Locations: Hyderabad

  • నడిరోడ్డుపై దగ్ధమైన కారు!

    హైదరాబాద్‌ నగరంలోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌ వద్ద ఓ కారు దగ్ధమైంది. పీవీఎన్‌ఆర్‌ పిల్లర్‌ నంబర్‌ 110 వద్ద కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

  • ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

    రంగారెడ్డి: పెళ్లి నిరాశతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్‌లో జరిగింది. హఫీజ్‌పేట్‌లో లక్ష్మీ ప్రియ నివాసంలో తల్లిదండ్రులతోపాటు అనిల్ అమిత్ చౌడ (30) ఉంటున్నాడు. నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తుండగా..  ఓ యువతితో ఎంగేజ్‌మెంట్ జరగగా నవంబర్‌లో పెళ్లి జరగనుంది. నిన్నరాత్రి గదిలోకి వెళ్లి సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • పిల్లలకు వాక్సిన్ పంపిణీ

    మేడ్చల్: చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో ప్రతి బుధవారం పిల్లలకు వాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్ సెంటర్‌ వద్ద పిల్లలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ టీకాలు వేయించి, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

  • కమిషన్ల కోసం కక్కుర్తి..

    మేడ్చల్: మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ పనులు చేయాలంటేనే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేస్తున్న నిర్వాకం అందుకు కారణమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బిల్లులు మంజూరు విషయంలో కాంట్రాక్టర్ చెప్పిన పర్సెంటేజ్ సదరు ఉద్యోగికి నచ్చకపోతే ఆ ఫైలు కమిషనర్ వద్దకు వెళ్లనీయకుండా కావాలని జాప్యం చేస్తున్నారని తెలిపారు.

  • కుల్కచర్లలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం

    HYD: జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట డిస్ట్రిక్ట్ 320-D ఆధ్వర్యంలో కుల్కచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. 64 మందికి కంటి పరీక్షలు చేయగా, 47 మందిలో కంటి శుక్లాలు గుర్తించారు. 30 మందికి ఆపరేషన్ అవసరమని నిర్ధారించి, పుష్పగిరి కంటి ఆసుపత్రికి పంపారు. జులై నుంచి భారీ శిబిరం నిర్వహిస్తామని విజయ వెంకటరంగా తెలిపారు.

  • సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

    HYD: కంటోన్మెంట్ వార్డు 8, బొల్లారంలోని హోలి ట్రినిటీ చర్చి నుంచి ఆర్మీ కాంపౌండ్ వరకూ రూ.25 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, అభివృద్దికి అన్ని విధాల సహకరిస్తున్నారని అందుకే కంటోన్మెంట్‌లో గతంలో పోల్చుకుంటే అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

  • ఏనుగు దంతాల స్మగ్లింగ్.. ఒకరి అరెస్టు

    HYD: బస్సులో ఏనుగు దంతాలు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శేషాచల అడవుల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయానికి యత్నించగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మహర్షి వద్ద రూ.3కోట్ల విలువ చేసే రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం రాచకొండ పోలీసులు గాలిస్తున్నారు.

  • మెట్రో టికెట్ ధరల పెంపుతో చిల్లర సమస్య

    HYD: మెట్రో రైలు టికెట్ ధరల పెంపు (రూ.11, రూ.51) తర్వాత చిల్లర సమస్య తలెత్తింది. సరిపడా చిల్లర లేకపోతే టికెట్ నిరాకరిస్తున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేశారు. యూపీఐ చెల్లింపులు మొరాయించడంతో ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ స్టేషన్లలో కౌంటర్ల వద్ద రద్దీనెలకొంది.మెట్రోసంస్థ డిజిటల్ టికెట్లను ప్రోత్సహం, చిల్లర అందుబాటులో ఉండేలా ఆర్‌బీఐతో చర్చలు జరుపుతోంది. స్మార్ట్‌ఫోన్‌లద్వారా టికెట్ కొనుగోలును ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

  • లవ్ మర్డర్స్‌పై వీహెచ్ ఆందోళన

    HYD: సమాజంలో లవ్ మర్డర్స్‌ పెరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో భర్తను భార్య, తల్లిని కూతురు చంపడం దారుణమని తెలిపారు. ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి మర్డర్స్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ టేకప్ చేయాలని కోరారు. సైకాలజిస్ట్‌లు, ఇంటెలెక్చువల్స్ దీనిపై ఆలోచన చేయాలని సూచించారు.

  • జీపీ లేఔట్‌లో అక్రమ కబ్జా.. ప్లాట్ ఓనర్ల నిరసన

    మేడ్చల్: పోచారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 2/5లో 1985లో ఏర్పడిన జీపీ లేఔట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్లాట్ ఓనర్లు నిరసన తెలిపారు. కబ్జాదారులు సీసీ కెమెరాలు, కాపలాదారుడితో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసులు సహకరించకుండా కబ్జాదారులకు మద్దతిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేసి, కబ్జాదారులను శిక్షించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.