Locations: Hyderabad

  • అక్రమ కట్టడాల కూల్చివేత

    మేడ్చల్‌: మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్‌లో బుధవారం మున్సిపాలిటీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కిష్టాపూర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌కు రోడ్డును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలు, దుకాణాలు ఇబ్బంది కల్గిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను ట్రాఫిక్‌, పౌర పోలీసుల రక్షణలో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో టీపీవో రాధాకృష్ణారెడ్డి, ట్రాఫిక్‌ సీఐ హనుమాన్‌ గౌడ్‌, ఎస్‌ఐ శ్రీహరి, పాల్గొన్నారు.

  • బోనాలు వేడుకలకు మాజీ మంత్రికి ఆహ్వానం

    HYD: ఆషాఢమాసం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే బోనాలు వేడుకల్లో పాల్గొనాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ను ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. సికింద్రాబాద్ టకారబస్తీలోని వారి నివాసంలో దేవాదాయ శాఖ అధికారి రాజేష్‌తో పాటు అధికారుల బృందం ఆయనను కలసి గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి, బాల్కంపేట్ బోనాలు వేడుకల ఆహ్వాన పత్రికలను అందజేశారు.

  • కాలనీలో పర్యటించిన కార్పొరేటర్

    మేడ్చల్: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఖాజా నగర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్లు సంబంధించిన సమస్యలు ఉన్నాయని కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ జీఎచ్ఎంసీ అధికారులతో కలిసి కాలనీలలో పాదయాత్ర చేసి, సమస్యలను పరిశీలించారు. కాలనీలో పుడుకుపోయిన డ్రైనేజీ లైన్‌ను క్లియర్ చేయించారు.

  • మెట్రో ఫేజ్-2 పై కేంద్రం మొండిచేయి: శ్రీధర్ బాబు

    TG: కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశించామని, ఈ విషయంలో మరోసారి రాష్ట్రానికి మొండిచేయి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మెట్రో ఫేజ్-2 కీలకమని, దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • ఈనెల 27న జగన్నాథ రథయాత్ర

    మేడ్చల్: శ్రీ జగన్నాథ రథయాత్రను ఈనెల 27న ఘనంగా నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కూకట్‌పల్లి ప్రతినిధులు తెలిపారు. ఈ మహాయత్ర మధ్యాహ్నం మైసమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై, నిజాంపేట్, జేఎన్‌టీయూ, బాలానగర్ మెట్రో స్టేషన్ మీదుగా రాత్రి మెట్రో గార్డెన్ వద్ద ముగుస్తుందని వెల్లడించారు. ఒక లక్ష మందికిపైగా భక్తులకు మహా ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

  • ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

    రంగారెడ్డి: మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో మొయినాబాద్ నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్తున్న స్కూటీని మాస్టర్ మైండ్ పాఠశాల కరస్పాండెంట్ అతివేగంగా నడిపిన బ్రీజా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ముగ్గురు మహిళలు కిందపడగా, హైదరాబాద్‌లోని ఒలివా ఆసుపత్రికి తరలించారు. అశ్విని (37), సుశీల (60) మృతి చెందగా.. స్కూటీ నడిపిన లక్ష్మి (38) పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

  • గోల్కొండ మెట్ల బోనాలు ప్రారంభం

    TG: హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస బోనాలు గురువారం నుంచి వైభవంగా ప్రారంభంకానున్నాయి. బుధవారం మహిళలు మెట్లకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి, ఒడి బియ్యం సమర్పించారు. ఆదివారం నుంచి గురు, ఆదివారాల్లో బోనం సమర్పణలు జరుగుతాయి. ఈ బోనాలు జూలై 24 వరకు కొనసాగుతాయి. లక్షలాది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవానికి రూ.20కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

     

  • భారీగా గంజాయి పట్టివేత

    HYD: పాతబస్తీ ఐ.ఎస్. సదన్ చౌరస్తాలో టాస్క్ ఫోర్స్, ఐ.ఎస్. సదన్ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలో 45 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ జనపాల హరికృష్ణను అరెస్టు చేశారు. ఒడిశాలోని శరత్ కుమార్ సాహూ నుంచి గంజాయి కొనుగోలు చేసి, మహబూబాబాద్‌కు తరలించి, హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించాడు. శరత్ కుమార్, తునాం అరవింద్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

     

  • టీబీ నిర్మూలన చర్యలు

    మేడ్చల్: టీబీ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు టీబీ నియంత్రణ అధికారి శ్రీదేవి తెలిపారు. టీబీ ముక్తి భారత్ అభియాన్‌లో భాగంగా కూకట్‌పల్లి మెట్రో క్యాష్ అండ్ క్యారీలో 153మందికి ఉచిత టీబీ గుర్తింపు పరీక్షలు నిర్వహించి, అవగాహన కల్పించారు. నిరంతర దగ్గు, రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

  • “డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు” ర్యాలీ

    HYD: అంతర్జాతీయ మాదకద్రవ్య వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద “డ్రగ్స్ వద్దు – జీవితం ముద్దు” నినాదంతో యూనివర్సిటీ స్కాలర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ ఘనంగా నిర్వహించారు.యువత మాదకద్రవ్యాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసీం ఆవేదనవ్యక్తం చేశారు.డ్రగ్స్‌రహిత సమాజం కోసం ప్రతిఒక్కరు కృషిచేయాలని పిలుపునిచ్చారు.