Locations: Hyderabad

  • 40 ఎకరాల్లో పర్యావరణ పర్యాటక అభివృద్ధి

    HYD: హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారికి పక్కనే అడవి, చెరువు ఉండడంతో బొంరాస్‌పేటను అనుకూల ప్రాంతంగా అధికారులు ఎంపిక చేశారు. ఇక్కడ 40 ఎకరాల్లో పర్యావరణ పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.8 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. నిధులు రాగానే పనులు చేయనున్నారు.

  • ‘ 51 శాతం ఫిట్‌మెంట్‌తో PRC ప్రకటించాలి ’

    HYD: ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జులై 1 నుంచి.. 51 శాతం ఫిట్‌మెంట్‌తో PRC అమలుకు చర్యలు తీసుకోవాలని TNGO రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది. ఆ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో సంఘం ఛైర్మన్‌ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్‌ తదితరులు మాట్లాడుతూ.. త్వరలో లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో TNGO 80 సంవత్సరాల ఆవిర్భావ సభను నిర్వహిస్తామని వెల్లడించారు.

  • మైనర్ బాలిక అదృశ్యం

    HYD: మెట్టుగూడకు చెందిన 17 ఏళ్ల బాలిక తల్లికి అల్పాహారం తెస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైంది. చిలకలగూడ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాలిక తల్లి జీ.మహేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనుదీప్ తెలిపారు. బాలిక గులాబీ రంగు చొక్క, తెలుపు జీన్స్ ధరించి, 5 అడుగుల ఎత్తుతో, తెలుగు, హిందీ మాట్లాడుతుందని గుర్తింపు ఆనవాళ్లు వెల్లడించారు.
  • రోడ్డు, డ్రైనేజ్ మరమ్మతు కోసం వినతిపత్రం

    మేడ్చల్: స్థానిక జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని అడ్మిషన్ బ్లాక్ ఆవరణలోని రోడ్డు, జేహబ్ పరిసరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ మరమ్మతు కోసం స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి నాయకులు రాహుల్‌నాయక్, దుర్గప్రసాద్ మాట్లాడుతూ.. అడ్మిషన్ బిల్డింగ్ రోడ్డు పగిలి రాళ్లు బయటికి తేలడం, అధికారుల నిర్లక్ష్యం,డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలని పలుమార్లు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు.
  • 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ బిడ్‌‌కు భారత్

    భారత్ 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ బిడ్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్, గాంధీనగర్, ఏక్తా నగర్‌లలో 23వ ఎడిషన్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో 70 దేశాల నుండి 8,500+ మంది ఫస్ట్ రెస్పాండర్లు 60+ క్రీడలలో పోటీపడతారు. ఇది భారత్‌ను క్రీడా గమ్యస్థానంగా నిలుపుతుంది.

     

     

  • ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు..

    రంగారెడ్డి: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉట్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంట్లో రెండు గంజాయి మొక్కలు పెంచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతని ఇంటి వద్దకు చేరుకుని మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అసలు పెంచిన గంజాయి మొక్కలు విక్రయిస్థాడా అనేది తెలియాల్సిఉంది. ప్రస్తుతానికి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని టెస్టింగ్ కోసం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు..

    HYD: హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇద్దరిపై గ‌చ్చిబౌలి పీఎస్‌లో కేసు న‌మోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభ‌న్‌బాబు గండిపేట మండ‌లం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించిన‌ట్టు పోలీసు స్టేష‌న్‌కు ఫిర్యాదు అందింది.  న‌లుపురంగు కారులో వ‌చ్చి ఇంటిఆవ‌ర‌ణ‌లోకి వ‌చ్చి ప‌రిశీలిస్తుండ‌గా.. ఎవ‌ర‌ని అడిగితే హైడ్రా నుంచి వ‌చ్చామ‌ని బ‌దులిచ్చార‌ని ఆ ఇంటి వ‌ద్ద ప‌నిచేస్తున్న వ్యక్తి తెలిపారు.

  • ఎమ్మెల్యేతో జీహెచ్ఎంసీ ఏసీపీ సమావేశం

    HYD: మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ నూతన అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) పావని గురువారం సితాఫల్‌మండిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా కార్యకలాపాలు నిర్వహించి, ప్రజలకు మంచి సేవలు అందించాలని పద్మారావు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమతో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
  • అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఇందిరా క్యాంటీన్లుగా మార్పు

    TG: అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనంతో పాటు అల్పాహారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, అన్నపూర్ణ కేంద్రాల శాశ్వత నిర్మాణాల పునరుద్ధరణకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని పేదలకు సరసమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే పథకాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

  • సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ప్రశంసలు

    TG: యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని యువతకు స్ఫూర్తిగా ప్రశంసించారు. “సీఎం సిగరెట్,మద్యం,డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, ఫుట్‌బాల్‌తో ఉత్సాహం పొందుతారు. ప్రధానమంత్రి మోదీ భారత్ కోసం 400 కోట్లు,సీఎం రేవంత్ 200 కోట్లు, యువత అవగాహనకు 800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. డ్రగ్స్‌తో దేశ యువత భవిష్యత్తు నాశనం కాకుండా, డెమోగ్రాఫిక్ డివిడెండ్‌ను కాపాడుదాం” అని పిలుపునిచ్చారు.