. అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌కు చర్యలు తీసుకోవాలని రంగనాథ్ ఆదేశించారు. అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.స్థానికులు, అసోసియేషన్ సభ్యులు రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

  • అర్ధరాత్రి కత్తులతో దాడి

    రంగారెడ్డి: వనస్థలిపురం పీఎస్ పరిధిలోని సామనగర్ ప్రాంతంలో ఓ బార్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొందరు యువకులు అర్థరాత్రి ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ‘స్ట్రీట్ వెండర్స్‌పై కర్కశంగా వ్యవహరిస్తున్నారు’

    HYD: మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత ట్రాఫిక్ పోలీసులు స్ట్రీట్ వెండర్స్‌పై కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా వ్యాపారం చేస్తున్న వారిని తొలగించడం అన్యాయమన్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం వద్ద వ్యాపారులతో కలిసి నిరసన తెలిపారు. జోనల్ కమిషనర్ పిర్యాదుల కోసం సమయం ఇవ్వడం లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

  • షేక్ బిక్కన్ షా ఓబీసీ సెల్ కన్వీనర్‌గా నియమకం

    మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ ఛైర్మన్ గువ్వ రవి ముదిరాజ్, కాంగ్రెస్ ఇంఛార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో షేక్ బిక్కన్ షాను ఓబీసీ సెల్ కన్వీనర్‌గా నియమించారు. ఈసందర్భంగా హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ షేక్ రఫీయాబేగం,తదితరులు పాల్గొన్నారు.

  • పెళ్లి ఫోటో కోసం వెళ్లి వచ్చేలోపు చోరీ

    మేడ్చల్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని కావేరి నగర్‌లో నివాసముంటున్న అర్జున్ గౌడ్ ఈ రోజు ఉదయం పెళ్లి ఫోటో కోసం బయటకు వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి, 4 తులాల బంగారం, నగదు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించగా.. క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • ‘పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత’

    మేడ్చల్: 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్ చంద్రప్రకాశ్ నేతృత్వంలో తడి, పొడి చెత్త వేరుచేయడం, పరిసరాల పరిశుభ్రతపై ఇంటింటికీ అవగాహన కల్పించారు. డెంగ్యూ, మలేరియా నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చెత్తను వేరుచేసి అందజేయాలని, నీరు నిల్వ లేకుండా చూడాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ రెడ్డి, రామచందర్, తదితరులు పాల్గొన్నారు.