HYD: పాతబస్తీ హరిబౌలిలోనీ చారిత్రకమైన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ 77వ వార్షిక బోనాల పండుగ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని కొండా సురేఖ నివాసంలో జరిగిన కార్యక్రమంలో అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షుడు డీఆర్ ప్రభాకర్, సలహాదారులు రాందేవ్ అగర్వాల్, కోశాధికార సతీష్, ప్రతినిధులు ఎస్పీ క్రాంతికుమార్ పాల్గొన్నారు.
Locations: Hyderabad
-
కో లివింగ్ కల్చర్ వద్దు: వీహెచ్
TG: కో- లివింగ్ కల్చర్‌లో ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ కో- లివింగ్ హాస్టల్స్ చాలానే ఉన్నాయి. అయితే, ఈ కో- లివింగ్ కల్చర్‌తో హైదరాబాద్ పేరు దెబ్బతింటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. అందుకే దీన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
-
‘కొత్తరేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలి’
HYD: అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆదేశించారు. గోల్నాక క్యాంపు కార్యాలయంలో అంబర్‌పేట సర్కిల్ పౌరసరఫరాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ఉపయోపడే రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలన్నారు.వీలైనంత త్వరగా కొత్త కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
-
శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
మేడ్చల్: వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా గౌతమ్ నగర్ డివిజన్‌లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. బుధవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవాని నగర్, వాణి నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ పర్యటించి, ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యర్థ పదార్థాలు ఇంటికి వచ్చే చెత్త రిక్షాలలో వేయాలని తెలిపారు.
-
ఓయో రూమ్‌లో యువతి ఆత్మహత్య
HYD: ఓయో రూమ్‌లో యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. బ్యూటీషియన్‌గా పని చేస్తున్న అనూష(26) పెళ్లైన కొద్దిరోజులకే భర్తతో విభేదాల కారణంగా విడిపోయి నల్లగండ్లలో తల్లిదండ్రుల వద్ద ఉండేది. ఈ 23న సాయంత్రం 6గంటలకు స్నేహితుల వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేసిన స్పందించలేదు. రాయదుర్గంలోని ఓయో రూమ్‌లో ఉరేసుకుని అనూష ఆత్మహత్యకు పాల్పడింది.
-
జూలై 9 దేశవ్యాప్త సమ్మె.. నోటీసుల జారీ
మేడ్చల్: దమ్మైగూడ, నాగారం మున్సిపాలిటీల మేనేజర్లు వెంకటేష్, సురేష్ రెడ్డిలకు CITU, IFTU కార్మిక సంఘాలు జూలై 9దేశవ్యాప్తసమ్మె నోటీసులను అందజేశాయి. CITU నాయకుడు బంగారు నర్సింగ రావు, IFTU నాయకుడు యాదన్న తదితరులు పాల్గొన్నారు.కేంద్రబీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, నాలుగు లేబర్ కోడ్‌లతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు.మున్సిపల్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, ESI, PF కోరారు.
-
ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్‌తో భద్రం
సోషల్‌మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్‌తో సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ఆకర్షిస్తారు. అందుకే తెలియని వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయొద్దని ప్రజలకు తెలంగాణ పోలీసులకు సూచించింది.
-
రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మేడ్చల్: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సంభు పాండు గుప్త ఆధ్వర్యంలో IVF 12 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని దానాల కన్న రక్తదానం గొప్పదని ఆయన అన్నారు. ‘రక్తదానం చేద్దాం మానవత్వాన్ని చాటుకుందాం’ అని అన్నారు.
-
మౌళిక వసతులపై వినతి పత్రం
మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్‌లోని ఏరోనాటిక్స్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ సొసైటీ – ఏరో నగర్ (ప్రగతి నగర్) సంక్షేమ సంఘం సభ్యులు బుధవారం పేట్ బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌ను కలిసి, కాలనీలో మౌళిక వసతులపై వినతి పత్రం అందజేశారు. గత 10 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే వివేకానంద్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
-
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ
మేడ్చల్: రామంతపూర్ డివిజన్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మధుర ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్, మధుర ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషకం అందజేశారు.