Locations: Hyderabad

  • రేషన్ కార్డుల జారీలో అడ్డంకులు

    HYD: కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిరుపేదల కోసం కొత్త రేషన్ కార్డుల జారీకి చేపట్టిన చర్యలకు ధన్యవాదాలు తెలిపారు. గత 10 ఏండ్లుగా ఎదురుచూసిన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైనప్పటికీ, DCSO మరియు e-KYC సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈసమస్యలను తక్షణం పరిష్కరించి రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

     

  • ‘విజయ్ దేవరకొండ సినిమా బాయ్‌కాట్ చేయాలి’

    HYD: నటుడు విజయ్ దేవరకొండపై SC, ST అట్రాసిటీ కేసు నమోదైందని గిరిజన సంఘాల ప్రతినిధులు తెలిపారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్.. పాకిస్థాన్ టెర్రరిస్టుల్లో వ్యవహరించారంటూ విజయ్ వ్యాఖ్యానించి తమను అవమానించారని పేర్కొన్నారు. దేశానికి మార్గం చూపింది గిరిజనులు అన్న విషయాన్ని విజయ్ గుర్తంచుకోవాలని స్పష్టం చేశారు. ఆయన సినిమాలను సోషల్ బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. వీడియో కోసం CLICK HERE.

  • సున్నం చెరువు నీటిలో సీసం కాలుష్యం.. హైడ్రా హెచ్చరిక

    HYD: నగరంలోని 6 చెరువుల పునరుజ్జీవనానికి హైడ్రా కృషి చేస్తోంది. మొదటి దశలో మాదాపూర్‌లోని సున్నం చెరువుపై దృష్టి సారించి, కాలుష్య నియంత్రణ మండలితో కలిసి నీటి నమూనాలను పరీక్షించింది. భూగర్భజలాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం, ముఖ్యంగా 12 రెట్లు అధిక సీసం ఉన్నట్లు హైడ్రా వెల్లడించింది. నిత్యావసరాలకు కూడా ఈ నీటిని వినియోగించవద్దని హెచ్చరించింది.

  • యాగశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

    మేడ్చల్: ఈనెల 29 ఆదివారం గౌతమ్ నగర్ డివిజన్‌లోని గోపాల్ నగర్ వరసిద్ధి వినాయక ఆలయంలో నూతన యాగశాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరుతూ.. ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసారు. ఆయన క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు.

  • అందుకే నగ్న వీడియోలు అమ్ముకున్నాం: అంబర్‌పేట్ దంపతులు

    HYD: తమ నగ్న వీడియోలు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారంటూ అంబర్‌పేట్‌కు చెందిన దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమ కూతుళ్ల చదువు కోసమే తాము ఇలా చేశామని ఆ దంపతులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. పెద్ద కూతురు బీటెక్‌ సెకండియర్‌ చదువుతుండగా, చిన్న కూతురుకు ఇంటర్‌లో 468/470 మార్కులొచ్చాయి. ఆటో డ్రైవరైన భర్తకు జబ్బు చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఇలా చేశామని భార్య వాపోయినట్లు సమాచారం.

  • మున్సిపల్ కమిషనర్‌ను సన్మానించిన CPM బృందం

    మేడ్చల్: దమ్మైగూడ మున్సిపల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకట్ రెడ్డిని సీపీఎం పార్టీ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సన్మానించి, హరితహారం మొక్కను బహుకరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.వినోద్, కీసర మండల కార్యదర్శి బంగారు నర్సింగరావు, చింతకింది అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • సమ్మె వాల్ పోస్టర్ విడుదల

    మేడ్చల్: కీసర మండల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి సీఐటీయూ జిల్లా నాయకుడు బంగారు నర్సింగరావు వాల్ పోస్టర్ విడుదల చేశారు. సమ్మెద్వారా తమ హక్కుల కోసం పోరాటం బలోపేతం చేయాలని నర్సింగరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కుందనపల్లి, శ్రీరామలింగేశ్వర స్వామి కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల మున్సిపల్ వర్కర్స్ పాల్గొన్నారు.

     

  • డీసీపీ ఆఫీస్‌కు వెళ్లిన సినీనటి రమ్యశ్రీ

    HYD: గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీస్‌కు సినీనటి రమ్యశ్రీ వెళ్లారు. ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయిస్‌ కో-ఆపరేటివ్‌ హౌజింగ్‌ సొసైటీ(ఎఫ్‌సీఐ) లేఅవుట్‌లో ఉన్న తన ఫ్లాట్‌కు రక్షణ కల్పించాలని డీసీపీని కోరారు. ఇటీవల సంధ్యా కన్వెన్షన్‌ యజమాని శ్రీధర్‌రావు తనపై, తన సోదరుడిపై దాడి చేశారని ఆమె కేసు పెట్టారు. శ్రీధర్ అనుచరులు లాక్కున్న తన ఫోన్‌ను తిరిగి తనకు ఇప్పించాలని అభ్యర్థించారు.

  • పేరుకు తగ్గట్టే.. రిటైర్డ్‌ ఉద్యోగి ధర్మారావు దాతృత్వం

    మేడ్చల్: ఏలూరుకు చెందిన బీ.ధర్మారావు మూసాపేటలో నివాసముంటూ 2004 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలు, యూనిఫామ్‌లు, ఫీజులు అందిస్తున్నారు. దివంగత భార్య హైమావతి జ్ఞాపకార్థం 2021 నుంచి బబ్బుగూడ, యూసఫ్‌గూడ, వెంగళరావునగర్‌లోని పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 120 మంది పదో తరగతి విద్యార్థులకు రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

  • ‘కన్నప్ప’ సినిమాను వీక్షించిన YS విజయమ్మ

    మంచు విష్ణు హీరోగా న‌టించిన ‘కన్నప్ప’ సినిమాను వైసీపీ అధినేత జగన్ తల్లి YS విజయమ్మ వీక్షించారు. హైదారాబాద్‌లోని ఏషియ‌న్ మ‌హేశ్ బాబు మాల్‌(AMB)లో మంచు విష్ణు భార్య విరానికాతో కలిసి విజయమ్మ కూడా కన్నప్ప సినిమా చూశారు. సినిమా అనంత‌రం విజయమ్మ బ‌య‌టికి వెళుతున్న వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.