మేడ్చల్: కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం సుందరీకరణ పనులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలోని పురాతన ఆలయాలను పునర్నిర్మించి అన్ని మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని తెలిపారు. దేవాలయాలు బాగుంటేనే ఊరు బాగుంటుందని, దైవభక్తి మనుషుల్లో మానవత్వాన్ని పెంచుతుందన్నారు.
Locations: Hyderabad
-
రైలులో చోరీ.. నిందితుడి అరెస్ట్
HYD: లింగంపల్లి, కాకినాడ స్పెషల్ రైలులోని ప్రయాణికురాలి బ్యాగ్‌ను చోరీ చేసిన నిందితుడిని లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో సాధారణ తనిఖీల్లో పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.20లక్షల విలువైన 20తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన బల్ల సాగర్ అనిల్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
-
పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మేడ్చల్: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిరోజ్ గూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తల్లిదండ్రులు వారి ఇష్టానుసారం చదివించి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో నాయకుడు ప్రభాకర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
-
పని చేస్తున్న సంస్థకే కన్నం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్
HYD: పని చేస్తున్న సంస్థకే కన్నం వేయాలని చూసిన ఇద్దరు కేటుగాళ్లను దోమలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి మలక్‌పేట్‌కు చెందిన చిట్ ఫండ్ వ్యాపారి గోపాల్ తపరియా వారి సంస్థకు చెందిన డబ్బు దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కలెక్షన్ ఏజెంట్ జితిన్ రాజ్ యాదవ్ కావాలనే బైక్ స్కిడ్ చేసుకొని, దొంగతం జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు తేలింది.
-
రవీంద్రభారతిలో శ్రీమద్ భగవద్గీత పారాయణం
HYD: శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భగవద్గీత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ అందించే లక్ష్యంతో ప్రతి నెల రెండవ ఆదివారం రవీంద్రభారతిలో శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణం నిర్వహిస్తున్నారు. పడేసావ్, శ్రీనివాస్ యాదవ్ స్థాపించిన ఈ కార్యక్రమం సత్యం, నైతికత, భక్తి విలువలను పెంపొందిస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శనంగా నిలుస్తోంది. ప్రజలందరినీ ఈ పుణ్యకార్యంలో పాల్గొని గీతాజ్ఞానంతో జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు. -
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో ఈ సాయాన్ని మంజూరు చేయించారు. -
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పరిశీలన
మేడ్చల్: మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని నరసింహనగర్ కాలనీలోని షణ్ముఖ రెసిడెన్సీ సమీపంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. -
కోఠిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన
HYD: కోఠిలోని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఔట్‌సోర్సింగ్ నర్సులకు న్యాయమైన అవకాశాలు తొలగించిన నర్సులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన నర్సులను తొలగించడం దారుణమని కన్వీనర్ దిడ్డిసుధాకర్ డిమాండ్ చేశారు.
-
ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు
HYD: ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లు పెరిగిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
-
900మంది విద్యార్థులకు భోజనం, అల్పాహారం పంపిణీ
మేడ్చల్: జీడిమెట్ల గ్రామానికి చెందిన ఎర్రోళ్ల క్రాంతి కిరణ్ చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్పిస్తే భవిష్యత్తులో ప్రయోజకులవుతారని అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో 900 మంది విద్యార్థులకు భోజన ప్లేట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు యూ.కళ్యాణి, బీఆర్ఎస్ నాయకుడు సిద్ధిరాములు, బీజేపీ నాయకుడు బర్మానరేష్, గ్రామయువకులు పాల్గొన్నారు.