Locations: Hyderabad

  • పీజీఎల్‌ సెట్‌లో ఉత్తమ ర్యాంకులు

    రంగారెడ్డి: ఎల్బీనగర్‌ హిమపురి కాలనీకి చెందిన ఎల్‌.హిమజ పీజీఎల్‌సెట్‌-ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్న హిమజ విడుదలైన ఫలితాల్లో ప్రతిభ చాటింది. ఓయూ విద్యార్థి బి.శ్రీరాం 71 మార్కులతో 2వర్యాంకు సాధించాడు. మాసబ్‌ట్యాంక్‌ శాంతినగర్‌కు చెందిన పరోపకారి మాల 4వర్యాంకు సాధించింది. అశోక్‌నగర్‌కు చెందిన ఎన్‌.రిషికృష్ణ 5వర్యాంకు సాధించాడు.
  • ప్రాథమిక కేంద్రాల్లో సన్నద్ధత అవసరం

    HYD: వానాకాలంలో మలేరియా, డయేరియా, డెంగీ వంటి వ్యాధుల నివారణకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సన్నద్ధత అవసరమని ప్రజలు కోరుతున్నారు. కొన్ని కేంద్రాల్లో బీపీ మందులు అందుబాటులో లేవు, బస్తీ దవాఖానాల్లో వైద్యులు లేకపోవడం, సమయపాలన లోపించడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. 80% సమస్యలకు ప్రాథమిక చికిత్సతో పరిష్కారం సాధ్యమవుతుందని,అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొన్నారు.
  • గోల్కొండ బోనాలకు సిద్ధం

    HYD: గోల్కొండ శ్రీజగదాంబిక అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అమ్మవారికి బోనాల సమర్పణతో వేడుకలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం మధ్యాహ్నం లంగర్‌హౌస్‌ చౌరస్తాలో ఫలహారం బండి, తొట్టెలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు, డీజీపీ, దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, కల్లుసాక పెడతారు.

  • బిల్లు చెల్లింపు స్కామ్‌లపై అప్రమత్తత

    HYD: నగరంలో కరెంటు, నీటి బిల్లు, ఇంటి పన్ను సకాలంలో చెల్లించినా, సైబర్ నేరగాళ్లు బకాయిలు ఉన్నాయంటూ మొబైల్ సందేశాలు,కాల్స్‌ ద్వారా బెదిరిస్తున్నారు. అరగంటలో చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామని, అధికారులంటూ బెదిరింపు కాల్స్ చేస్తారు. ముఖ్యంగా వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు.గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఇలాంటి కాల్స్‌ను నమ్మవద్దని, బిల్లు చెల్లింపు స్కామ్‌లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
  • ర్యాపిడోతో మెట్రో టికెట్ ఫ్రీ.. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు

    HYD: రాపిడో యాప్ ఓపెన్ చేశాక మెట్రో టికెట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఫ్రమ్, టు స్టేషన్స్‌ను ఎంటర్ చేయాలి. దాని కింద కూపన్ కోడ్ METROఅని క్యాపిటల్ లెటర్స్‌లో టైప్ చేసి అప్లై చేయాలి. వెంటనే మీ టికెట్ ధర జీరో అవుతుంది. మీ టికెట్ ధర రూ.35కంటే ఎక్కువ ఉన్నా అందులో నుంచి రూ.35మైనస్ అవుతుంది. మిగతా టికెట్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది.

  • 70 ద్విచక్ర వాహనాల స్వాధీనం

    HYD: ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన కర్డెన్ సర్చ్‌లో 70 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేశారు. వీటిలో 40 వాహనాలపై రూ.లక్షకు పైగా ట్రాఫిక్ చలాన్లు విధించారు. కార్ నంబర్ ప్లేట్‌తో ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈస్ట్ జోన్ పరిధిలో సమస్యలు ఉంటే డీసీపీ కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ బాలస్వామి తెలిపారు.

  • పుణెకు సై.. హైదరాబాద్‌కు నై

    HYD: మహారాష్ట్రలోని పుణెలో మెట్రోరైలు విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం… హైదరాబాద్‌ మెట్రోరైలు రెండోదశ విస్తరణ ప్రతిపాదనలను  విస్మరించింది. హైదరాబాద్‌ మెట్రో రెండోదశ ‘A’ భాగానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(DPR)ను కేంద్రానికి సమర్పించి 8నెలలు కావొస్తున్నా స్పందన కరవైంది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైలు అంశమే చర్చకు రాకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

  • ఈ కానిస్టేబుల్ మనకు ఆదర్శం

    HYD: మార్కెట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కే.రవి తన కవల పిల్లలు రుద్రసేన, ఇంద్రసేనల మొదటి పుట్టినరోజు సందర్భంగా నైటింగేల్ హోమ్ ఫర్ బాయ్స్‌లో పిల్లలకు అల్పాహారం, నోట్‌బుక్‌లు, పెన్నులు, పరీక్ష ప్యాడ్‌లు పంపిణీ చేశారు.పిల్లలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి రవికి కృతజ్ఞతలు చెప్పారు. ఇన్‌స్పెక్టర్ రాంచందర్, ఎస్సైలు,సిబ్బంది రవిని అభినందించారు. వృదా ఖర్చులకు పోకుండా ఇతరులకు సహాయం చేయడం అందరికీ ఆదర్శమన్నారు.
  • రోడ్డు భద్రతపై అవగాహణ

    HYD: రోడ్డు భద్రతపై బేగంపేట్ మహిళా కళాశాల, ఐక్యూఏసీ ఆంగ్ల శాఖలు అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఆచార్య కే.పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీ.జనార్దన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డా.గురువారెడ్డి సర్వేజన సంస్థతో కలసి చేస్తున్న పనులను అభినందించారు. ట్రాఫిక్ నిబంధనలు మన భద్రత కోసమేనని వాటిని కచ్చితంగా పాటించడం ద్వారా సుఖ జీవనం గడుపుతామని విద్యార్థులకు సూచించారు.

  • రాష్ట్ర ప్రజలకు బోనాలు శుభాకాంక్షలు: సీఎం రేవంత్

    TG: బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొంటుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు సుఖశాంతులతో, ఆయురోగ్యాలతో జీవించాలని రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండేలా తల్లి దీవెనలు ఉండాలని సీఎం ఆకాంక్షించారు.