మేడ్చల్: ఇంజినీరింగ్ కళాశాలల ఫీజు మోసాలపై తీసుకుంటున్న కఠిన చర్యలకు మద్దతుగా స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం జేఎన్టీయూహెచ్ కూకట్‌పల్లి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ లెటర్ పంపింది. ప్రైవేట్ కళాశాలల్లో అఫిలియేటింగ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తనిఖీలు, ఫీజు ఫిక్సేషన్ కమిటీ నివేదికలను పబ్లిక్ డొమెయిన్‌లో ఉంచాలని, తప్పుడు సమాచారం ఇచ్చిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Locations: Hyderabad
-
మైసమ్మ దేవస్థానంలో ఎమ్మెల్యే పూజలు
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని డి.పోచంపల్లి మున్సిపాలిటీ సారెగూడెంలో శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవస్థానం 6వ వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో బొంగునూరి శ్రీనివాసరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
-
గోల్కొండ అమ్మవారికి లాల్ దర్వాజా బంగారు బోనం
HYD: ఆషాడమాస బోనాల సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయ అధ్యక్షుడు మారుతి యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబికకు బంగారు బోనం, పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. భజా భజంత్రీల మధ్య ప్రత్యేక పూజల అనంతరం బోనం ఊరేగింపుగా బయలుదేరింది. గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించడం గర్వకారణమని మారుతి యాదవ్ పేర్కొన్నారు.
-
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
HYD: రాంగోపాల్ పేట డివిజన్‌లో రూ.1.36 కోట్ల విలువైన అభివృద్ధి పనులను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కృష్ణా నగర్‌లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, వెంకట్రావ్ నగర్, కళాసిగూడ, ఖండోజి బజార్, రాణి గంజ్‌లో సీసీరోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కళాసిగూడలో ట్రాన్స్‌ఫార్మర్‌లకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు.
-
బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
HYD: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జాయినీ మహాకాళి ఆలయంలో జులై 13న నిర్వహించే బోనాల ఉత్సవాలకు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసిప్రసాదాలు అందించారు. ఉత్సవ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న తలసాని,సాంప్రదాయ విధానాలను అనుసరించి గందరగోళం లేకుండా నిర్వహించాలని సూచించారు.
-
బోనాల ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్
మేడ్చల్: మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఏల్.బీ నగర్, మూడు గుళ్ళలో పర్యటించారు. ఏల్.బీ నగర్‌లో సీసీ రోడ్డు ప్యాచ్ వర్క్‌లను పరిశీలించి, అమ్మవారి గుళ్లు, బోనాల మార్గంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. మూడు గుళ్ళ దేవాలయంలో బోనాల ఏర్పాట్లపై చర్చించారు. సీవరేజ్, లైటింగ్, శానిటైజేషన్, మంచినీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
-
జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
HYD: సికింద్రాబాద్ సంగీత్ సర్కిల్‌లోని ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథ యాత్రను మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు హరే రామ, హరే కృష్ణ నామజపంతో నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో డోలికల్లో ఆటపాటలతో అలరించారు.
-
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి
HYD: హెలెన్ కెల్లర్ 145వ జయంతి సందర్భంగా మలక్‌పేటలోని వికలాంగుల, వృద్ధుల కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. వికలాంగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
-
‘క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే ప్రపంచ స్థాయికి ఎదుగుతాం’
HYD: క్రీడాకారులను ప్రోత్సహిస్తేనే ప్రపంచ స్థాయికి ఎదుగుతారని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి బ్యాడ్మింటన్ అసో సియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఆర్ ఆర్సీ ఇండోర్ బ్యాడ్మింటన్ అకాడమీలో తెలంగాణ రాష్ట్ర సీనియర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల మెయిన్ డ్రా ప్రారంభ కార్యక్రమం జరిగింది. మేడ్చల్-మల్కాజిగిరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
-
సైబర్‌క్రైమ్ బాధితులకు రిఫండ్
మేడ్చల్: నేరేడ్మెట్ పీఎస్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసుల్లో 22 మంది బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు రూ.2,49,377రిఫండ్ చేశారు.నేడు పీఎస్‌లో బాధితులకు ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ ప్రక్రియలో హెడ్ కానిస్టేబుల్ శ్రీ కాంతయ్య, శ్రీమతి నాగలత, కానిస్టేబుల్ రఘు, కుమారి స్వప్నాలను అభినందించారు. సైబర్‌క్రైమ్ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధితులైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.