TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన అనంతరం TERIES ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ ఫయీం ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎన్నికలకు ముందు మేం.. ఎవరితో మాట్లాడుతున్నామనేది ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. నా భార్య ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఈ కేసులో అసలైన దోషులుకు శిక్ష పడుతుంది. నేను నమ్ముకుంది రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి’’అని తెలిపారు.
Locations: Hyderabad
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు వాతావరణ చల్లబడి ఒక్కసారిగా వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది.
-
సర్పంచుల ఆత్మహత్యలపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు
HYD: నాంపల్లిలో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో, పెండింగ్ బిల్లుల చెల్లింపు లేక సర్పంచుల ఆత్మహత్యలపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో సుమోటో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 18 నెలలుగా ప్రభుత్వం అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకుండా కక్ష సాధిస్తోందని, అప్పుల భారంతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. -
ప్రేమకు పదే పదే అడ్డు చెబుతుండడంతోనే హత్య: డీసీపీ
HYD: జీడిమెట్ల అంజలిని ఆమె కుమార్తె, ప్రియుడు శివ, ఆయన తమ్ముడు చున్నీతో చంపారని డీసీపీ కె.సురేశ్‌కుమార్ తెలిపారు. పదో తరగతి బాలికకు శివతో ఇన్‌స్టాలో పరిచయమై అది కాస్త ప్రేమగా మారిందని చెప్పారు. మృతురాలు అంజలి ప్రేమకు పదే పదే అడ్డు చెబుతుండడంతోనే హత్య చేశారని, 23 సాయంత్రం ఘటన జరగ్గా… 24 గంటల్లోనే ఛేదించామన్నారు. నిందితుడు శివ డీజే ఆపరేటర్ అని పేర్కొన్నారు.
-
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందుకు ఫయీం ఖురేషీ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఓ వైపు ఈ కేసులో అధికారుల పాత్ర ఏ మేరకు ఉందనే అంశంపై ఆరా తీస్తూనే.. అప్పట్లో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన వారి నుంచి వాంగ్మూలాలు సిట్ అధికారులు తీసుకుంటున్నారు. తాజాగా ఈ కేసులో TMREIS ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ స సాక్షిగా సిట్ ముందు హాజరయ్యారు.
-
‘మాదకద్రవ్య రహిత తెలంగాణ మా లక్ష్యం’
HYD: అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్యోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో విజయనగర్ కాలనీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో “మాదకద్రవ్యాల వద్దు – జీవితం ముద్దు” కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ విద్యార్థులతో కలిసి ఆసిఫ్ నగర్ ఏసీపీ, మెదీపట్నం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. “మాదకద్రవ్య రహిత తెలంగాణ మా లక్ష్యం” నినాదంతో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
-
యువతకు ఆర్యజనని సువర్ణ అవకాశం
HYD: దివ్యమైన సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్య జనని యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు మరోసారి ముందుకు వచ్చింది. ఇందుకోసం18 నుంచి 30 సంవత్సరాలలోపు యువతీ యువకులకు జాతీయస్థాయి ఆన్ లైన్ స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించనుంది. స్వామి వివేకానంద ప్రాక్టికల్ వేదాంత, జ్ఞాన యోగ ప్రసంగాల ఆధారంగా రూపొందించిన నాలెడ్జ్ స్ట్రెంత్ అనే పుస్తకంపై టెస్ట్ నిర్వహించనుంది.
-
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్‌లో టికెట్‌పై ఆసక్తి
HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్‌లో పలువురు ఆశావహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అజహరుద్దీన్‌తో పాటు పీజేఆర్ కూతురు విజయారెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం.
-
బస్తీ-బాట కార్యక్రమం
HYD: బస్తీ-బాట కార్యక్రమంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్‌లోని ప్రతిభ నగర్, వెంకటేశ్వర కాలనీ, ఆశయ నగర్, కమల నగర్ బస్తీలలో అధికారులు పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. సీవరేజ్, తాగునీరు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలపై చర్చించి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. స్థానికులు ఈ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. -
సైబర్ నేరస్తుడి వలలో వెంకన్న భక్తుడు
మేడ్చల్: పోచారం మున్సిపాలిటీకి చెందిన వెదురూరు ప్రేమ్ స్వరూప్(75) తిరుపతిలో గది బుక్ చేసేందుకు గూగుల్‌లో వరాహస్వామి గెస్ట్ హౌస్ వెబ్‌సైట్‌పై క్లిక్ చేసి సైబర్ నేరగాడి ఉచ్చులో చిక్కాడు. వాట్సాప్ ద్వారా రూ.2,750 చెల్లించినా గదిబుక్ కాలేదు. అనుమానంతో అదనంగా రూ.50చెల్లించని స్వరూప్ ఖాతా నుంచి రూ.95వేలు మూడువిడతల్లో సైబర్ నేరగాడు డ్రాచేశాడు.ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.