Locations: Hyderabad

  • కబ్జాపై సమాచారం ఇవ్వాలని నగర వాసులకు విజ్ఞప్తి

    HYD: చెరువులు, నాలాలు కబ్జాపై తమకు సమాచారం ఇవ్వాలని నగర వాసులకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. వరద నీరు రోడ్లు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా నేరుగా చెరువుల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ తెలిపారు. కబ్జాల సమాచారాన్ని వాట్సాప్‌ నంబర్‌ 87124 06899కు ఫొటోలు, లొకేషన్‌ షేర్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • బోనాల ఉత్సవాలకు మంత్రి, ఎమ్మెల్యేకు ఆహ్వానం

    HYD: ఆషాఢ మాసంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వైభవంగా జరిగే బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకటి శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లకు భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆహ్వానం అందించింది. కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో సభ్యులు ఈఆహ్వానం అందజేశారు. సప్తమాతృకలకు సప్త బంగారుబోనం సమర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది.

  • ‘బీసీ రిజర్వేషన్‌కు 42% చట్టబద్ధత కల్పించాలి’

    HYD: బీసీ రిజర్వేషన్‌కు 42 % చట్టబద్ధత కల్పించాలని, రిజర్వేషన్ ఖరారైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. చట్టబద్ధత వచ్చే వరకు ఎన్నికలు నిలిపివేయాలని, బీసీలు ఎన్నో ఏళ్లుగా రిజర్వేషన్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. 

  • స్టోర్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే

    మేడ్చల్: చర్లపల్లి డివిజన్‌లోని ఐజీ కాలనీలో బీఆర్ఎస్ కార్యకర్త నవీన్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన స్టోర్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి, వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 

  • సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా

    మేడ్చల్: రామంతపూర్ డివిజన్ ప్రగతి నగర్‌లో డ్రైనేజీ, స్టాంప్ వాటర్ డ్రైన్ పైపుల పునరుద్ధరణ అవసరమని ప్రగతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమూర్తి, సభ్యులు బుచ్చిరెడ్డి, ప్రవీణ్, శివ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్పొరేటర్ స్పందించి సమస్యను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలతో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
  • కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి

    మేడ్చల్: చర్లపల్లి డివిజన్‌లోని ఐజీ కాలనీ, విద్యా మారుతి నగర్‌లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  పర్యటించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని, పార్టీలకు అతీతంగా చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘యువత డ్రగ్స్‌కి దూరంగా ఉండాలి’

    HYD: సైదాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ కార్యక్రమంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యకుమార్ పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని, మత్తు పదార్థాలు అనర్థాలకు దారితీస్తాయని హెచ్చరించారు. పోలీసు కేసులతో జీవితం దెబ్బతింటుందని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ సోమ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

     

  • ప్రజావాణి కార్యక్రమంలో 317 దరఖాస్తులు

    HYD: మహాత్మా జ్యోతిబా పులే ప్రజ్‌భవన్‌లో నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 317 దరఖాస్తులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు 62, విద్యుత్తు శాఖకు 18, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 67, మున్సిపల్ శాఖకు 18, తదితర శాఖల నుంచి దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్‌లో చర్చించారు.

  • కొత్తగా 14 ఎక్సైజ్ స్టేషన్లు

    HYD: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బంజారాహిల్స్, కొండాపూర్, మీర్ పేట్, చిక్కడపల్లి, గండిపేట, మారేడ్ పల్లి, పెద్ద అంబర్ పేట్, మేడ్చల్, కాప్రా, నాచారం, అల్వాల్, కూకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌లు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ 14 స్టేషన్లకు అధికారులు, సిబ్బందిని నియమిస్తూ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.

  • నెలరోజుల బోనాల జాతర

    HYD: తెలంగాణలో గురువారం నుంచి జూలై 24వ తేదీ వరకు బోనాల జాతర జరుగనుంది. మొదటి రోజు లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తారు. చోటాబజార్‌లోని ఆలయం పూజారి ఇంటి నుంచి అమ్మవారి విగ్రహం, ఘట్టం ఊరేగింపు, బంజారాదర్వాజ నుంచి మొదటి బోనం ఊరేగింపు చేస్తారు.  ఇవన్నీ గోల్కొండ కోటపైకి చేరిన తర్వాత ప్రత్యేక పూజలు, బోనం అమ్మవారికి సమర్పిస్తారు.