Locations: Hyderabad

  • మధురానగర్ PS పరిధిలో భారీ చోరీ

    HYD: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విశ్రాంత GST అధికారి తన కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్ళి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని అరకిలో బంగారం, వజ్రాభరణాలు, నగదు దొంగతనం చేసి పరారయ్యారు. ఈ మేరకు  పోలీసులకు విశ్రాంత GST సూపరింటెండెంట్ ఆకుల హరిరావు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • డిమాండ్‌కు అనుగుణంగా పూలను సిద్ధం

    HYD: బోనం అలంకరణకు పూలు, మామిడి ఆకులు అవసరం కాగా రైతు బజార్లు, పూలమార్కెట్లలో వ్యాపారం ఊపందుకుంటోంది. డిమాండ్‌కు అనుగుణంగా పూలను సిద్ధం చేయనున్నారు. ఫలితంగా వేలాది మంది రైతులు, వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ నుంచి పెద్దఎత్తున పూలు సరఫరా చేయనున్నారు.

  • బోనాల పండగలో అమ్మవారికి తొట్టెల సమర్పణ ఆనవాయితీ

    HYD: బోనాల పండగలో అమ్మవారికి తొట్టెల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. కర్రలు, కాగితాలతో  చేసిన తొట్టెలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవార్లకు సమర్పిస్తారు. జియాగూడ, మెహిదీపట్నం, ధూల్‌పేట్, లాల్‌దర్వాజా, బేగంబజార్‌లో అనేక కుటుంబాలు తొట్టెల తయారీని వ్యాపారంగా మలుచుకున్నాయి. ఆర్డర్ల ఆధారంగా తయారు చేస్తుంటారు. రూ.200 నుంచి రూ.30వేల వరకు ధర పలుకుతున్నాయి.

  • వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక రైళ్లు

    HYD : ప్రయాణికుల డిమాండ్‌ మేరకు చర్లపల్లి-రామేశ్వరం, హైదరాబాద్‌ – కొల్లంల మధ్య 16ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జూలై 2 నుంచి 23 వరకు చర్లపల్లి-రామేశ్వరం మధ్య(07695) 4 రైళ్లు, జూలై 4నుంచి 25వరకు రామేశ్వరం-చర్లపల్లి మధ్య(07696) 4 రైళ్లు, జూలై 5 నుంచి 26వరకు హైదరాబాద్‌-కొల్లం మధ్య(07193) 4 రైళ్లు, జూలై 7 నుంచి 28వరకు కొల్లం-హైదరాబాద్‌ మధ్య (07194) 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

  • GHMC యాప్‌తో సమస్యల పరిష్కారం

    HYD: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్లు, మంచినీటి సమస్యలతో సహా వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) చర్యలు చేపట్టింది. GHMC యాప్ ద్వారా సమస్యల వివరాలను నమోదు చేసి ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారం చేస్తామని GHMC తెలిపింది.ఈ యాప్‌ను ఇప్పటికే 15,000 మందికి పైగా పౌరులు ఉపయోగిస్తున్నారని, సమస్యలను సులభంగా నమోదు చేసేందుకు ఇది ఉపయోగపడుతోందని GHMC వెల్లడించింది.

  • GHMC ఆస్తుల లెక్క‌.. ప‌క్కా

    HYD : ఆస్తిపన్ను ఆదాయం పెంచుకునేందుకు ప్రజల ఆస్తుల సర్వే చేపట్టిన GHMC.. తమ ఆస్తుల్ని కూడా తెలుసుకునేందుకు పనిలో పనిగా ‘డ్రోన్‌ బేస్డ్‌ GIS సర్వే’ను ప్రారంభించింది. సర్వేలో భాగంగా ఆటస్థలాలు, పార్కులు, పబ్లిక్‌ టాయ్‌లెట్లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్సుల వివరాలు క్రోడీకరించి.. వాటిని జియో మ్యాపింగ్‌ కూడా చేశారు. మొత్తానికి GHMC ఆస్తుల్ని GIS పోర్టల్‌లో మ్యాపింగ్‌ చేస్తున్నారు.

  • కళాకారుల విగ్రహ తయారీ, నవరాత్రి చర్చలు

    HYD: వినాయకచవితికి మరో 2 నెలలే సమయం ఉండడంతో ధూల్‌పేటలో సందడి మొదలైంది. విభిన్న రూపాల్లో గణనాథులను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. జియాగూడలోని ‘కళాకార్‌’లను యువత సందర్శించింది. ఇప్పటికే బుకింగ్స్ మొదలుకావడం విశేషం. విగ్రహాల ధరలు భారీగానే ఉండడంతో యూత్ అసోసియేషన్ సభ్యులు సమావేశమై, ఈ సీజన్‌లో నవరాత్రులు ఏ విధంగా చేద్దామని చర్చలు మొదలుపెట్టారు.

  • 180 ఏళ్ల చరిత్ర గల డొక్కలమ్మ దేవాలయం

    HYD: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం సమీపంలోని శివాజీ నగర్‌లో 180 ఏళ్ల చరిత్ర కలిగిన డొక్కలమ్మ తల్లి దేవాలయం ఉంది. చిన్న మస్తాదేవి రూపమే డొక్కలమ్మ అని ఇక్కడి భక్తులు చెబుతారు. అమ్మవారికి పూజలు, ముడుపు కట్టడం ద్వారా నాలుగు వారాల్లో కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారని అర్చకులు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు పలుప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు.

  • బోనాల పండుగ అనేక మందికి ఉపాధి

    HYD: ఈనెల 26న గోల్కొండ నుంచి తొలిబోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతర, 14న రంగం భవిష్యవాణి, 20న లాల్‌దర్వాజా బోనాల జాతర, 21న ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు,24న ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటమే కాకుండా, ఈనెల రోజుల పండగ సామాజిక,ఆర్థికంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది.

  • బోనాలకు మట్టి కుండల తయారీ

    HYD: గోల్కొండలో అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తుండగా ఉత్సవ సమితి కుండల తయారీ బాధ్యతను మెహిదీపట్నం కుమ్మరివాడలోని దామ కుటుంబానికి అప్పగించింది. ఇందులో భాగంగా నైవేద్యం సమర్పించే కుండతో పాటు దానిపై ఉండే చిన్న బుడ్డి, దీపం పెట్టే ముంత కలిపి ఒక సెట్‌లాగా వీరు అందిస్తున్నారు. పండగకు రెండు నెలల ముందు నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది.