HYD: సరూర్ నగర్ చెరువు వద్ద గణేశ్ నిమజ్జనం సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో క్రేన్ సిబ్బంది నిర్లక్ష్యంతో గణనాథుడి విగ్రహం ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిమజ్జనాలకు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. పోలీసులు అప్రమత్తమై.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Locations: Hyderabad
-
బ్యాటరీ వీల్‌ఛైర్‌తో మెట్రోలో ప్రయాణానికి నిరాకరణ
హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించేందుకు బ్యాటరీ వీల్‌ఛైర్‌కు అనుమతి నిరాకరించడంతో దివ్యాంగుడైన మిట్టపల్లి శివకుమార్ ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెట్రో సిబ్బంది తనను అవమానించారని, నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే ఉండిపోయేలా చేశారని ఆయన మెట్రో ఎండీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మెట్రో సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
-
1000 కెమెరాలతో పర్యవేక్షణ.. ఆకతాయిలు తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ట్యాంక్‌బండ్ వైపు భారీ సంఖ్యలో గణపతి విగ్రహాలు తరలివస్తున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌తో పాటు భారీ సంఖ్యలో మఫ్టీ పోలీసులు నిఘా పెట్టారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
రేపు సాయంత్రం చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత
హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
-
హైదరాబాద్‌లో సందడిగా గణేశ్ నిమజ్జనాలు
TG: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సుమారు 40 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. హుస్సేన్ సాగర్‌లో మొత్తం 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా చేస్తున్నారు. 30 వేలకు మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. అదనంగా మరో 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం సమయంలో ఆర్టీసీ బస్సులు దారి మళ్లిసున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్-ప్యారడైజ్ మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచించారు.
-
గణేశ్ నిమజ్జనం.. హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే
TG: హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా గణేశ్ నిమజ్జనం సాగుతోంది. . ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకుంటున్నారు. భారీ సంఖ్యలో గణపతులు ట్యాంక్‌బండ్‌కు వస్తున్నాయి. నిమజ్జనం వేళ ఏవైనా సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు 040-27852482, 9010203626, 8712660600 నంబర్లను సంప్రదించవచ్చు.
-
రైల్వే ప్రయాణికులకో గుడ్‌న్యూస్
HYD: రానున్న దసరా, దీపావళి, ఛట్ పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫాం 10 వైపు 200 కార్ల పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అదనపు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని, టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
-
నిమజ్జనానికి ఎన్ని ప్రత్యేక బస్సులంటే
HYD : నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్‌కు చేరుకొనేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు RTC అధికారులు తెలిపారు. ఆ యా రూట్‌లకు అనుగుణంగా వివిధ ప్రాంతాల నుంచి బస్సుల రాకపోకలను క్రమబద్దీకరించినట్లు వివరించారు. ప్రయాణికులు, భక్తులు ఇతర సమాచారం కోసం 99592 26160, 99592 26154 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
-
LIVE VIDEO: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
HYD: ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. లక్షలాది భక్తుల మధ్య గణనాథుడు నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. ఎక్కడ చూసినా గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా వారి భక్తిని చాటుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ మార్గ్‌లో నాలుగో నంబరు స్టాండులో నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు.
-
సిటీ పోలీసులోకి ‘లాడెన్ జాగిలాలు’
HYD: అమెరికన్ నేవీ సీల్స్ 2011లో వినియోగించిన బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు నగర పోలీసు విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. సిటీ పోలీసులు కొత్తగా ఖరీదు చేసిన 12 జాగిలాల పిల్లల్లో ఆరు బెల్జియం మలినాయిస్ జాతివే ఉన్నాయి. దేశంలోనే ఈ తరహా జాగిలాలను నేరుగా ఎంపిక చేసి, అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి పోలీసు విభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ కావడం గమనార్హం.