HYD: అన్ని రకాల వైద్య సేవలు ఒకే గొడుగు కింద అందించాలనే ఉద్దేశ్యంతో ఆధునిక వైద్యసేవలతో కూడిన ఐకేర్ సెంటర్‌ను బేగంపేట్‌లోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో ప్రారంభించినట్లు ఎండీ డా. ఏవీ గురువా రెడ్డి తెలిపారు. హాస్పిటల్‌లో అన్నిరకాల కంటి వైద్యసేవలకు సంబంధించిన కేంద్రాన్ని చీఫ్ ప్రసూతి, గైనకాలజిస్ట్ డా. ఏ భవాని, డా. ఎస్‌టీఎస్ మృధు వ్యాస్‌తో కలిసి ప్రారంభించారు.
Locations: Hyderabad
-
తెలంగాణ గడ్డపై డ్రగ్స్‌ను సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలకు చోటు లేదని, డ్రగ్స్‌ను సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. “మేము సామాన్య బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లం. చిరంజీవి కష్టపడి ఆదర్శంగా నిలిచారు. విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి బలికాకుండా, ఉద్యమ స్ఫూర్తితో నిలబడి, కష్టపడి విజయం సాధించాలి. తెలంగాణ గౌరవాన్ని కాపాడుదాం” అని పిలుపునిచ్చారు.
-
యువత సైనికుల్లా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి: రామ్‌చరణ్
TG: యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో నటుడు రామ్‌చరణ్ యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోరారు. “డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయి. వ్యాయామం, మంచి స్నేహాలు, విజయం, కుటుంబంతో గడిపే సమయం నిజమైన ఆనందాన్నిస్తాయి” అని అన్నారు. గతంలో స్కూళ్లదగ్గర డ్రగ్స్ అమ్మకాలు జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ, తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల కృషిని ప్రశంసించారు. యువత సైనికుల్లా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
-
ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ
మేడ్చల్: తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్, సింగాయిపల్లిలో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. పేదలందరికీ రూ.5లక్షలతో ఇళ్లు నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, విడతలవారీగా అర్హులందరికీ ఇళ్లు అందుతాయని జైపాల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ గోపాల్, హౌసింగ్ అధికారులు రమణమూర్తి,తదితరులు పాల్గొన్నారు.
-
యువతకు విజయ్ శక్తివంతమైన సందేశం!
TG: యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి నటుడు విజయ్ దేవరకొండ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా యువతకు శక్తివంతమైన సందేశాన్ని అందించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండి, విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు. “డ్రగ్స్ సమయాన్ని వృథాచేసి, మీ జీవితాన్ని నాశనంచేస్తాయి. బదులుగా,వ్యాయామం చేయండి, ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్మించుకోండి, మంచిస్నేహితులను సంపాదించండి, విజయాన్ని, ధనాన్ని, ఆశయాలను సాధించండి” అని అన్నారు.
-
పాఠశాలలను సందర్శించిన రాధికా గుప్తా
మేడ్చల్: శామీర్‌పేట్ మండలంలోని తూముకుంట, దేవరయాంజల్‌లో అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి, లక్ష్యాలను తొలిదశలోనే ఎంచుకొని ఇష్టంగా చదవాలని సూచించారు. అంగన్‌వాడీలో పౌష్టికాహారం క్రమంగా అందించాలని, గర్భిణీలకు గుడ్లు, పాలు సరఫరా చేయాలని ఆదేశించారు. నశాముక్తి భారత్ ర్యాలీలో పాల్గొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్, డీఈవో విజయకుమారి తదితరులు హాజరయ్యారు.
-
మాదక ద్రవ్యాల అవగాహన ర్యాలీ
మేడ్చల్: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జీనోమ్ వ్యాలీ పోలీసులు తుర్కపల్లి, కొల్తూర్, లాల్ గడి మలక్‌పేట్ గ్రామాల్లోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో విద్యార్థులతో అవగాహన సదస్సులు, ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా, డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవ్వాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
-
కారు భీభత్సం.. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని అత్తాపూర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా ఉన్న రెండు కార్లతో పాటు ఒక బస్సు, డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యా యి. స్థానికులు వేగంగా కారు నడిపిన డ్రైవర్‌ని చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కారు అతన్ని స్టేషన్‌కు తరలించారు.
-
కన్నన్‌ను కలిసిన కార్పొరేటర్
మేడ్చల్: జీహెచ్‌ఎంసీ కమిషనర్ కన్నన్‌ను రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు కలిసి పలు విషాయాలపై వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ కాలనీ, వెంకట సాయి నగర్, వాసవి నగర్, శ్రీనగర్ కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రగతినగర్ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం, రామంతపూర్ భగత్ స్లమ్ ఏరియాలో అభివృద్ధి, పన్నుల సౌలభ్యం గురించి చర్చించారు. కమిషనర్ వెంటనే స్పందించి, జోనల్ కమిషనర్‌తో చర్చించారు.