మేడ్చల్: మూసాపేటలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, బీఐఎస్ అనుమతి లేకుండా పలు హోటళ్లు, వాణిజ్య కేంద్రాల పేర్లతో వాటర్ బాటిళ్లను తయారు చేస్తున్న కేంద్రంపై అధికారులు దాడులు చేశారు. 8వేల ఒక లీటరు సీసాలు, 13వేల 500 ఎంఎల్ వాటర్ బాటిళ్లు, 15వేల 250 ఎంఎల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Locations: Hyderabad
-
మెట్రో ప్రయాణానికి చిల్లర సమస్యలు
HYD: మెట్రోరైలు ఛార్జీల పెంపు తర్వాత చిల్లర సమస్య తలెత్తింది. మెట్రోరైలులో రూ.11, రూ.51 టికెట్ ధరలు ఉన్నాయి. సరిపడా చిల్లర ఇవ్వకపోతే టికెట్ నిరాకరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. చాలావరకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నా.. కొన్నిసార్లు అవి మొరాయిస్తున్నాయి. అలాంటి సమయంలో సరిపడా చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. చిల్లర సమస్య పరిష్కారానికి మెట్రోరైలు సంస్థ వేర్వేరు ప్రయత్నాలు మొదలెట్టింది.
HY
-
బకాయిల వసూలు కోసం ప్రయత్నం
HYD: మహానగరానికి తాగునీటిని అందిస్తున్న జలమండలి బకాయిల భారంతో సతమతమవుతోంది. సుమారు రూ.3 వేల కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. వీటి వసూలుకు జలమండలి చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడంలేదు. బల్క్ కాలనీల బకాయిలతోపాటు వాణిజ్య కనెక్షన్ల నుంచి భారీ మొత్తంలో వసూలు కావాల్సి ఉంది. మొండి బకాయిల వసూలుపై జలమండలి ప్రయత్నాలు చేస్తుంది.
-
బంగారు దోపిడీ కేసు.. 18 మంది అరెస్ట్
HYD: తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామని వ్యాపారిని నమ్మించి ఎస్‌వోటీ పోలీసులమంటూ బెదిరించి రూ.72లక్షలు దోపిడీ చేసిన మూడు వేర్వేరు ముఠాల్లోని 28 మంది నిందితుల్లో 18 మందిని ఉత్తరమండలం టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.మిగతావారు పరారీలో ఉన్నారు. రూ.43లక్షలు, 59 గ్రాముల బంగారు నగలు, 23 ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సికింద్రాబాద్ ఉత్తరమండలం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ, తదితరులు వివరాలను వెల్లడించారు.
-
బస్తీల్లో జీవనశైలి వ్యాధుల దాడి
HYD: బస్తీలపై జీవనశైలి వ్యాధులు(ఎన్‌సీడీలు) దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా అధిక బరువు, ఊబకాయం, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్(హెచ్‌హెచ్‌ఎఫ్) రాజేంద్రనగర్‌లోని ఎంఎం పహాడి, సులేమాన్‌నగర్,చింతల్‌మెట్ ఇతర మరికొన్ని బస్తీల్లోని 12 వేల మందికి పరీక్షలు చేసింది.వారిలో 69 శాతం మంది అధిక బరువు, 25 శాతం మంది గ్రేడ్-2 ఊబకాయ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు మధుమేహం,అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పటికీ మందులు వాడకుండానే నెట్టుకొస్తున్నారు.
-
ఆసుపత్రిలో అధ్వానంగా వంటశాలలు, క్యాంటీన్లు
HYD: గ్రేటర్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని వంటశాలలు, క్యాంటీన్లు అధ్వానంగా ఉంటున్నాయి. నగర వ్యాప్తంగా 73 ఆసుపత్రుల్లో మంగళవారం బల్దియా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్, 2006, రెగ్యులేషన్స్, 2011 ప్రకారం ఆయా నిబంధనలు పాటించని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. పదార్థాలు నిల్వ చేసేందుకు సరైన స్థలం లేకపోవడం, తదితర లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
-
హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు
HYD: నగరంలో డెంగీ జ్వరాలు పడగ విప్పాయి. దోమకాటుతో బస్తీలు, కాలనీల్లో జ్వరం బాధితులు పెరుగుతున్నారు. గత 3 రోజుల్లో హైదరాబాద్ జిల్లాలో 27 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ, ఎంటమాలజీ అధికారులు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.
-
రోడ్డు ప్రమాదాలు.. 54 బ్లాక్‌స్పాట్స్ గుర్తింపు
HYD: అతివేగం, అపసవ్యదిశ, మద్యం మత్తులో వాహనం నడుపుతూ అధికశాతం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఏటేటా పెరుగుతున్న వాహనాలకు సరిపడినంత రహదారుల విస్తరణ జరగకపోవటం, గుంతలు, ఆక్రమణలు రోడ్డు ప్రమాదాల కారణాలుగా పోలీసులు దర్యాప్తులో బయటపడుతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 54 బ్లాక్‌స్పాట్స్ (ప్రమాదాలు జరిగే ప్రదేశాలు)ను గుర్తించారు. మూడేళ్లుగా 300-500 మీటర్ల పరిధిలో ఒకేచోట ఎక్కువ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకొని బ్లాక్‌స్పాట్స్‌గా నిర్ణయిస్తారు.
-
కనెక్షన్ల మంజూరుపై విద్యుత్తు పంపిణీ సంస్థ దృష్టి
HYD: నగరంలో పెరుగుతున్న విద్యుత్తు వాహనాలకు తగ్గట్టుగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు వేగవంతంగా కనెక్షన్ల మంజూరుపై విద్యుత్తు పంపిణీ సంస్థ దృష్టి పెట్టింది. కేటగిరి-9 కింద కనెక్షన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందన్న ఛార్జింగ్ ఆపరేటర్ల ఫిర్యాదుల నేపథ్యంలో డిస్కం ఇకపై ప్రతి వారం సమీక్ష చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు సిటీలోని 9 సర్కిళ్ల పరిధిలో 271 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి.
-
‘ఆరోగ్య మహిళా క్లినిక్’
HYD: ‘ఆరోగ్య మహిళా క్లినిక్’ ఇదివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఆ సేవలను వైద్య విధాన పరిషత్ (వీవీపీ) అన్ని ఆసుపత్రుల్లో విస్తరిస్తున్నారు.ఇందులో భాగంగానే కింగ్‌కోఠి(వీవీపీ) జిల్లా ఆసుపత్రితో పాటు నగరంలోని నాంపల్లి, గోల్కొండ,మలక్‌పేట్ వంటి ఆసుపత్రుల్లో ప్రతీ మంగళవారం ‘ఆరోగ్య మహిళా క్లినిక్’లు నిర్వహించనున్నారు.ఇప్పటికే దీనిపై కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో వైద్యబృందానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.