
Locations: Hyderabad
-
గుండె ఆపరేషన్‌కు ఆర్థిక సాయం
మేడ్చల్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎన్. కైసర్ రెండో కుమారుడు హసన్ సాహెబ్(10 సంవత్సరాలు) గుండెలో రంధ్రం సమస్యతో బాధపడుతున్నాడు. అతని ఆపరేషన్ కోసం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్.భాస్కర్ రెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది అందరూ కలిసి రూ.73,500 ఆర్థిక సాయం అందించారు. ఈ సహాయం హసన్ ఆపరేషన్ కోసం కీలకమైన మద్దతును అందించింది. -
ఎల్లమ్మ కల్యాణోత్సవం.. టికెట్ల జారీ ఆలస్యం
HYD: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వచ్చే నెల 1న జరగనుంది. ఈ వేడుకను కల్యాణ మండపం వద్ద తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఇందుకోసం టికెట్లను దేవస్థానం విక్రయిస్తుంది. అమ్మవారి కల్యాణోత్సవానికి మరో అయిదు రోజులే గడువున్నా ఇప్పటి వరకు దేవాదాయ శాఖ అధికారులు టికెట్లు జారీ చేయలేదు. ఈ టికెట్ల కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు రోజూ దేవస్థానానికి వస్తున్నారు.
-
రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు ప్రయాణికులు పాట్లు
మేడ్చల్: చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకునేందుకు ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో అనేక రైళ్లను చర్లపల్లికి మళ్లించడం,పలు ప్రత్యేక రైళ్లు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుండటంతో రాత్రివేళ స్టేషన్ చేరుకునేందుకు చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రి 10 దాటితే అటువైపుగా వెళ్లే ఒక్క ఆర్టీసీ బస్సు కనిపించదు. ప్రైవేటు క్యాబ్ లేదా ఆటో కోసం వెతుక్కోవాల్సిందే. దీంతో వారు అడిగినంత ఇవ్వాల్సి వస్తోంది.
-
బీజేపీ కార్యాలయంలో సమావేశం
మేడ్చల్: షాపూర్ నగర్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ సైతం ట్యాప్ చేశారు.ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న నన్ను సిట్ విచారణకు రమ్మని ఆదేశంచగా వెళ్లి హాజరయ్యానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు.
-
దాడుల నివారణ కమిటీల ఏర్పాటు
మేడ్చల్: జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీల ఏర్పాటు కోరుతూ.. తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జెయు) ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్ మెంట్(ఐ అండ్ పిఆర్) కమీషనర్ ప్రియాంకను కలసి వినతి పత్రం సమర్పించారు.జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో TSJU అధ్యక్షుడు నారగౌని పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు. -
బోనాలలో ఆకట్టుకునే పోతరాజుల విన్యాసాలు
HYD : బోనాల్లో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వారి విన్యాసాలు చూసేందుకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డుకిరువైపులా బారులు తీరి వీక్షిస్తుంటారు. ఓవైపు పోతరాజుల గీంకారాలు, కొరఢా చప్పుళ్లు.. మరోవైపు శివసత్తుల పునకాలతో ఆషాఢమాసం బోనాలు మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకోనున్నది. గోల్కొండ కోటలోని జగదాంభిక, మహంకాళి అమ్మవార్ల దర్శనానికి మొదటి బోనం రోజున వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
-
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
మేడ్చల్: కార్మికుల హక్కులను రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం.సాయిబాబా డిమాండ్ చేశారు. జూలై 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఎపిరాక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు.
-
గోల్కొండ పరిసరాల్లో ఆంక్షలు
HYD: గోల్కొండ బోనాల సందర్భంగా గోల్కొండ పరిసరాల్లో టాఫ్రిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ పేర్కొన్నారు. గోల్కొండలోకి ప్రవేశించే రామ్‌దేవ్‌గూడ మక్కయి దర్వాజా, లంగర్‌హౌజ్ ఫతేదర్వాజా, సెవెన్ టోంబ్స్ బంజారా దర్వాజా వైపు నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి ఉండదన్నారు. బోనాల పూజల సందర్భంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.
-
ఎల్లమ్మ కల్యాణోత్సవానికి ఆహ్వానం
HYD: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవానికి రావాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఆలయ అధికారులు ఆహ్వానం అందజేశారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన కార్యాలయంలో ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి, ప్రసాదాలను అందజేశారు.
-
చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన
HYD: బోనాల పండగ సందర్భంగా ట్యాంక్‌బండ్ హెచ్‌ఎండీఏ మైదానంలో బీసీ చేతివృత్తుల వస్తువుల ప్రదర్శన- అమ్మకాల వేదికలో వివిధ కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ జిల్లాల కళాకారులు తయారుచేసిన కళాకృతులు, పరికరాలు, వెదురు, తాటి ఆకులతో చేసిన వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. చేతివృత్తులనే ఆదాయ వనరుగా మార్చుకుని, వీటిని నమ్ముకున్నవారికి ఉపాధి దారి చూపుతున్నారు.