Locations: Hyderabad

  • బెగ్గర్‌ ఫ్రీ హైదరాబాద్‌ దిశగా..

    HYD: గ్రేటర్‌‌లోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రదేశాల్లో యాచకులను గుర్తించి షెల్టర్‌ హోమ్‌లకు లేదా సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమానికి GHMC శ్రీకారం చుట్టింది. కమిషనర్‌ RVకర్ణన్‌ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా GHMC అర్బన్‌ కమ్యూనిటీ విభాగం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌, సెక్రటరియేట్‌, నాంపల్లి తదితర ప్రాంతాల్లోని జంక్షన్ల వద్ద ఉండే యాచకులు, ఫుట్‌పాత్‌లపై ఉండే 19మందిని గుర్తించి షెల్టర్‌ హోమ్‌లకు తరలించారు.

  • దరఖాస్తుల పరిష్కారానికి గడువు

    రంగారెడ్డి: జిల్లాలో భూభారతి సదస్సుల ద్వారా స్వీకరించిన 21,000 దరఖాస్తులను వచ్చే నెల 10వ తేదీలోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ గడువులోగా దరఖాస్తులను పరిష్కరించడం తహసీల్దార్లకు సవాల్‌గా మారింది. ఈ దరఖాస్తులు కొన్నేళ్లుగా కార్యాలయాల్లో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి సాధ్యాసాధ్యాలపై తహసీల్దార్లు తీవ్రంగా చర్చిస్తున్నారు.

  • మిసెస్‌ ఆసియా వరల్డ్‌ 2025 విజేతగా సూర్య రేవతి

    HYD: యునైటెడ్‌ స్టేట్స్‌, భారతదేశం అంతటా 16ఏళ్లకుపైగా సామాజికసేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గాను ‘మిసెస్‌ ఆసియా వరల్డ్‌ విన్నర్‌ 2025 కిరీటాన్ని పొందినట్లు మనస్వ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ సూర్య రేవతి మెట్టుకూరు తెలిపారు. ఈ నెల 22న దుబాయ్‌లో జరిగిన ఒక గ్రాండ్‌ అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ గౌరవం దక్కిందని అన్నారు.

  • యువకుడి ఆత్మహత్య

    మేడ్చల్: పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్‌బీ కాలనీలో ఇస్నాపూర్‌కు చెందిన గౌతం(27) తన బెడ్‌రూంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మునీరాబాద్‌లోని ఐఎఫ్‌బీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్న గౌతంకు భార్య శ్రీదేవి(23), ఐదునెలల బాలుడు ఉన్నారు. స్థానికుల సమాచారంతో మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
  • ఎల్లమ్మ కల్యాణోత్సవ టికెట్ల విక్రయంలో గందరగోళం

    HYD: జులై 1న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవ టికెట్ల విక్రయం గందరగోళంగా మారింది. దేవస్థానంలోని కార్యాలయంలో వీటిని విక్రయించారు. దీంతో టికెట్ల కోసం వచ్చిన భక్తులు వాటిని పొందాలన్న ఆత్రుతతో తోసుకునే పరిస్థితి నెలకొంది. 53 టికెట్లు మాత్రమే విక్రయించారు. గతసంవత్సరం 250 టికెట్లు విక్రయించగా(ఒక్కో టికెట్‌పై ఇద్దరికి అనుమతి)వాటిని ఈసారి కుదించారు.ఇన్‌ఛార్జి ఈవో లేకపోవడంతో సూపరింటెండెంట్‌ హైమావతి భక్తులకు నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది.

  • అంధత్వంతో బాధపడేవారికి చికిత్స, శిక్షణతో స్వావలంబన

    HYD: ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల(ఎల్వీపీఈఐ) అంధత్వంతో బాధపడేవారికి చికిత్సతో పాటు స్వావలంబన శిక్షణ అందిస్తోంది. వందలాది మంది పూర్తి, పాక్షిక అంధులు ఈ శిక్షణ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ విజన్ రీహాబిటేషన్ విభాగాధిపతి డా.బ్యూలాక్రిస్టీ మాట్లాడుతూ.. 1,800 మంది స్వచ్ఛందంగా ఈకార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారని,పేదలకు ఉచిత చికిత్స, శిక్షణ అందిస్తామని,ఖర్చు భరించగలిగేవారికి నామమాత్ర ఫీజు వసూలు చేస్తామని తెలిపారు.
  • సైబర్ నేరాలు 225% పెరిగాయి: డీసీపీ కవిత

    HYD: కరోనా కాలంలో సైబర్‌ నేరాలు 225 శాతం అధికమయ్యాయని నగర సైబర్‌ క్రైం డీసీపీ డి.కవిత అన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను ఎదుర్కోవాలనే అంశంపై బేగంపేట ప్లాజా హోటల్లో సీపీపీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. 2015లో హైదరాబాద్‌లో 250 కేసులు నమోదు అయ్యాయని, కరోనా కాలంలో ఇవి 225 శాతానికి పెరిగాయని వివరించారు. 2024లో 3,111 కేసులు నమోదైనట్లు తెలిపారు.

  • ఖరీదైన కెమెరాల కొనుగోలుపై అనుమానాలు

    HYD: నగరంలోని కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో రూ.2 వేలకు మించని కెమెరాలు నాణ్యమైన ఫొటోలు తీస్తుండగా, పార్కుల్లో ఏర్పాటు చేసే కెమెరాలను రూ.20-25 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. 12 పార్కులకు 2 వేల కెమెరాలకు గరిష్ఠంగా రూ.6.50కోట్లు ఖర్చవుతుంది. నిర్వహణ ఒప్పందం ఏడాదికే పరిమితమని, రెండో ఏడాది నుంచి కెమెరాలు పనిచేయకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఉన్నతాధికారులు ఈ కొనుగోలు వ్యవహారంపై దృష్టి సారించాలి.

  • కార్యాలయాల్లో సోదాలు

    మేడ్చల్: రవాణా కార్యాలయాల ప్రాంగణాల్లో జిరాక్స్‌ షాప్‌ల మాటున కొందరు దందా నడిపిస్తున్నారు. ఉప్పల్‌ కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తుండగా దుకాణాలకు తాళాలు పెట్టి ఏజెంట్లు పరుగులు తీశారు. ఉప్పల్‌లో ఏడుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలగిరి రవాణా కార్యాలయంలోనూ పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

  • అడవి అభివృద్ధి చేసే అంశాలపై దృష్టి

    HYD: ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుండడంతో ముందుగా చెరువులో నీటి లభ్యత, బోటింగ్‌ అవకాశాలపై కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఎఫ్‌వో జ్ఞానేశ్వర్, నీటి పారుదల శాఖ డీఈ కిరణ్‌కుమార్‌ పరిశీలించారు. సందర్శకులను ఆకట్టుకునేలా వినూత్నంగా అడవిని అభివృద్ధి చేసే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. జాతీయ రహదారికి పక్కనే చెరువు ఉండడంతో బోటింగ్‌కు మంచి ఆదరణ వస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.