Locations: Hyderabad

  • నేటి నుంచి చేతి ఉత్పత్తుల ప్రదర్శన

    HYD: చేతి వృత్తుల ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం బోనాల సందర్భంగా ట్యాంక్ బండ్ హెచ్ఎండీఏ మైదానంలో చేతి ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించనుంది. రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. రాష్ట్ర చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేత ఉత్పత్తులు ఉండనున్నాయి.

  • బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి మంత్రికి ఆహ్వానం

    HYD: జులై 1న జరిగే బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరవ్వాలని ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అధికారులు హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళ్యాణ ఉత్సవాల ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించి, హాజరుకావాలని కోరారు.

  • రేపటి నుంచి గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభం

    HYD: ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొంట కోటలో బోనాలు మొదట ప్రారంభించే సంప్రదాయం కులీకుతుబ్‌షా కాలం నుంచి వస్తుంది. బోనాలు సంప్రదాయం ప్రకారం ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో ప్రారంభం కావడం ఆనవాయితీ. అప్పట్లో కులీకుతుబ్‌షా నిర్వహించగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంది.

  • ప్రేమించిన వ్యక్తితో విభేదాలు.. యువతి ఆత్మహత్య

    మేడ్చల్: ప్రేమించిన వ్యక్తితో విభేదాల కారణంగా కేర్‌టేకర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.నేపాల్‌కు చెందిన రీసాచౌదరి(21) కొంపల్లిలోని అపర్ణఫాంమెడోస్‌లోని శ్రీనివాసరావు విల్లాలో సంరక్షకురాలిగా పనిచేస్తోంది.ఇటీవల ఆమెప్రేమించిన వ్యక్తితో విభేదాలు తలెత్తడంతో విల్లాలోని మెట్లకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విల్లాయజమాని ఫిర్యాదుతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కే.విజయవర్ధన్ తెలిపారు.

  • స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

    HYD: జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ మీట్- 2025ను విక్టోరియా ప్లే గ్రౌండ్‌లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, ఏసీ స్పోర్ట్స్ యాదగిరి పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, 146 మంది కార్పొరేటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

  • నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం

    HYD: విద్యుత్తు ఫీడర్లలో మరమ్మతుల కారణంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సరఫరా ఉండదు.  ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బషీర్‌బాగ్ మెయిన్ రోడ్డు, బీఎస్ఎన్ఎల్ జోనల్ కార్యాలయం, ప్యాలస్ కాలనీ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకాయుక్త, ఎన్ఐఐటీ, ఓహ్రీస్ హోటల్, సత్యనారాయణ జెవెలరీ, ఎస్ఐఐసీ బిల్డింగ్,తదితర ప్రాంతాాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని సంబంధిత అధికారులు తెలిపారు.

  • రేషన్ షాప్‌ పరిశీలన

    మేడ్చల్: చర్లపల్లి డివిజన్‌లోని రేషన్ షాప్‌లను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పరిశీలించారు. నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కార్పొరేటర్‌ని ప్రజలు ప్రశంసలతో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

  • ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

    HYD: రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 349 ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని అధికారులు గుర్తించారు. వర్షం సమాచారం తెలియగానే ఈ ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ఈ ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలన్నారు. చెరువులు కబ్జాకు గురైతే తొలగించాలని కోర్టులు చెప్పాయన్నారు.

  • జీహెచ్ఎంసీ కార్యాలయంలో విగ్రహాల తొలగింపు

    HYD: నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో దశాబ్దన్నర కాలంగా ముసుగులతో ఉన్న రాజశేఖర్ రెడ్డి, మహాత్మాగాంధీ, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలను తొలగించారు. 2009లో ఏర్పాటైన ఈ విగ్రహాలు ఆవిష్కరణ లేకుండా ముసుగులోనే ఉన్నాయి. మేయర్ విజయలక్ష్మి సూచనల మేరకు, స్టాండింగ్ కమిటీ నిర్ణయంతో వాటిని తరలించారు.  త్వరలోనే వాటర్ ఫౌంటేయిన్ ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

  • స్వీట్ షాపులు, బేకరీల్లోనూ కల్తీ పదార్థాలు

    HYD: నగరంలో హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీలు, ఆసుపత్రి క్యాంటీన్లలో కల్తీ, నాసిరక ఆహారం విస్తృతంగా ఉన్నట్లు జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో వెల్లడైంది. 73ఆసుపత్రుల్లో 14, 90 బేకరీల్లో 80, 60 స్వీట్ షాపుల్లో నాణ్యత లోపాలు గుర్తించారు. హాస్టళ్లలోనూ నాసిరక ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ నిరంతర తనిఖీలతో నాణ్యమైన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.