Locations: Hyderabad

  • 108 వాహనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అధికారి

    మేడ్చల్: కీసర మండల పరిధిలోని కీసర ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉంటున్న 108 వాహనాన్ని జిల్లా నూతన ప్రొగ్రాం మానేజర్ భూమా నాగేందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్పిటల్ ఆవరణలో ఉన్న 108 వాహన సిబ్బంది పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయంలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాలు, వాటి పనితీరును 108 సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందుల స్టాక్ రికార్డును పరిశీలించారు.

  • బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్ధత కావాలి: తలసాని

    HYD: బీసీ రిజర్వేషన్‌కు 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బండి మెట్‌లో బస్తీ పర్యటనలో స్థానిక సమస్యలు తెలుసుకొని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కులగణన తర్వాత రిజర్వేషన్ అమలు అవుతుందని ప్రజలు నమ్ముతున్నారని, పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
  • వెంకటరమణికి బీజేపీ సన్మానం

    HYD: ఎమర్జెన్సీలో ఇందిరా గాంధీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను, రాక్షస పాలనను ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమర్జెన్సీకి అర్థశాస్త్రం సందర్భంగా నాడు జైలుశిక్షను అనుభవించిన బీజేపీ మాజీ నగర అధ్యక్షుడు వెంకటరమణిని ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నేతలు బౌద్దనగర్‌లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి సన్మానం చేశారు.

  • మహిళపై అత్యాచారం.. పీఎస్‌లో ఫిర్యాదు

    రంగారెడ్డి : కూలీ పనులకు వెళ్తున్న మహిళపై మద్యం మత్తులో నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, మెడలోని రెండు తులాల బంగారాన్ని చోరీ చేసిన ఘటన మీర్‌పేట్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. లెనిన్ నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద అర్ధరాత్రి 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగిన్నట్టు బాధిత మహిళా తెలిపారు. దీంతో పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • వాసవి సేవా సమితి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే

    HYD: వాసవి సేవా సమితి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 5వ వార్డు, వాసవీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్‌పర్సన్ కల్వసుజాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాసవి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. వైశ్యులంటే కేవలం వ్యాపారాలలోనే కాదు సేవా కార్యక్రమాలలో కూడా ముందు ఉంటారని ప్రశంసించారు.

  • గొడౌన్‌లో అగ్నిప్రమాదం

    HYD: పాతబస్తీ రమ్నస్త్ పురాలోని జుగ్నూ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఓల్ద్ మోటర్ పార్ట్స్, సైడ్ లైట్, బంపర్స్ గొడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడతో ప్రాణ నష్టం జరగలేదు. నివాస స్థలాల్లో ఇక్కడ ఇలాంటి గొడౌన్‌లు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బస్తీల్లో ఇలాంటి గొడౌన్లను తొలగించాలని స్థానికులు కోరారు.

  • రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

    మేడ్చల్: ఘట్కేసర్, బీబీ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి సిరిసిల్ల జిల్లా దేశాయ్‌పల్లికి చెందిన శ్రీనివాస్ సందె (41) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విచారణలో తేలింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ సాయీశ్వర్ గౌడ్ తెలిపారు.
  • పాఠశాలను సందర్శించిన విద్యాశాఖ కమిటీ సభ్యురాలు

    మేడ్చల్: కిష్టాపూర్ ప్రాథమిక, గురుకుల పాఠశాలలను రాష్ట్ర విద్యాశాఖ కమిటీ సభ్యురాలు జ్యోత్స్న శివా రెడ్డి సందర్శించారు. విద్యార్థుల సంఖ్య, సమస్యలపై ఉపాధ్యాయులతో చర్చించారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందని, మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తామని తెలిపారు. స్థానికులు నూతన భవన నిర్మాణానికి వినతి పత్రాన్ని సమర్పించారు. శంకరయ్య, రమేశ్ నాయుడు, లలిత తదితరులు పాల్గొన్నారు.
  • నీటి సమస్యపై వినతి

    మేడ్చల్: మేడ్చల్‌ మున్సిపాలిటీ 3వ వార్డు రాఘవేంద్రనగర్‌ కాలనీవాసులు నీటి సమస్య పరిష్కారం కోరుతూ డీఈఈ విజయలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. కొన్ని కాలనీలకు నీరు అసలు రాక, మరికొన్నిటికి 15-20 నిమిషాలు మాత్రమే వస్తోందని, ట్యాంకర్లపై ఆధారపడి నెలకు రూ.5,000-6,000 ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిషిత రెడ్డి, మురళి గౌడ్, రాంప్రసాద్, సచిన్, రవికాంత్, ఎండి సమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
  • ట్రాఫిక్ సమస్యపై వినతి

    మేడ్చల్: మీర్‌పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడలోని గాయత్రీ నగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో పిల్లలు, మహిళలు, పాదచారులకు రోడ్డు దాటడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఎక్కువగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, నర్సింహరెడ్డి, ఆంజనేయులు, ప్రేమ్ చంద్ర రెడ్డి, కిరణ్ డీసీపీ శ్రీనివాసులుకు వినతిపత్రం సమర్పించారు.